'ఎవరు మీ భవిష్యత్ను తీర్చగలరో గుర్తించండి'
న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన హిల్లరీ, ట్రంప్ మధ్య తొలిసారిగా హోఫ్ స్ట్రా యూనివర్సిటీ హాల్లో ప్రెసిడెన్షియల్ డిబెట్ ప్రారంభమైంది. హిల్లరీ మాట్లాడుతూ...దృఢమైన, స్థిరమైన అభివృద్ధే నా లక్ష్యమని హిల్లరి స్పష్టం చేశారు. ఐసిస్ను సమర్థంగా ఎదుర్కొంటామని ఆమె పేర్కొన్నారు. దేశంలో ఉద్యోగాల కల్పనకు ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. నిర్మాణం, టెక్నాలజీ, ఇన్నోవేషన్ తదితర రంగాలలో ఉద్యోగాల వృద్ధి ఉంటుందని హిల్లరీ వెల్లడించారు. అలాగే సోలార్ రంగంలో కొత్త ఉద్యోగాలు సృష్టించ వచ్చు అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరు మీ భవిష్యత్ను తీర్చగలరో గుర్తించాలని అమెరికా ప్రజలకు హిల్లరీ సూచించారు. ఐసిస్ను సమర్థంగా ఎదుర్కొంటామని హిల్లరీ చెప్పారు.
దేశంలోని కార్పొరేట్ లొసుగులను తొలగిస్తామని ఈ సందర్భంగా ప్రజలుకు ఆమె హామీ ఇచ్చారు. కార్పొరేట్ లొసుగుల వల్ల లాభపడింది ట్రంప్ కుటుంబమే అని ఆరోపించారు. అయితే హిల్లరీ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. హిల్లరికి ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. దేశంలో ఉద్యోగాలు తరలిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలను వెనక్కి తీసుకువస్తానని దేశ ప్రజలకు ట్రంప్ భరోసా ఇచ్చారు. చైనా, మెక్సికో, ఇండియా లాంటి దేశాలు ఉద్యోగాలు కొల్లగొడుతున్నాయని ట్రాంప్ గుర్తు చేశారు. చైనా అయితే మనకు ఎంతో నష్టం చేస్తుందని విమర్శించారు. హిలరీ, ఇతరులు కొన్నాళ్లుగా దేశాన్ని పరిపాలిస్తున్నారని.. ఆ సమయంలో ఆమె పేర్కొన్నవి ఎందుకు అమలు చేయలేదని ట్రంప్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. హిల్లరీ టాక్స్ విధానాలు దేశానికి నష్టమని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.