ప్రతీకాత్మకచిత్రం
మనీలా : ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంపై కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా కరోనా దెబ్బకి సీఎన్‌ఎన్ ఫిలిప్పీన్స్ చానల్ ప్రసారాలకు అంతరాయం ఏర్పడింది. ఆ టీవీ చానల్ ఉన్న బిల్డింగ్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదుకావడంతో.. ప్రసారాలు నిలిచిపోయాయి. కనీసం 24 గంటల పాటు తమ ప్రసారాలు నిలిచిపోనున్నాయని ఆ చానల్ ప్రకటించింది. అయితే వెబ్‌సైట్, సోషల్ మీడియా వేదికగా తాము వార్తలను అందిస్తామని సీఎన్‌ఎన్ ఫిలిప్పీన్స్ తెలిపింది. ఈ మేరకు ఆ చానల్ సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ పోస్ట్ ఉంచింది.
‘కోవిడ్-19 ఫిలిప్పీన్స్‌తో సహా ప్రపంచంలోని ప్రతి మూలన వ్యాపి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.97 లక్షల మందికి కరోనా సోకగా వారిలో 7,902 మంది మరణించారు. ఫిలిప్పీన్స్‌లో ఇప్పటివరకు 187 మంది కరోనా బారిన పడ్డారు. మా చానల్ కార్యాలయం కేంద్రీకృతమైన వరల్డ్‌వైడ్ కార్పొరేట్ సెంటర్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వరల్డ్‌వైడ్ కార్పొరేట్ సెంటర్ యాజమాన్యం ఆ ప్రాంతాన్ని శుభ్రపరచనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు కనీసం 24 గంటల పాటు తమ ప్రసారాలను కొనసాగించలేం. అయినప్పటికీ మేము వెబ్‌సైట్, సోషల్ మీడియా వేదికగా వార్తలను అందజేస్తాం. ఈ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. రెండు వారాలకు మందు నుంచే మా సిబ్బందిలో చాలా మంది ఇంటి వద్ద నుంచే వర్క్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని ముందుగానే ఊహించి మేము ఆ నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపింది.
OFFICIAL STATEMENT: CNN Philippines will go off air for at least 24 hours as the building where the network is housed will be disinfected.
— CNN Philippines (@cnnphilippines) March 18, 2020
Employee of another company in the same building, but on a different floor, tests positive for COVID-19 https://t.co/uAy4Xpfx3d pic.twitter.com/VReWgzM9Co
చదవండి : పరీక్షలు లేకుండానే పై తరగతులకు
Comments
Please login to add a commentAdd a comment