వాషింగ్టన్: న్యూస్ రిపోర్టర్‌గా లైవ్ స్ట్రీమింగ్ చేయడం అంత ఈజీ కాదు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనేది పట్టించుకోకుండా కెమెరా వైపు చూస్తూ రిపోర్టింగ్ చేయాలి. ఒక్కోసారి అనుకోని పరిణామాలు జరిగి రిపోర్టర్స్ తమ ఏకాగ్రతను కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇది చాలదన్నట్లు సీరియస్ అంశాలపై మాట్లాడుతున్న సమయంలో ఇంట్లోని పెంపుడు జంతువులో లేక ఇతర జంతువులేవైనా లైవ్ స్ట్రీమింగ్‌లో కనిపిస్తే రిపోర్టర్ ఇబ్బందిగా ఫీలైనా.. దానిని చూసే వారికి మాత్రం నవ్వు తెప్పించడం ఖాయం.
తాజాగా సీఎన్‌ఎన్ రిపోర్టర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మనూ రాజు అనే వ్యక్తి సీఎన్‌ఎన్ చానెల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజు వాషింగ్టన్ డీసీలో తన లైవ్ బైట్‌కు సిద్ధమయ్యాడు. దర్జాగా సూట్ వేసుకొని వార్తలు చదివేయడానికి ప్రిపేర్ అయ్యాడు. కెమెరాను చూస్తూ వార్తలు చదవడం మొదలుపెట్టాడు. ఇంతలో అతని సూట్‌పై ఒక పరుగు పాకుతుండడం కెమెరాకు చిక్కింది. రాజు దానిని గ్రహించకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. అయితే ఆ పురుగు అతని మెడ వద్దకు రావడంతో లైవ్‌లో ఉన్నానన్న విషయం మరిచిన రాజు పురుగును అవతలికి విసిరేశాడు. ఆ తర్వాత పక్కనున్న వారిని '' అలాంటి పురుగులు నా జట్టులో ఉన్నాయా '' అంటూ అడిగాడు. ఇదంతా కెమెరాలో రికార్డ్ అవుతూనే ఉండడంతో అక్కడున్న వారిని నవ్వులు పూయించింది. ఈ వీడియోను స్వయంగా రాజు తన ట్విటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు.
చదవండి: ఫ్లైట్‌లో దంపతుల ముద్దులు.. బ్లాంకెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టస్
Had an unwelcome visitor try to crawl into my live shot earlier. pic.twitter.com/Pu68z0cWSN
— Manu Raju (@mkraju) May 27, 2021
Comments
Please login to add a commentAdd a comment