అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ కోసం జరుగుతున్న రిపబ్లికన్ పార్టీ డిబేట్‌లో ఇద్దరు భారతీయ మూలాలున్న అభ్యర్థుల మధ్య చర్చ స్థాయిని మించి వాడీవేడిగా సాగింది. సంయమనం కోల్పోయి ఒకరిపై మరొకరు మాటల శస్త్రాలతో దాడికి దిగారు. ఆక్రోశంతో అరుస్తూ.. వేళ్లు చూపారు. అధ్యక్ష ఎన్నికలో ప్రాథమిక చర్చ సందర్భంగా భారతీయ సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ముఖాముఖిగా రావడం ఇదే ప్రథమం.
నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరు భారతీయ-అమెరికన్ ఆశావహులు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష స్థానం కోసం పోటీ పడ్డారు. విదేశాంగ విధాన సమస్యలపై జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ డిబేట్‌లో మాటల శస్త్రాలతో హద్దులు మీరారు. ఉక్రెయన్, రష్యా యుద్ధం అంశంపై చర్చ తారాస్థాయికి చేరింది. అమెరికా అనుసరిస్తున్న విధానాలపై ఇద్దరు అభ్యర్థులు విభేదించుకున్నారు.
ఉక్రెయిన్ పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానంపై రామస్వామికి సరైన అవగాహన లేదని నిక్కి హేలీ ఆరోపించారు. అమెరికా భద్రతకు ఇలాంటి అభ్యర్థులతో ముప్పు అని దుయ్యబట్టారు. అమెరికా శత్రువులకు మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఉక్రెయిన్‌ను రష్యాకు అప్పగించాలనేదే వారి అభిప్రాయమా..? అంటూ ప్రశ్నించారు. రష్యా , పుతిన్ పట్ల సానుకూల వైఖరి పనికిరాదని అన్నారు.
నిక్కీ హేలి మాట్లాడుతుండగా.. తరుచూ కలుగజేసుకున్న రామస్వామి.. చెప్పేదంతా అబద్ధం అని అన్నారు. నిక్కీ హేలికి విదేశీ విధానాలపై సరైన అవగాహన లేదని అన్నారు. అమెరికా విదేశాలకు కేటాయిస్తున్న మిలిటరీ ఫోర్స్‌ను ఏమాత్రం వినియోగించినా.. దక్షిణ ప్రాంతం నుంచి ఎదురైతున్న తిరుగుబాటును అంతం చేయొచ్చని అన్నారు. ఈ క్రమంలో చర్చ వాడీవేడీగా సాగింది. అరుస్తూ వేళ్లు చూపించుకునే స్థాయికి చేరింది.
ఇదీ చదవండి: Wagner Chief Plane Crash Video: అంతా 30 సెకన్లలోనే.. వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment