ట్రంప్, హారిస్ హోరాహోరీ
అట్లాంటా: అమెరికా అధ్యక్ష రేసు అత్యంత హోరాహోరీగా సాగుతోంది. సీఎన్‌ఎన్ వార్తా సంస్థ తాజాగా నిర్వహించిన జాతీయ స్థాయి పోల్‌లో ప్రధాన అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ చెరో 47 శాతంతో సమానంగా నిలిచారు. అంతేగాక అక్టోబర్ 20–23 మధ్య న్యూయార్క్‌టైమ్స్/సియెనా కాలేజీ జరిపిన జాతీయ సర్వేలోనూ వారిద్దరికీ చెరో 48 శాతం దక్కడం విశేషం.
ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో ఎవరు మెరుగనే అంశంపై ఫైనాన్షియల్ టైమ్స్, మిషిగన్ వర్సిటీకి చెందిన రాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సరిపిన సంయుక్త సర్వేలో మాత్రం ట్రంప్‌ది పైచేయి అయింది. ఆయనకు 44 శాతం, హారిస్‌కు 43 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. మొత్తమ్మీద చూస్తే మాత్రం ట్రంప్ కంటే హారిస్‌కు 1.7 శాతం మొగ్గున్నట్టు 538 పోల్ ట్రాకర్ విశ్లేషణలో తేలింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గేందుకు 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో కనీసం 270 ఓట్లు సాధించాలి.
Comments
Please login to add a commentAdd a comment