presidential debate
-
Kamala Harris: రెండో డిబేట్‌కు నేను రెడీ
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో రెండో అధ్యక్ష చర్చకు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ సమ్మతించారు. అక్టోబర్ 23న జరిగే డిబేట్లో పాల్గొనాలని సీఎన్ఎన్ ఛానల్ పంపిన ఆహ్వానాన్ని శనివారం హారిస్ అంగీకరించారు. ట్రంప్‌తో వేదిక పంచుకోవడానికి ఉపాధ్యక్షురాలు సిద్ధంగా ఉన్నారని హారిస్ ప్రచార బృందం సారథి ఒమాలి డిల్లాన్ ఒక ప్రకటనలో తెలిపారు.రెండో డిబేట్‌కు తాను సంతోషంగా సమ్మతిస్తానని హారిస్ శనివారం ట్వీట్ చేశారు. అక్టోబరు 23న ట్రంప్ తనతో చర్చకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 10న జరిగిన తొలి డిబేట్లో ట్రంప్‌పై హారిస్ పైచేయి సాధించడం తెలిసిందే. మరో డిబేట్ ఆహ్వానంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 5న జరగనున్న విషయం తెలిసిందే. -
USA Presidential Elections 2024: కమలదే పై చేయి
డిబేట్ కోసం ప్రత్యర్థులిద్దరూ ఏబీసీ వేదికపైకి రాగానే హారిసే చొరవ తీసుకుని ట్రంప్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. తద్వారా ముందే పైచేయి సాధించారు. డిబేట్ చక్కగా సాగాలని ఆమె ఆకాంక్షించగా, ‘హావ్ ఫన్’ అంటూ ట్రంప్ స్పందించారు.గంటా నలభై ఐదు నిమిషాల పాటు సాగిన డిబేట్ ముగిశాక మాత్రం కరచాలనం వంటివేమీ లేకుండానే ఎవరికి వాళ్లు వేదిక నుంచి నిష్క్రమించారు.డిబేట్ పొడవునా హారిస్ పదేపదే ట్రంప్‌ను ఉడికించే వ్యాఖ్యలు చేశారు. పలు కేసుల్లో ఆయన దోషి అని ఇప్పటికే నిరూపణ అయిందంటూ ఎత్తిచూపారు. ఆయనపై మరెన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ట్రంప్ మాట్లాడుతుండగా పదేపదే నవ్వులు, ప్రశ్నార్థక చూపులతో ఆయన్ను ఒత్తిడిలోకి నెట్టారు.ఈ ఎత్తుగడలన్నీ బాగా ఫలించాయి. హారిస్ ఇలాంటి విమర్శలు చేసినప్పుడల్లా ట్రంప్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆగ్రహంలో అదుపు తప్పి పదేపదే అబద్ధాలు, అవాస్తవాలు చెప్పారు.ఆఫ్రో అమెరికన్ల ఓట్ల కోసం హారిస్ ఇటీవల ఆమె నల్లజాతి మూలాలను పదేపదే చెప్పుకుంటున్నారన్న తన గత వ్యాఖ్యలపై స్పందించేందుకు ట్రంప్ నిరాకరించారు. హారిస్ మాత్రం పలు సందర్భాల్లో ట్రంప్ చేసిన వివాదాస్పద జాతి వివక్షపూరిత, విద్వేష వ్యాఖ్యలన్నింటినీ ఏకరువు పెట్టారు.వాషింగ్టన్: అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూసిన తొలి, బహుశా ఏకైక ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59)దే పై చేయి అయింది. ఆమె దూకుడు ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (78) వెలవెలబోయారు. మంగళవారం రాత్రి పెన్సిల్వేనియాలో ఏబీసీ వార్తా సంస్థ వేదికగా జరిగిన డిబేట్లో మాజీ అధ్యక్షునిపై హారిస్ ఆద్యంతం స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు. దాదాపుగా ప్రతి అంశంలోనూ ట్రంప్‌ను చిత్తు చేశారు. ఆమె పక్కాగా హోం వర్క్ చేసి వచి్చన తీరు డిబేట్లో అడుగడుగునా కని్పంచింది. తొలుత కాస్త తడబడ్డా డిబేట్ సాగుతున్న కొద్దీ హారిస్ దూకుడు కనబరిచారు. పదునైన పంచ్‌లతో, టైమ్లీ వన్ లైనర్లతో ఎక్కడికక్కడ ట్రంప్‌ను ఇరుకున పెట్టారు. ఆర్థిక వ్యవస్థ మొదలుకుని విదేశీ విధానం, వలసలు, అబార్షన్ల దాకా ప్రతి అంశం మీదా చర్చను తను కోరుకున్న దిశగా నడిపించడంలో విజయవంతమయ్యారు. పూర్వాశ్రమంలో లాయర్ అయిన హారిస్ వాదనా పటిమ ముందు ట్రంప్ నిలువలేకపోయారు. చాలావరకు ఆమె ప్రశ్నలకు, లేవనెత్తిన అంశాలకు వివరణలు ఇచ్చుకోవడానికే పరిమితమయ్యారు. తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్రంప్ ఓ ఆటాడుకోవడం తెలిసిందే. ట్రంప్ పచ్చి అబద్దాలు చెప్పినా బైడెన్ కనీసం వాటిని వేలెత్తి చూపలేకపోయారు. పైగా ప్రసంగం మధ్యలో పదేపదే ఆగుతూ, పదాల కోసం తడుముకుంటూ, వయోభారంతో వణుకుతూ అభాసుపాలయ్యారు. ఈ దారుణ వైఫల్యంతో చివరికి పోటీ నుంచే బైడెన్ తప్పుకోవాల్సి వచి్చంది. ఆయన స్థానంలో అధ్యక్ష రేసులోకి వచ్చిన హారిస్ మాత్రం తాజా డిబేట్లో ట్రంప్‌కు చెమటలు పట్టించారు. ‘‘మన దేశాన్ని ఎలా నడపాలన్న ప్రధానాంశంపై ఈ రాత్రి మీరు ఇంతసేపూ రెండు భిన్నమైన వాదనలు విన్నారు. ఒకటి భవిష్యత్తుపై దృష్టి పెట్టిన నా వాదన. రెండోది గతం గురించి మాత్రమే మాట్లాడిన, దేశాన్ని వెనక్కే తీసుకెళ్లజూస్తున్న ట్రంప్ వాదన’’ అంటూ డిబేట్‌ను అంతే ప్రభావవంతంగా ముగించారు హారిస్.అబార్షన్‌పై హారిస్ → ట్రంప్ గెలిస్తే అబార్షన్లను నిషేధిస్తూ చట్టం తెస్తారు. → గర్భధారణలు, అబార్షన్లను ప్రభుత్వం వేయి కళ్లతో గమనిస్తుంటుంది. → అమెరికన్ల శరీరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోరాదన్నదే నా వైఖరి. → ట్రంప్ మాత్రం మహిళల శరీరాలపై హక్కులు ప్రభుత్వాలవేనంటున్నారు.ట్రంప్ → అబార్షన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలన్నదే నా విధానం. → అదిప్పటికే అమల్లో ఉంది. కనుక దీనిపై అసలు గొడవ గానీ, భిన్నాభిప్రాయాలు గానీ లేవు. → అంతే తప్ప నేనేమీ అబార్షన్లను నిషేధించబోవడం లేదు. → ఈ విషయంలో హారిస్ చెప్పేవన్నీ అబద్ధాలే.ఎన్నికల ర్యాలీలపైహారిస్ → ట్రంప్ ఎన్నికల ర్యాలీలు ఆద్యంతం పరమ బోరుగా సాగుతున్నాయి.→ జనాన్ని ఆకట్టుకునేలా మాట్లాడటంలో ఆయన ఘోరంగా విపలమవుతున్నారు. → విండ్ మిల్లుల వల్ల క్యాన్సర్ వస్తుంది వంటి కామెంట్లతో అభాసుపాలవుతున్నారు. → ట్రంప్ ప్రసంగం వినలేక జనం మధ్యలోనే వెళ్లిపోతున్నారు.ట్రంప్ → అన్నీ శుద్ధ అబద్ధాలు. బైడెన్–హారిస్ విధానాలతో అమెరికా అన్ని రంగాల్లోనూ కుదేలవుతోంది. అందుకే అమెరికన్లు పాత రోజులను కోరుకుంటున్నారు.→ దాంతో నా ర్యాలీలకు జనం పోటెత్తుతున్నారు. → వాటికి అమెరికా చరిత్రలోనూ అపూర్వమైన ఆదరణ దక్కుతోంది. → హారిస్ తన ర్యాలీలకు డబ్బులిచ్చి జనాన్ని రప్పించుకుంటున్నారు.ఆర్థిక వ్యవస్థపైట్రంప్: ఈ విషయంలో నేనేం చేయబోతున్నదీ అందరికీ తెలుసు. నా హయాంలో కరోనా కల్లోలాన్ని తట్టుకుంటూ అమెరికా ఆర్థిక వ్యవస్థను గొప్పగా మలిచా. దాన్ని మరోసారి చేసి చూపిస్తా. పన్నులకు భారీగా కోత పెడతా. హారిస్ మార్క్సిస్టు. మార్క్సిస్టు తండ్రి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విధానాల్లో ఆమె ఇప్పుడు నా భాషనే మాట్లాడుతున్నారు. కానీ గెలిచారంటే మాత్రం దేశాన్ని సర్వనాశనం చేస్తారు. బైడెన్‌కు, ఆమెకు తేడా లేదు. హారిస్: నేను బైడెన్నూ కాను, ట్రంప్‌ను అంతకన్నా కాను. ఈ విషయంలో నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. దేశానికి కొత్త తరం నాయకత్వాన్ని అందిస్తా. ఉత్త మాటలే తప్ప నిజానికి ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళికా లేదు. తన క్షేమం తప్ప ఆయనకు మీరెవరూ పట్టరు. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచి్చన నాకు ఆర్థికంగా దేశానికి ఏం కావాలో బాగా తెలుసు.వలసలపైట్రంప్ సరిహద్దుల నుంచి లక్షలాది మంది చొరబడుతున్నారంటే వలసల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న హారిసే ప్రధాన కారణం. వాళ్లు మన పెంపుడు జంతువులను కూడా తినేస్తున్నారు. ఈ చొరబాట్లు అమెరికాకు చాలా చేటు చేస్తాయి.హారిస్ ట్రంప్ వల్లే వలసల బిల్లు బుట్టదాఖలైందని విమర్శించడం మినహా ఈ అంశంపై పెద్దగా ఏమీ మాట్లాడలేదు. వలసదారులు పెంపుడు జంతువులను తింటున్నారన్న ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికన్లే పెదవి విరుస్తున్న నేపథ్యంలో వాటిపై వ్యూహాత్మక మౌనం పాటించారు.యుద్ధాలు, విదేశీ వ్యవహారాలపై... ట్రంప్ → నేను గెలిస్తే ఉక్రెయిన్ యుద్ధానికి ఒక్క రోజులో ముగింపు పలుకుతా. నేను ప్రెసిడెంట్‌గా ఉంటే యుద్ధం జరిగేదే కాదు. (ఉక్రెయిన్ గెలవాలనుకుంటున్నారా అన్న మోడరేటర్ల ప్రశ్నకు బదులు దాటవేశారు. పైగా యుద్ధానికి మిలియన్ల మంది బలయ్యారని అవాస్తవాలు చెప్పారు) → 2021లో అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం వైదొలగడం దేశ చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన సందర్భం. → ఇజ్రాయెల్‌ను హారిస్ ద్వేషిస్తారు. హారిస్ గెలిస్తే రెండేళ్లలోనే ఇజ్రాయెల్ సర్వనాశనం ఖాయం. అరబ్బులన్నా ఆమెకు ద్వేషమే.హారిస్ → అఫ్గాన్ నుంచి వైదొలగాలన్న బైడెన్ నిర్ణయం నాటి పరిస్థితుల్లో పూర్తిగా సబబే. ట్రంప్ తాలిబన్లతో అత్యంత బలహీన ఒప్పందం చేసుకున్నారు.→ నియంతలంటే ట్రంప్‌కు మహా ఆరాధన.→ నేను ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తానన్నది పచ్చి అబద్ధం. యూదు రాజ్యాన్ని మొదటినుంచీ సమర్థిస్తున్నా. అక్టోబర్ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్‌కు స్వీయరక్షణకు అన్ని హక్కులూ ఉన్నాయి. కానీ అమాయక పాలస్తీనియన్లు భారీ సంఖ్యలో యుద్ధానికి బలవుతున్నారన్నది కూడా వాస్తవమే. కనుక యుద్ధం తక్షణం ఆగాలి. కాల్పుల విరమణ, బందీల విడుదలే అందుకు మార్గం. దానికోసం కృషి చేస్తా.2020 ఎన్నికల ఫలితాలపైట్రంప్: వాటిలో నిజమైన విజేతను నేనే. క్యాపిటల్ హిల్ భవనంపై దాడితో నాకు సంబంధం లేదు. హారిస్: అమెరికా చరిత్రపై చెరగని మచ్చ ఏదన్నా ఉంటే అది కాపిటల్ హిల్‌పై దాడే. దాన్ని మర్చిపోయి ముందుకు సాగాలి. ట్రంప్‌పై హారిస్ పంచ్‌లు → ట్రంప్ ఓ బలహీన నాయకుడు. తప్పుడు నేత. ఆయన్ను చూసి ప్రపంచ దేశాధినేతలంతా నవ్వుతున్నారు. → అధ్యక్ష పదవికి ట్రంప్ కళంకమని ఆయనతో కలిసి పని చేసిన సైనిక ఉన్నతాధికారులే అంటున్నారు. → ట్రంప్ అంటేనే అబద్ధాలు, అభూత కల్పనలు. ఈ డిబేట్లో కూడా ఆయన చేసేదదే. → ట్రంప్ ఎంతసేపూ తన గురించే మాట్లాడతారు. ప్రజలు ఆయనకు అసలే పట్టరు. దేశానికి కావాల్సింది ప్రజల కోసం పాటుపడే నాయకుడే తప్ప ట్రంప్ వంటి స్వార్థపరుడు కాదు. → ఆయన 2020 ఎన్నికల్లో ఓడిపోయారు. 8.1 కోట్ల మంది ఆయనకు అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసన పలికారు (బైడెన్‌కు ఓటేసిన వారి సంఖ్యను ఉటంకిస్తూ). దాన్ని ట్రంప్ ఇప్పటికీ అస్సలు జీరి్ణంచుకోలేకపోతున్నారు.హారిస్‌కే 63 శాతం మంది ఓటు → డిబేట్లో ట్రంప్‌ను హారిస్ చిత్తు చేశారని సీఎన్ఎన్ వార్తా సంస్థ నిర్వహించిన ఫ్లాష్ పోల్‌లో 63 శాతం మంది పేర్కొన్నారు! → ట్రంప్‌కు బాగా అనుకూలమని పేరున్న ఫాక్స్ న్యూస్ కూడా డిబేట్ విజేత హారిసేనని అంగీకరించడం విశేషం. → చర్చకు వేదికైన ఏబీసీ న్యూస్ అభ్యర్థులిద్దరి వ్యాఖ్యలు, ప్రకటనలను లైవ్‌లో అప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసింది.ట్రంప్ చెప్పిన వాటిలో చాలావరకు అవాస్తవాలేనని తేలడం విశేషం. -
Donald Trump: ‘ఫాక్స్’లో అయితేనే డిబేట్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులైన డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. సెపె్టంబర్ 10న ఏబీసీ చానల్లో హారిస్‌తో జరగాల్సిన డిబేట్ నుంచి తప్పుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ‘‘నిజానికది జో బైడెన్‌తో జరగాల్సిన డిబేట్. ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకున్నందున ఆ డిబేట్ కూడా రద్దయినట్టే’’ అని వాదించారు. ఈ మేరకు సొంత సోషల్ మీడియా హాండిల్ ‘ట్రూత్’లో తాజాగా ట్రంప్ పలు పోస్టులు పెట్టారు. ఫాక్స్ న్యూస్ చానల్లో అయితేనే డిబేట్‌కు వస్తానంటూ మెలిక పెట్టారు. ‘‘సెప్టెంబర్ 4న పెన్సిల్వేనియాలో ఫాక్స్ స్టూడియోలో హారిస్ చర్చకు రావాలి. ఖాళీ స్టూడియోలో కాకుండా కిక్కిరిసిన ప్రేక్షకుల నడుమ డిబేట్ చేద్దాం’’ అని సవాలు విసిరారు. దీనిపై హారిస్ వర్గం మండిపడింది. పిరికితనంతో డిబేట్ నుంచి ట్రంప్ పారిపోతున్నారంటూ ఎద్దేవా చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ రాకపోయినా కేవలం హారిస్‌తో ఏబీసీ డిబేట్ కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంది. డెమొక్రాట్ల తరఫున అధ్యక్షుడు బైడెన్‌కు బదులు హారిస్ అధ్యక్ష రేసులో అడుగు పెట్టినప్పటి నుంచీ ఆమెతో డిబేట్‌కు ట్రంప్ వెనకా ముందాడుతూ వస్తున్నారు. తామిద్దరి గురించీ అమెరికన్లకు ఇప్పటికే అంతా తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ తనతో డిబేట్‌కు రావాల్సిందేనని హారిస్ పట్టుబడుతున్నారు. గూగుల్‌పై ట్రంప్ మండిపాటుతన వార్తలను, ఫొటోలను గూగుల్ సెన్సార్ చేస్తోందని, ప్రజలకు వాస్తవాలు చేరనివ్వడం లేదని ట్రంప్ మండిపడ్డారు. తనకు సంబంధించిన వార్తలను, సమాచారాన్ని ఫేసుబుక్‌లో సెన్సార్ చేసినందుకు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తనకు క్షమాపణ చెప్పారన్నారు. -
Presidential Debate: ట్రంప్ జోరు బైడెన్ బేజారు
అట్లాంటా: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (78) దూకుడు పెంచారు. దేశాధ్యక్షుడు, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌తో తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు. శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) సీఎన్ఎన్ చానల్లో దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన వాదనలో బైడెన్ సర్వశక్తులూ ఒడ్డారు. తన వయసుపై విమర్శలు, అధ్యక్ష బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై అమెరికన్లలో నానాటికీ పెరుగుతున్న అనుమానాలను కొట్టిపారేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. ట్రంప్ తనకంటే కేవలం మూడేళ్లే చిన్నవాడని పదేపదే చెప్పుకున్నారు. కానీ డిబేట్ పొడవునా బైడెన్ పదేపదే తడబడ్డారు. ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి మౌనాన్ని ఆశ్రయించారు. మాటల కోసం తడుముకున్నారు. తనలో తానే గొణుక్కుంటూ కన్పించారు. మాట్లాడుతున్న అంశాన్ని అర్ధంతరంగా వదిలేసి మరో విషయం ఎత్తుకుని ఆశ్చర్యపరిచారు. కొన్నిసార్లు బైడెన్ ఏం చెప్తున్నదీ ఎవరికీ అర్థం కూడా కాలేదు. పలు అంశాలపై ట్రంప్ పచ్చి అబద్ధాలు చెప్పినా వాటిని ఎత్తిచూపడంలో, సొమ్ము చేసుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. తనకు అనుకూలమైన గణాంకాలను సమయానుకూలంగా ప్రస్తావించడంలో కూడా చతికిలపడ్డారు. డిబేట్లో ట్రంపే నెగ్గారని సీఎన్ఎన్ పోలింగ్‌లో ఏకంగా 67 శాతం మంది ఓటర్లు పేర్కొన్నారు. బైడెన్‌కు 33 శాతం ఓట్లే లభించాయి. న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రఖ్యాత వార్తా పత్రికలు కూడా తొలి డిబేట్ ట్రంప్‌దేనని పేర్కొన్నాయి. ‘‘బైడెన్‌పై వయోభారం కొట్టొచ్చినట్టు కని్పస్తోంది. ఆయన మాటతీరులోనూ అది స్పష్టంగా ప్రతిఫలించింది. ఆయన చెబుతున్న విషయాల్లో పొందికే లేకుండా పోయింది’’ అంటూ విమర్శలు గుప్పించాయి. దూకుడుకు మారుపేరైన ట్రంప్‌కు 81 ఏళ్ల బైడెన్ ఏ మేరకు పోటీ ఇవ్వగలరోనంటూ డెమొక్రాట్లలో ఇప్పటికే గట్టిగా ఉన్న అనుమానాలు కాస్తా తాజా డిబేట్ నేపథ్యంలో ఆందోళనగా మారాయి. వాదనలో బైడెన్ తొలుత కాస్త వెనకబడ్డారని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా అంగీకరించారు. అయితే క్రమంగా పుంజుకుని సమర్థంగా ముగించారని చెప్పుకొచ్చారు. బైడెన్ భార్య జిల్ మాత్రం తన భర్త భలే బాగా మాట్లాడారంటూ ప్రశంసించారు! ‘‘ప్రతి ప్రశ్నకూ చక్కగా బదులిచ్చావు. అన్ని సమాధానాలూ తెలుసు నీకు!’’ అంటూ ఆయన్ను మెచ్చుకున్నారు. కానీ ఈ డిబేట్ నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలంటున్న వారి సంఖ్య డెమొక్రాట్లలో క్రమంగా పెరుగుతోంది. ట్రంప్, బైడెన్‌లను అధ్యక్ష అభ్యర్థులుగా ఇంకా లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. జూలై 15–18 మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న సదస్సులో డెమొక్రాట్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. పరస్పర విమర్శల వర్షం... అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ చట్టం, విదేశీ వ్యవహారాలు, వలసల వంటి పలు అంశాలపై ట్రంప్, బైడెన్ మధ్య వాడివేడి వాదనలు సాగాయి. ఆ క్రమంలో నేతలిద్దరూ తిట్ల పర్వానికి దిగారు. ‘‘నువ్వే అబద్ధాలకోరు. అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త ప్రెసిడెంట్ కూడా నువ్వే’’ అంటూ పరస్పరం దుయ్యబట్టుకున్నారు. పలు రకాల విమర్శలు చేసుకున్నారు. హష్ మనీ కేసు దోషి అంటూ ట్రంప్‌కు బైడెన్ చురకలు వేశారు. ‘‘జరిమానాలుగా నువ్వు ఎన్ని బిలియన్ డాలర్లు కట్టాలో గుర్తుందా? భార్య గర్భవతిగా ఉండగా నీలి చిత్రాల తారతో గడిపావు. నైతికత విషయంలో వీధుల్లో విచ్చలవిడిగా తిరిగే పిల్లి కంటే కూడా హీనం’’ అంటూ విమర్శల వర్షం కురిపించారు. బైడెన్‌తో పాటు ఆయన కుమారుడు హంటర్ కూడా క్రిమినలేనంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా విరుచుకుపడ్డారు. అస్తవ్యస్తమైన వలసల విధానంతో దేశ భవితవ్యాన్నే బైడెన్ ప్రమాదంలోకి నెట్టారంటూ దుయ్యబట్టారు. డిబేట్ ఆరంభం నుంచే ట్రంప్ పై చేయి కనబరిచారు. ఆయనను ఇరుకున పెట్టేందుకు బైడెన్ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. -
వివేక్ రామస్వామి సర్ఫింగ్ వీడియో వైరల్: నీళ్లలోకి తోసేసి మరీ..!
అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. 3వ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి సర్ఫ్ చేయడం నేర్చుకుంటున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. డిబేట్ తర్వాత మియామీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాజ్ సాయర్ రామస్వామి సర్ఫింగ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. "కాబోయే ప్రెసిడెంట్‌కి సర్ఫ్ చేయడంఎలాగో నేర్పిస్తున్నా’’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. మాట్లాడుతూనే ఉన్నట్టుండి వివేక్‌ను నీళ్లలోకి తోసివేయడం, అలాగే గతంలో ఎప్పుడు సర్ఫింగ్ చేయని రామస్వామి, బోర్డు మీద బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించి రెండుసార్లు నీటిలో పడిపోవండి లాంటి దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తానికి నేర్పుగా నేర్చుకుని నీటి అలల్ని ఎదుర్కొని ఈజీగా సర్ఫింగ్ చేశారు. అంతేకాదు నాట్నుంచి పక్కకు తప్పుకొని మరీ సూట్‌తోనే సర్ఫింగ్ చేయాలన్న సాయల్ సవాల్‌ను కూడా స్వీకరించిన రామస్వామి అలవోకగా వేక్ సర్ఫింగ్‌లో విజయం సాధించడం విశేషం. ఇప్పటికే 7 లక్షల 50 వేల మందికిపైగా వీక్షించారు.దీంతో నెక్ట్స్ ప్రెసిడెంట్ అని కొందరు, మేన్ ఆఫ్ యంగ్ పీపుల్ మరికొందరు కమెంట్ చేయగా, ఇంకొందరు నెగిటివ్ కమెంట్స్ కూడా చేశారు. కాగా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి వ్యక్తిగత దూషణకు దిగారు. విదేశాంగ విధానంపై చర్చలో భాగంగా వేదికపై ఉన్న ఏకైక మహిళా అభ్యర్థి నిక్కీపై విరుచుకుపడ్డారు వివేక్. ఇద్దరు భారతీయ సంతతి లీడర్ల మధ్య వైరం చర్చకు దారి తీసింది. 2024 నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి View this post on Instagram A post shared by Kaz (@kazsawyer) -
హద్దులు మీరిన చర్చ.. వేళ్లు చూపుతూ..
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ కోసం జరుగుతున్న రిపబ్లికన్ పార్టీ డిబేట్లో ఇద్దరు భారతీయ మూలాలున్న అభ్యర్థుల మధ్య చర్చ స్థాయిని మించి వాడీవేడిగా సాగింది. సంయమనం కోల్పోయి ఒకరిపై మరొకరు మాటల శస్త్రాలతో దాడికి దిగారు. ఆక్రోశంతో అరుస్తూ.. వేళ్లు చూపారు. అధ్యక్ష ఎన్నికలో ప్రాథమిక చర్చ సందర్భంగా భారతీయ సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ముఖాముఖిగా రావడం ఇదే ప్రథమం. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరు భారతీయ-అమెరికన్ ఆశావహులు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష స్థానం కోసం పోటీ పడ్డారు. విదేశాంగ విధాన సమస్యలపై జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ డిబేట్లో మాటల శస్త్రాలతో హద్దులు మీరారు. ఉక్రెయన్, రష్యా యుద్ధం అంశంపై చర్చ తారాస్థాయికి చేరింది. అమెరికా అనుసరిస్తున్న విధానాలపై ఇద్దరు అభ్యర్థులు విభేదించుకున్నారు. ఉక్రెయిన్ పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానంపై రామస్వామికి సరైన అవగాహన లేదని నిక్కి హేలీ ఆరోపించారు. అమెరికా భద్రతకు ఇలాంటి అభ్యర్థులతో ముప్పు అని దుయ్యబట్టారు. అమెరికా శత్రువులకు మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఉక్రెయిన్ను రష్యాకు అప్పగించాలనేదే వారి అభిప్రాయమా..? అంటూ ప్రశ్నించారు. రష్యా , పుతిన్ పట్ల సానుకూల వైఖరి పనికిరాదని అన్నారు. నిక్కీ హేలి మాట్లాడుతుండగా.. తరుచూ కలుగజేసుకున్న రామస్వామి.. చెప్పేదంతా అబద్ధం అని అన్నారు. నిక్కీ హేలికి విదేశీ విధానాలపై సరైన అవగాహన లేదని అన్నారు. అమెరికా విదేశాలకు కేటాయిస్తున్న మిలిటరీ ఫోర్స్‌ను ఏమాత్రం వినియోగించినా.. దక్షిణ ప్రాంతం నుంచి ఎదురైతున్న తిరుగుబాటును అంతం చేయొచ్చని అన్నారు. ఈ క్రమంలో చర్చ వాడీవేడీగా సాగింది. అరుస్తూ వేళ్లు చూపించుకునే స్థాయికి చేరింది. ఇదీ చదవండి: Wagner Chief Plane Crash Video: అంతా 30 సెకన్లలోనే.. వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్ -
ముగిసిన మాటల పోరు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగే ప్రెసిడెన్షియల్ డిబేట్స్‌లో చివరి డిబేట్ హోరాహోరీగా ముగిసింది. అయితే తొలి డిబేట్‌తో పోలిస్తే ఈసారి వ్యక్తిగత దూషణలు, మాటలకు అడ్డం పడడాలు చాలావరకు తగ్గాయి. ముఖ్యంగా అభ్యర్థుల మైక్‌ను మ్యూట్ చేసే ఆప్షన్ బాగా ఉపయుక్తమయింది. ట్రంప్, బైడెన్లు డిబేట్లో కరోనా, జాత్యహంకారం, పర్యావరణం, వలస విధానం తదితర అంశాలపై తమ వైఖరులను వివరించారు. నాష్‌విల్లేలోని బెల్మాట్ యూనివర్సిటీలో సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ డిబేట్లో కరోనా వైరస్ కట్టడి విషయంలో ఒకరినొకరు దుయ్యబట్టుకున్నారు. డిబేట్‌కు ఎన్బీసీ న్యూస్‌కు చెందిన క్రిస్టిన్ వెల్కర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే ఎన్ని కట్టడులు చేసినా ట్రంప్, బైడెన్ ఒకరి వ్యక్తిగత విషయాలను మరొకరు విమర్శించడం మానలేదు. తొలి డిబేట్ అనంతరం ట్రంప్ కరోనా బారిన పడి కోలుకోవడంతో ఈ చివరి డిబేట్ ఆసక్తికరంగా మారింది. వివిధ అంశాలపై అభ్యర్థుల వాదనలు... కరోనా వైరస్: ట్రంప్: ఇది ప్రపంచవ్యాప్త సమస్య. కానీ, దీన్ని ఎంతో సమర్ధవంతంగా ఎదుర్కొన్నానని పలు దేశాలు ప్రశంసించాయి. చైనా కారణంగానే ఈ వైరస్ ప్రబలింది. టీకా అతి త్వరలో అందుబాటులోకి రానుంది. కొన్ని వారాల్లోనే దీనిపై ప్రకటన రావచ్చు. ప్రభుత్వం వ్యాక్సిన్ సత్వర పంపిణీకి తయారుగా ఉంది. బైడెన్: ట్రంప్ విధానాలతో కరోనా కారణంగా దేశంలో లక్షల మరణాలు సంభవించాయి. అమెరికా త్వరలో మరో డార్క్‌వింటర్‌ను(తీవ్రమైన చలికాలం అని ఒక అర్థం కాగా, అమెరికాపై జరిగే బయోవెపన్ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధమయ్యే ప్రాజెక్ట్ అని మరో అర్థం) చూడనుంది, కానీ, ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్లాన్ లేదు. వచ్చే ఏడాది మధ్య వరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలా కనిపించడంలేదు. కరోనాతో జీవించడాన్ని ప్రజలు నేర్చుకుంటున్నారని ట్రంప్ చెబుతున్నాడు, కానీ ప్రజలు దీంతో చావును నేర్చుకుంటున్నారు. నా వద్ద కరోనా కట్టడికి మంచి ప్రణాళిక ఉంది. జాత్యహంకారం.. ట్రంప్: నల్లజాతీయుల చాంపియన్ నేనే. అబ్రహం లింకన్ తర్వాత నల్లజాతీయులకు అనేక ప్రయోజనాలు చేకూర్చిన ప్రెసిడెంట్ సైతం నేనే. ఇక్కడున్న వారందరిలో అతితక్కువ జాత్యహంకారం ఉన్న వ్యక్తిని కూడా నేనే! బైడెన్: ఆధునిక అమెరికా చరిత్రలో అత్యంత జాత్యహంకార అధ్యక్షుల్లో ట్రంప్ ఒకరు. ప్రతి జాతి ఘర్షణలో ఆజ్యం పోస్తాడు. గత డిబేట్లో సైతం తన జాత్యహంకార బుద్ధిని ప్రదర్శించాడు. వలసవిధానం.. ట్రంప్: అక్రమ వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేయడం సబబే. ప్రభుత్వం వారిని సురక్షితంగా చూసుకుంది. బైడెన్: పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయడం అమెరికా పాటించే విలువలకే అవమానం. హెల్త్‌కేర్.. ట్రంప్: ఒబామా కేర్ కన్నా మెరుగైన ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చాను. దీన్ని ఇంకా మెరుగుపరుస్తాను. బైడెన్: ఉత్తమమైన ఒబామా కేర్‌ను తీసివేసిన అనంతరం సరైన హెల్త్‌కేర్ పాలసీని ట్రంప్ తీసుకురాలేకపోయారు. పర్యావరణం.. ట్రంప్: చైనా, ఇండియా, రష్యాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏమీ చేయట్లేదు. చైనాను చూడండి ఎంత మురికిగా ఉందో. ఇండియా, రష్యాలు కూడా అంతే. ఆ దేశాల్లో గాలి శ్వాసించలేనంత కలుషితంగా ఉంది. పర్యావరణ పరిరక్షణ పేరిట అమెరికా వృ«థా ఖర్చును నివారించేందుకు పారిస్ డీల్ నుంచి బయటకు వచ్చాము. ఆ ఒప్పందం కారణంగా మన వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో అమెరికా ఉద్గార గణాంకాలు 35 ఏళ్లలోనే ఉత్తమంగా ఉన్నాయి. బైడెన్: మరింత ఎకోఫ్రెండ్లీ ఆర్థిక వ్యవస్థగా అమెరికాను మార్చే ప్రణాళిక ఉంది. దీనివల్ల మరిన్ని ఉద్యోగాలు వస్తాయి. ప్రపంచ పర్యావరణానికి గ్లోబల్ వార్మింగ్ ముప్పు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. అవినీతి ట్రంప్: బైడెన్ లాగా నేను చైనా నుంచి అక్రమ సొత్తు సంపాదించలేదు. ఉక్రెయిన్ నుంచి లంచాలు తీసుకోలేదు. రష్యా నుంచి ముడుపులు స్వీకరించలేదు. బైడెన్: చైనా నుంచి ముడుపులు తీసుకుంది నా కుమారుడు కాదు. ట్రంపే ముడుపులు స్వీకరించాడు. హంటర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణల్లో ఎలాంటి తప్పులు జరిగినట్లు తేలలేదు. అమెరికాను మరోమారు అగ్రగామిగా నిలుపుతానని ట్రంప్ పేర్కొనగా, ఈ ఎన్నికల ఫలితాలపై అమెరికా భవిష్యత్ ఆధారపడి ఉంటుందని బైడెన్ చెప్పారు. హోరాహోరీగా జరిగిన డిబేట్లో ఎవరూ పైచేయి సాధించలేదని, ఇరువురూ తమ తమ విధానాలను గట్టిగా సమర్ధించుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. సీఎన్ఎన్ మాత్రం తాము జరిపిన పోల్ ప్రకారం డిబేట్లో బైడెన్‌దే పైచేయిగా 53 శాతం మంది భావించినట్లు తెలిపింది. చాలావరకు ప్రశాంతం.. తొలి డిబేట్‌తో పోలిస్తే మలి డిబేట్ చాలావరకు ప్రశాంతంగా జరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పలు అంశాలపై ఇరువురూ తీవ్రంగా విభేదిస్తూ వాదించుకున్నా, ఒకరికొకరు అడ్డంపడి మాట్లాడటం చాలావరకు తగ్గింది. చాలామంది గతంతో పోలిస్తే ట్రంప్ ఈ దఫా చాలా హుందాగా ప్రవర్తించారని భావించారు. ఉదాహరణకు డిబేట్‌కు ముందు వ్యాఖ్యాతపై పలు నెగెటివ్ వ్యాఖ్యలు చేసిన ట్రంప్ డిబేట్ అనంతరం ఆమెను ప్రశంసించారు. డిబేట్‌ను చాలా బాగా నిర్వహించారన్నారు. కరోనా కారణంగా డిబేట్ చూసేందుకు ప్రత్యక్షంగా 200 మందిని మాత్రమే అనుమతించారు. అభ్యర్థ్ధులకు మధ్య గ్లాస్ గోడలు పెట్టాలని నిర్ణయించినా చివరకు ఏర్పాటు చేయలేదు. డిబేట్‌కు ముందు ఇరువురికీ కరోనా పరీక్ష నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. ఈసారి ట్రంప్ కుటుంబసభ్యులతో సహా ప్రేక్షకులంతా మాస్కులు ధరించారు. -
ఈ వాదనలు మొదలైందెప్పుడో తెలుసా?
ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్యం?... అగ్రరాజ్యం అమెరికా.. అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశం? మన భారతదేశమే.. బాగానే ఉందికానీ.. రెండు దేశాల్లోనూ ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలే కాబట్టి అంతా ఒకటే అనుకుంటున్నారా? కాదండోయ్... చాలా తేడాలున్నాయి. మిగిలిన వాటిని కాసేపు పక్కనబెడితే... అమెరికా ఎన్నికల్లో అందరినీ ఆకర్షించే ఘట్టం... ప్రెసిడెన్షియల్ డిబేట్స్ లేదా అధ్యక్ష అభ్యర్థుల వాదోపవాదాలు. ఈ చర్చల ఘట్టం మొదలైందెప్పుడు?.. నేపథ్యం ఏంటి?.. ఏ ఏ అంశాలపై చర్చ సాగుతుంది?.. ఇవి కూడా భారతదేశ టెలివిజన్ చానెల్ చర్చల మాదిరిగానే ఉంటాయా?.. ఆసక్తికరమైన ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం... కొన్ని రోజుల క్రితమే.. అమెరికా అధ్యక్ష పదవికి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ల మధ్య తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ ముగిసింది. చర్చ హుందాగా జరగలేదని.. అంశాలపై కాకుండా.. వ్యక్తులపై మాట్లాడుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత డొనాల్డ్ ట్రంప్ కాస్తా కోవిడ్ బారిన పడటం.. ఈ పరిస్థితుల్లో ప్రత్యక్షంగా కంటే ఆన్లైన్ ద్వారా చర్చ మేలని బైడెన్ ప్రతిపాదించారు. అయితే దీనికి ట్రంప్ నిరాకరించడంతో రెండో చర్చ వాయిదా పడింది. మూడోదఫా వాదోపవాదాలూ డోలాయమానంలో పడిపోయాయి. ఒకవేళ మూడవ చర్చ కూడా జరక్కపోతే.. అలా జరగడం 1976 తరువాత ఇదే మొదటిసారి అవుతుంది. అధ్యక్ష చర్చలు ఎప్పుడు మొదలయ్యాయంటే? 1776లో స్వాతంత్య్ర ప్రకటనతోనే మొదలుకాలేదు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలూ రాజ్యాంగాన్ని ఆమోదించిన 1788లోనూ కాదు. తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ 1789లో పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంలోనూ ఈ చర్చల ప్రక్రియ మొదలు కాలేదు. చాలా లేటుగా.. 1960లోనే మొదలయ్యాయి. అంతకుమునుపు 1858 ప్రాంతంలో అబ్రహాం లింకన్ , స్టీఫెన్ ఏ డగ్లస్‌ల మధ్య తొలిసారిగా ముఖాముఖి చర్చలు మొదలైనా... వాటికి సంస్థాగత రూపు మాత్రం లభించలేదు. లింకన్ , డగ్లస్‌ల మధ్య వరుసగా ఏడుసార్లు చర్చలు జరిగాయి. ప్రక్రియ కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. మధ్యవర్తి కూడా లేకుండా అభ్యర్థులు ఇరువురు ముఖాముఖి వాదించుకునేవారు. ముందుగా ఒక అభ్యర్థి చర్చను ప్రారంభించి గంటసేపు తాను చెప్పదలచుకున్న అంశాలను వివరించేవారు. ప్రత్యర్థి తన వాదనలు వినిపించడంతోపాటు తిప్పికొట్టేందుకు గంటన్నర సమయం లభించేది. తొలుత ప్రసంగించిన అభ్యర్థి తన స్పందనలు తెలియజేసి చర్చను ముగించేవారు. ఆ తరువాత 1940లో వెండెల్ విల్లికీ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నామినేట్ కాకమునుపే అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్‌ను ముఖాముఖి చర్చకు ఆహ్వానించారు. అయితే రూజ్వెల్ట్ చర్చ తిరస్కరించారు. 1948, 1956లలోనూ అధ్యక్ష పదవికి నామినేట్ కాక మునుపే అంటే ప్రైమరీల అభ్యర్థులుగా థామస్ ఈ డీవీ హరాల్డ్ స్టాట్సెన్ లు, అడ్లాయి స్టీవెన్ సన్ , ఎస్టేస్ కీఫావెర్ల మధ్య చర్చలు జరిగాయి. తొలి చర్చ రేడియోలో ప్రసారం కాగా.. మలి చర్చ తొలిసారి టెలివిజన్‌లో ప్రసారమైంది. ఓ విద్యార్థి ఆలోచన... 1956లో యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ విద్యార్థి ఫ్రెడ్ కాన్ అధ్యక్ష పదవికి నామినేట్ అయిన ఇరుపార్టీల అభ్యర్థులను చర్చ కోసం ఒక వేదికపైకి తీసుకు వచ్చే ఆలోచన చేశారు. అడ్లాయి స్టీవెన్ సన్ డెమొక్రటిక్ పార్టీ తరఫున, అప్పటి అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డ్వైట్ ఐసన్ హోవర్లు తమ యూనివర్సిటీలో చర్చించాలని కాన్ ఆహ్వానం పంపారు. ఈ అంశంపై ప్రజల్లో ఆసక్తిని పెంపొందించేందుకు కాన్ పలు వార్తా పత్రికలకు, దేశంలోని ప్రముఖులకు లేఖలు రాసి చర్చ కార్యక్రమానికి ఆహ్వానించారు. తొలి లేఖ అందుకున్న మాజీ అధ్యక్షుడు రూజ్వెల్ట్ భార్య ఎలెనార్ అందుకు తన సమ్మతిని తెలపడంతోపాటు అడ్లాయి స్టీవెన్ సన్ ప్రచార కార్యదర్శికీ ఆ లేఖ ప్రతిని పంపారు. అయితే చివరకు ఆ ఏడాది చర్చ జరక్కపోయినా ఈ అంశంపై విస్తృత ప్రచారం మాత్రం సాధ్యమైంది. ఇది కాస్తా.. 1960లో యూనివర్సిటీ వేదికలపై అధ్యక్ష అభ్యర్థుల చర్చలకు పునాది పడింది. అయితే 1964, 68, 72లలో చర్చలు అసలు జరగలేదు. 1976లో గెరాల్డ్ ఫోర్డ్, జిమ్మీ కార్టర్ల మధ్య ప్రెసిడెన్షియల్ డిబేట్ జరగ్గా 1980లోనూ జిమ్మీ కార్టర్‌కు, రొనాల్ల్ రీగన్కు మధ్య మూడు చర్చలు సాఫీగా జరిగాయి. రీగన్ తరఫున జాన్ బి. ఆండర్సన్ చర్చల్లో పాల్గొనడం విశేషం. అధ్యక్ష అభ్యర్థులతోపాటు ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య కూడా చర్చలు 1984లో మొదలయ్యాయి. ‘సీపీడీ’ ఏర్పాటు... అధ్యక్ష అభ్యర్థుల చర్చలకు పూర్తి సంస్థాగత రూపు రేఖలు లభించింది 1987లో. అమెరికన్ పౌరులకు తాము ఎన్నుకోబోయే అభ్యర్థుల గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పించే లక్ష్యంతో ‘ద కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్’ (సీపీడీ) ఏర్పాటైంది. లాభాపేక్ష రహిత స్వచ్ఛంద సంస్థగా ఏర్పాటైన సీపీడీ చర్చలకు సంబంధించిన పరిశోధనలు, కార్యకలాపాల నిర్వహణ, అమెరికా అధ్యక్ష అభ్యర్థుల చర్చలకు ప్రాయోజకత్వం వహిస్తుంది. 1988 నుంచి 2020 వరకూ అన్ని ప్రెసిడెన్షియల్ డిబేట్స్ సీపీడీ ఆధ్వర్యంలోనే జరిగాయి. చర్చల నాణ్యతను మరింత పెంచేందుకు, ఓటరు చైతన్యానికి కూడా సీపీడీ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అధ్యక్ష అభ్యర్థుల చర్చను చేపట్టేందుకు ఆసక్తి చూపే ఇతర దేశాలకు సాంకేతిక సాయం అందించేందుకూ సీపీడీ ప్రయత్నాలు చేస్తోంది. బోస్నియా, బురుండీ, కొలంబియా, ఘన, హైతీ, లెబనాన్ , నైజర్, నైజీరియా, పెరూ, రొమేనియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఉగాండా, ఉక్రెయిన్ తదితర దేశాల్లోనూ ఈ చర్చల పద్ధతిని ప్రవేశపెట్టింది. ముఖ్యమైన విషయాలు.. 1. అమెరికాలో టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారాలు 1928, జూలై 2న ప్రారంభమయ్యాయి. కానీ, అధ్యక్ష ఎన్నికల చర్చలు మొదలైంది మాత్రం 1960లోనే. మసాచూసెట్స్ సెనేటర్ జాన్ ఎఫ్ కెనడీ, అప్పటి వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ ఎం.నిక్సన్‌ల మధ్య తొలిసారి టెలివిజన్‌లో చర్చ జరిగింది. చర్చతోపాటు ఎన్నికల్లోనూ కెన్నడీ గెలుపొందారు. 2. అమెరికన్ పౌరులు ప్రతి ముగ్గురిలో ఒకరు అధ్యక్ష అభ్యర్థుల చర్చలపై ఆసక్తి చూపుతారని గణాంకాలు చెబుతున్నాయి. తొలి టెలివిజన్ చర్చను 6,64,00,000 మంది ప్రత్యక్షంగా వీక్షించారని అంచనా. అప్పట్లో అమెరికా జనాభా 18.07 కోట్లు మాత్రమే. ప్రస్తుతం అది 32.47 కోట్లు. 3. 1960 నాటి చర్చల్లో నిక్సన్ అనారోగ్యంతోనే పాల్గొన్నారు. స్టేజ్‌పైకి వెళ్లేందుకు తగిన మేకప్ చేస్తామన్న అనుచరుల సూచనను నిక్సన్ పట్టించుకోలేదు. 1968లో మరోసారి అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన నిక్సన్ అప్పటి ఉపాధ్యక్షుడు హ్యూబర్ట్ హంఫ్రీతో చర్చ జరిపేందుకు నిరాకరించారు. ఆ ఎన్నికల్లో నిక్సన్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే. 4. 1960 తర్వాత మూడుసార్లు అధ్యక్ష అభ్యర్థుల చర్చలు జరక్కపోగా.. 1976లో జిమ్మీ కార్టర్, గెరాల్డ్ ఫోర్డ్‌ల మధ్య మరోసారి చర్చల సంప్రదాయం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ చర్చలు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. ఇదే ఏడాది తొలిసారి ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య చర్చలు మొదలు కావడం విశేషం. 5. అధ్యక్ష అభ్యర్థుల చర్చల్లో చేసే నినాదాలు వారి విజయావకాశాలను ప్రభావితం చేస్తూంటాయి,. 1980లో జిమ్మీ కార్టర్‌తో జరిగిన చర్చలో ‘నాలుగేళ్ల క్రితం కంటే ఇప్పుడు మీరు బాగున్నారని అనుకుంటున్నారా?’ అని మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ అడిగిన ప్రశ్న అతడికి రెండుసార్లు పదవి దక్కేలా చేసిందని రాజకీయ నిపుణులు చెబుతారు. ఆ తరువాతి ఎన్నికలు ప్రతి ఒక్కదానిలోనూ అభ్యర్థులు కొంచెం అటుఇటుగా అదే అర్థం ధ్వనించే నినాదాలు చేయడం రీగన్ ప్రకటన ప్రభావమెంతో చెబుతుంది. 6. రొనాల్డ్ రీగన్ , మాజీ ఉపాధ్యక్షుడు వాల్టర్ మొండేలేల మధ్య 1984లో జరిగిన చర్చలోనూ.. రీగన్ వయో వృద్ధుడని వాల్టర్ ప్రస్తావించగా.. ‘ఈ ప్రచారంలో వయసును ఒక అంశంగా చేయదలచుకోలేదు. ప్రత్యర్థి యువకుడు, అనుభవం లేని వాడని నా రాజకీయ అవసరాల కోసం చెప్పను’ అని రీగన్ సమాధానమిచ్చి వాల్టర్ కూడా నవ్వుకునేలా చేశాడు. 7. 1992 అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో తొలిసారి చర్చలో ఇద్దరు కాకుండా ముగ్గురు పాల్గొన్నారు. అధ్యక్ష హోదాలో జార్జ్ హెచ్.డబ్ల్యూ బుష్, అర్కాన్సస్ రాష్ట్ర గవర్నర్ హోదాలో బిల్ క్లింటన్, స్వతంత్ర అభ్యర్థిగా రాస్ పెరోట్ ఈ చర్చలో పాల్గొన్నారు. 8. 2012లో బరాక్ ఒబామా, మిట్ రోమ్నీల మధ్య జరిగిన చర్చ అత్యధిక అమెరికన్లు వీక్షించిన చర్చగా నిపుణులు చెబుతారు. కార్టర్, రీగన్ చర్చను 4.58 కోట్ల కుటుంబాలు చూడగా... ఒబామా, రోమ్నీల చర్చను 4.62 కోట్ల కుటుంబాల్లో చూశారని వారు వివరిస్తారు. 2016లో హిల్లరీ, ట్రంప్ డిబేట్‌ను 8.4 కోట్ల మంది వీక్షించారు. 9. 2008 నాటి అధ్యక్ష అభ్యర్థుల చర్చలో తొలిసారి యూట్యూబ్, ట్విట్టర్ల ద్వారా అమెరికన్ పౌరులు నేరుగా అభ్యర్థులను ప్రశ్నలు అడగటం మొదలైంది. 2016 నాటి ప్రైమరీ ఎన్నికల్లో ఫేస్బుక్ ద్వారా అభ్యర్థులపై ప్రశ్నలు సంధించారు. -
రెండో డిబేట్ రద్దు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య ఈనెల 15న జరగాల్సిన రెండో ముఖాముఖి చర్చను రద్దు చేస్తున్నట్లు కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ ప్రకటించింది. ఈ డిబేట్ ఆన్లైన్లో జరపాలని కమిషన్ భావించగా, ట్రంప్ ఇందులో పాల్గొనేందుకు నిరాకరించారు. ఇలాంటి వర్చువల్ డిబేట్‌తో సాధించేది శూన్యమని, తాను ఇందులో పాల్గొననని చెప్పారు. దీంతో డిబేట్‌ను ఏకంగా రద్దు చేయాలని కమిషన్ నిర్ణయించింది. మరోవైపు ఈ సమయంలో బైడెన్ ఏబీసీ న్యూస్ నిర్వహించే టౌన్‌హాల్ ముఖాముఖిలో పాల్గొననున్నారు. ట్రంప్ పబ్లిక్‌లో తిరగవచ్చని డాక్టర్లు చెప్పినా డిబేట్‌ను ముఖాముఖి నిర్వహించకుండా ఆన్లైన్లో నిర్వహించాలనడం సబబు కాదని ట్రంప్ బృందం విమర్శించింది. కావాలంటే డిబేట్లను వాయిదా వేయాలని సూచించింది. కానీ తన నిర్ణయం మార్చుకునేది లేదని కమిషన్ స్పష్టం చేసింది. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎట్టిపరిస్థితుల్లో ముఖాముఖి డిబేట్ నిర్వహించమని తేల్చిచెప్పింది. ఇరు అభ్యర్థుల మధ్య మూడో డిబేట్ ఈ నెల 22న జరగాల్సి ఉంది. వైట్‌హౌస్‌లో ప్రజలతో ములాఖత్ అవ్వాలని ట్రంప్ నిర్ణయించారు. కరోనా సోకిన అనంతరం ఇలా ప్రజలను ట్రంప్ కలవడం ఇదే తొలిసారి. ప్రెసిడెంట్ శనివారం వైట్‌హౌస్ సౌత్ లాన్స్‌లో దేశంలో శాంతిభద్రతల కోసం శాంతియుత నిరసనను ఉద్దేశించి ప్రసంగిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఓటర్లు ప్రశ్నలడిగే కీలక డిబేట్లో పాల్గొనకపోవడం ట్రంప్‌నకు సిగ్గు చేటని బైడెన్ విమర్శించారు. ట్రంప్ వైఖరి కొత్తేమీ కాదన్నారు. -
డిబేట్ తర్వాత పెరిగిన బైడెన్ ఆధిక్యం!
వాషింగ్టన్: తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ అనంతరం ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే ప్రత్యర్థి జోబైడెన్ పాపులారిటీ 14 పర్సంటేజ్ పాయింట్ల మేర పెరిగిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ సర్వే తెలిపింది. అధ్యక్ష రేసులోకి దిగిన తర్వాత బైడెన్‌కు ఇంత ఆధిపత్యం రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం సర్వేలో బైడెన్‌కు 53 శాతం మద్దతు లభించగా, ట్రంప్‌నకు 39 శాతం మద్దతు దక్కింది. సెప్టెంబర్ 20 సర్వేతో పోలిస్తే బైడెన్‌కు 6 పాయింట్ల ఆధిపత్యం పెరిగింది. ట్రంప్‌నకు కరోనా నిర్థారణ ప్రకటనకు ముందు ఈ సర్వే నిర్వహించారు. డిబేట్లో బైడెన్ అదరగొట్టాడని సర్వేలో 50 శాతం మంది అభిప్రాయపడ్డారు. 24 శాతం మంది ట్రంప్‌దే హవా అని పేర్కొనగా 17 శాతం మంది ఇద్దరిలో ఎవరూ ఆధిపత్యం ప్రదర్శించలేదని అన్నారు. ఓటింగ్‌లో తమపై డిబేట్ ప్రభావం ఉండదని సర్వేలో 73 శాతం మంది చెప్పారు. ఎప్పటిలాగే ట్రంప్ ప్రత్యర్ధిని బెదిరించారని ఎక్కువమంది భావించారు. -
మొదలైన మాటల యుద్ధం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందస్తుగా సాగే ప్రెసిడెన్షియల్ డిబేట్లలో తొలి డిబేట్ బుధవారం హోరాహోరీగా జరిగింది. రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల తరఫు అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ఒకే వేదికపై చేరి పలు అంశాలపై వైఖరిని వెల్లడించారు. డిబేట్లో ఒక దశలో పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ఈ డిబేట్లను ఉపయోగించుకుంటారు. సుప్రీంకోర్టు జడ్జీల నియామకం, పెరుగుతున్న జాత్యహంకార ధోరణులు, వాతావరణ ఒప్పందాలు, పన్నులు, కరోనా అంశాలపై వీరు తమ వైఖరులను తెలియజేస్తూ ప్రత్యర్థిపై విమర్శలు గుప్పించారు. ఒకరు మాట్లాడుతుండగా మరొకరు అడ్డు రావడం వంటివి జరిగాయి. వారిని సముదాయించి చర్చను సజావుగా సాగించేందుకు వ్యాఖ్యాత క్రిస్ వాలెస్ చెమటోడాల్సివచ్చింది. కరోనా కారణంగా వారు షేక్‌హ్యాండ్ చేసుకోలేదు. కానీ, మాస్కు కూడా ధరించలేదు. ఎన్నికలకు 35 రోజులుండగా, ఒపీనియన్ పోల్స్‌లో ట్రంప్ కాస్త వెనుకంజలో ఉన్నారు. బైడెన్‌కు సైతం పెద్దగా మద్దతేమీ కనిపించడం లేదు. దీంతో డిబేట్ల ద్వారా జనాన్ని ఆకట్టుకోవాలని వారు భావిస్తున్నారు. చర్చలో రెండు మార్లు భారత్ ప్రస్తావన తెచ్చారు. కరోనా మరణాల సంఖ్య చెప్పని దేశాల్లో భారత్ ఒకటన్నారు. కర్బన ఉద్గారాల విషయంలో చైనా, భారత్‌పై కట్టడి లేదన్నారు. ఇండో అమెరికన్ల మిశ్రమ అభిప్రాయం తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌పై ఇండో అమెరికన్ల అభిప్రాయం మిశ్రమంగా ఉంది. ట్రంప్‌నకు ఎదురులేదని రిపబ్లిక్ పార్టీ సమర్థక ఇండో అమెరికన్లు అభిప్రాయపడగా, బైడెన్ విజయవంతంగా డిబేట్‌ను గెలిచారని డెమొక్రాటిక్ పార్టీ సమర్థ కులు భావిస్తున్నారు. ట్రంప్ డిబేట్లో బైడెన్‌ను చితక్కొట్టాడని ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ ఫైనాన్స్ కమిటీ ప్రతినిధి ఆల్మాసన్ అభిప్రాయపడ్డారు. డిబేట్ వ్యాఖ్యాత డెమొక్రాట్లకు మద్దతుగా ఉన్నారని కాలిఫోర్నియా అటార్నీ, రిపబ్లికన్ నేత హర్మీత్ థిల్లాన్ విమర్శించారు. రాబోయే రోజుల్లో ఇలాంటివారు డిబేట్లో పాల్గొనకుండా చూడాలని సొంత పార్టీ నేతలను కోరారు. ట్రంప్ మరోమారు అధ్యక్ష పదవికి అనర్హుడని బైడెన్ నిరూపించారని సౌత్ఏసియన్స్ ఫర్ బైడెన్ ప్రతినిధి నేహా దివాన్ చెప్పారు. ట్రంప్ తప్పిదాలను బైడెన్ సరిదిద్దగలనని నిరూపించారని అజయ్ జైన్ చెప్పారు. -
టీచర్ ప్రశ్నకు హుందాగా సమాధానం ఇచ్చిన హిల్లరీ
-
'ఎవరు మీ భవిష్యత్‌ను తీర్చగలరో గుర్తించండి'
న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన హిల్లరీ, ట్రంప్ మధ్య తొలిసారిగా హోఫ్ స్ట్రా యూనివర్సిటీ హాల్లో ప్రెసిడెన్షియల్ డిబెట్ ప్రారంభమైంది. హిల్లరీ మాట్లాడుతూ...దృఢమైన, స్థిరమైన అభివృద్ధే నా లక్ష్యమని హిల్లరి స్పష్టం చేశారు. ఐసిస్‌ను సమర్థంగా ఎదుర్కొంటామని ఆమె పేర్కొన్నారు. దేశంలో ఉద్యోగాల కల్పనకు ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. నిర్మాణం, టెక్నాలజీ, ఇన్నోవేషన్ తదితర రంగాలలో ఉద్యోగాల వృద్ధి ఉంటుందని హిల్లరీ వెల్లడించారు. అలాగే సోలార్ రంగంలో కొత్త ఉద్యోగాలు సృష్టించ వచ్చు అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరు మీ భవిష్యత్‌ను తీర్చగలరో గుర్తించాలని అమెరికా ప్రజలకు హిల్లరీ సూచించారు. ఐసిస్‌ను సమర్థంగా ఎదుర్కొంటామని హిల్లరీ చెప్పారు. దేశంలోని కార్పొరేట్ లొసుగులను తొలగిస్తామని ఈ సందర్భంగా ప్రజలుకు ఆమె హామీ ఇచ్చారు. కార్పొరేట్ లొసుగుల వల్ల లాభపడింది ట్రంప్ కుటుంబమే అని ఆరోపించారు. అయితే హిల్లరీ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. హిల్లరికి ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. దేశంలో ఉద్యోగాలు తరలిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలను వెనక్కి తీసుకువస్తానని దేశ ప్రజలకు ట్రంప్ భరోసా ఇచ్చారు. చైనా, మెక్సికో, ఇండియా లాంటి దేశాలు ఉద్యోగాలు కొల్లగొడుతున్నాయని ట్రాంప్ గుర్తు చేశారు. చైనా అయితే మనకు ఎంతో నష్టం చేస్తుందని విమర్శించారు. హిలరీ, ఇతరులు కొన్నాళ్లుగా దేశాన్ని పరిపాలిస్తున్నారని.. ఆ సమయంలో ఆమె పేర్కొన్నవి ఎందుకు అమలు చేయలేదని ట్రంప్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. హిల్లరీ టాక్స్ విధానాలు దేశానికి నష్టమని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. -
యాంటీ హిల్లరీ యాడ్‌పై అలజడి!
'డియర్ హిల్లరీ క్లింటన్.. బెంఘాజిలో సాయం కోసం చేసిన అరుపులను మీరెందుకు వినిపించుకోలేదని అడుగదలిచాను. అక్కడ నలుగురు అమెరికన్లు హత్యకు గురయ్యారు' అంటూ మంగళవారం రాత్రి సీఎన్ఎన్ చానెల్లో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థుల చర్చ సందర్భంగా ప్రసారమైన వాణిజ్య ప్రకటన ఇప్పుడు అమెరికాలో తీవ్ర వివాదాస్పదమైంది. హిల్లరీ క్లింటన్‌కు వ్యతిరేకంగా ప్రసారమైన ఈ ప్రకటనపై మృతుల కుటుంబసభ్యలు నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. యాడ్‌లో ఏమున్నది? లిబియా బెంఘాజిలోని అమెరికా కార్యాలయాలపై 2012లో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సీఐఏ కాంట్రాక్టర్ గ్లెన్ డోహెర్టీ, అమెరికన్ రాయబారి క్రిష్టోఫర్ స్టీవెన్స్తోపాటు మరో ఇద్దరు అమెరికన్లు మరణించారు. వారు సాయం కోసం అభ్యర్థించిన.. అప్పటి విదేశాంగ మంత్రిగా ఉన్న హిల్లరీ క్లింటన్ పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో హిల్లరీ తీరును ప్రతిపక్ష రిపబ్లికన్లు కూడా తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ఆ దాడిలో చనిపోయిన నలుగురు వ్యక్తులు సమాధి నుంచి మాట్లాడుతూ.. క్లింటన్ తీరును తీవ్రంగా ఖండిస్తున్న విధంగా వాణిజ్య ప్రకటనను రూపొందించారు. వర్జీనియాకు చెందిన స్టాప్ హిల్లరీ పాక్ సంస్థ ఈ యాడ్ ను రూపొందించింది. ఈ యాడ్ ప్రసారమైన వెంటనే ట్విట్టర్లో తీవ్ర స్పందన వ్యక్తమైంది. చనిపోయిన వారి గంభీరమైన గొంతుతో, విషాదకరమైన నేపథ్య సంగీతంతో ప్రసారమైన ఈ యాడ్‌ను పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. చనిపోయిన నలుగురు వ్యక్తుల ఫొటోలను ప్రదర్శించడం, దానిని జాతీయవాదానికి ముడిపెట్టడం ఏమిటని అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు. బాధిత వ్యక్తుల కుటుంబసభ్యులు కూడా ఈ యాడ్ ప్రసారమైన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తులను రాజకీయ, వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకొని యాడ్ రూపొందించడమేమిటని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.