రెండింట్లో స్పష్టమైన ఆధిక్యం
ఒక్క రాష్ట్రంలోనే ట్రంప్ పైచేయి
మూడింట్లో ముమ్మర పోరు
ఫలితాన్ని తేల్చనుంది ఆ మూడే!
సీఎన్‌ఎన్ తాజా సర్వేలో వెల్లడి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ విజేతగా నిలిచే అవకాశాలు నానాటికీ మెరుగవుతున్నట్టు సీఎన్‌ఎన్ వార్తా సంస్థ తాజా సర్వేలో తేలింది. ఎన్నికల ఫలితాలను నిర్ణాయక రీతిలో ప్రభావితం చేసే అతి కీలకమైన ఆరు స్వింగ్ స్టేట్స్‌లో ఆమె హవా సాగుతోందని వెల్లడించింది. ఆ రాష్ట్రాల్లో విస్కాన్సిన్, మిషిగన్‌ల్లో ఉపాధ్యక్షురాలు స్పష్టంగా ముందంజలో ఉన్నారు. అరిజోనాలో మాత్రం ఆమె ప్రత్యరి్థ, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ది పైచేయిగా ఉంది.
ఇక జార్జియా, నెవెడా, పెన్సిల్వేనియాల్లో ఇద్దరి మధ్యా హోరాహోరీ నెలకొంది. దాంతో ఈ మూడూ ఎవరివైపు మొగ్గితే వారే అధ్యక్ష పీఠమెక్కడం దాదాపుగా ఖాయమంటున్నారు. ఎందుకంటే ఆరు స్వింగ్ స్టేట్స్ మినహా అమెరికాలో మిగతా రాష్ట్రాలన్నీ సాంప్రదాయికంగా రిపబ్లికన్, డెమొక్రటిక్ పారీ్టల్లో ఏదో ఒకవైపు ఉండేవే. జార్జియా, నెవెడా, పెన్సిల్వేనియాల్లో ఏకంగా 15 శాతం ఓటర్లు తామెవరికి ఓటేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పడం విశేషం. కనుక హారిస్, ట్రంప్ భాగ్యరేఖలను వీరే నిర్దేశించవచ్చని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. దాంతో రానున్న రోజుల్లో జార్జియా, నెవెడా, పెన్సిల్వేనియాల్లో అభ్యర్థులిద్దరి ప్రచార హోరు మిన్నంటడం ఖాయంగా కని్పస్తోంది.
‘స్వింగ్’ మహిళంతా హారిస్ వైపే...
కొంతకాలంగా దాదాపుగా అన్ని సర్వేల్లోనూ హారిసే ముందంజలో కొనసాగుతుండటం తెలిసిందే. సీఎన్‌ఎన్ తాజా సర్వే కూడా అదే ధోరణిని ప్రతిబింబించింది. విస్కాన్సిన్‌లో 50 శాతం మంది హారిస్‌కు ఓటేస్తామని చెప్పగా ట్రంప్‌కు 44 శాతం మద్దతు దక్కింది. మిషిగన్‌లో 48 శాతం హారిస్‌కు, 43 శాతం ట్రంప్‌కు జైకొట్టారు. జార్జియా, నెవెడాల్లోనూ హారిసే స్వల్ప పై చేయి సాధించారు. ఆ రెండు రాష్ట్రాల్లో ఆమెకు 48 శాతం, ట్రంప్‌కు 47 శాతం ఓటర్లు మద్దతిచ్చారు. అరిజోనాలో మాత్రం ట్రంప్ 49 శాతం మద్దతు దక్కగా హారిస్ 44 శాతానికి పరిమితమయ్యారు. పెన్సిల్వేనియాలో ఇద్దరికీ చెరో 47 శాతం ఓట్లు దక్కాయి. ఆరు స్వింగ్ స్టేట్స్‌లోనూ ట్రంప్‌తో పోలిస్తే మహిళల్లో హారిస్ 27 శాతం అధిక ఓట్లు సాధించారు! ట్రంప్ విధానాలు అమెరికా భద్రతకే ముప్పు కలిగించేంత ప్రమాదకరమైనవని ఆరు రాష్ట్రాల ఓటర్లూ అభిప్రాయపడ్డారు.
ఎకానమీ, వలసల్లో ట్రంప్ పైచేయి
ఆర్థికాంశాలను డీల్ చేసే సామర్థ్యం విషయంలో ఎప్పట్లాగే తాజా సర్వేలోనూ ట్రంపే పైచేయి సాధించారు. ఈ విషయంలో ఆయనకు 8 శాతం ఎక్కువ ఓట్లొచ్చాయి. అక్రమ వలసలను అడ్డుకోవడంలో ట్రంప్‌కు, అబార్షన్ తదితరాలపై హారిస్‌కు ఓట్లరు జైకొట్టారు. దేశం ముందున్న అతి ముఖ్యమైన అంశం ఏదన్న ప్రశ్నకు 39 శాతం మంది ఎకానమీకే ఓటేశారు.
Comments
Please login to add a commentAdd a comment