
సీఎం నాటిన మొక్కకు ఏడాది
మొయినాబాద్: గత ఏడాది రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాటిన మొక్క ఏడాది పూర్తిచేసుకుంది. గత సంవత్సరం జూలై 3న చిలుకూరు బాలాజీ దేవాలయంలో సీఎం కేసీఆర్ సంపంగి మొక్క నాటి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం నాటిన మొక్కలను ఆలయ అర్చకులు సంరక్షిస్తున్నారు. నాటినప్పుడు ఉన్న కొమ్మలు, ఆకులు రాలిపోయి ప్రస్తుతం కొత్త ఆకులతో పచ్చగా కళకళలాడుతోంది ఈ మొక్క.