వాషింగ్టన్: బైడెన్ అభ్యర్థిత్వం వేళ దాదాపు ఏకపక్షంగా కనిపించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సరళిలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో ధీటుగా మాట్లాడలేక తడబడి, చివరకు తప్పుకున్న బైడెన్ అభ్యర్థిగా ఉన్నంతకాలం ట్రంప్ ముందంజలో ఉండటం తెల్సిందే.
తాజా డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ రంగంలోకి దిగాక పోరు హోరాహోరీగా సాగుతోందని విశ్లేషణలు వెలువడ్డాయి. వీటికి బలం చేకూరుస్తూ తాజా సర్వేలో ట్రంప్ కంటే కమల హారిస్‌కే ఆదరణ ఒక శాతం ఎక్కువగా ఉందని తేలింది. తాజాగా ఆదివారం సీబీఎస్ న్యూస్/యూగవ్ సంస్థ చేపట్టిన సర్వేలో కమల ఆధిక్యం కనబరిచారు. ట్రంప్ అధ్యక్ష పదవిలో మానసికంగా స్థిమితంగా ఆలోచించగలరని 51 శాతం మంది, కమల మెరుగ్గా పరిపాలించగలరని 64 శాతం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment