ఫేస్‌బుక్ సారీ! | Facebook apologizes for morbid results with its “Year in Review” nag | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ సారీ!

Published Mon, Dec 29 2014 1:56 AM | Last Updated on Thu, Dec 27 2018 4:17 PM

ఫేస్‌బుక్ సారీ! - Sakshi

ఫేస్‌బుక్ సారీ!

విషాదాలను గుర్తుచేసినందుకు

న్యూయార్క్: సంవత్సర సమీక్ష పేరుతో విషాద సంఘటనలనూ గుర్తు చేసినందుకు ఫేస్‌బుక్ యూజర్లను ఆ వెబ్‌సైట్ క్షమాపణలు కోరింది.  ఫేస్‌బుక్‌లో ఏడాది పాటుగా యూజర్లు ఉంచిన పోస్టుల్లో కొన్నింటిని హైలైట్లుగా ఎంపికచేసి ప్రతి ఖాతాదారుడికీ తన ‘ఇయర్ ఇన్ రివ్యూ’ చూపించేలా ఆ వెబ్‌సైట్ ఓ అప్లికేషన్ ఉపయోగించింది.

వీడియో, ఫొటోల హైలైట్లను చూడటంతో పాటు షేర చేసేందుకూ వీలయ్యేలా ఈ ‘ఇయర్ ఇన్ రివ్యూ’ యాప్‌ను ఫేస్‌బుక్ రూపొందించింది. అయితే ఆనందకర సంఘటనలతోపాటు విషాద సంఘటనలనూ హైలైట్లుగా ఎంపిక చేసి ఈ యాప్ సమీక్షలో ఉంచేసింది. దీంతో యూజర్లు మనో వేదనకు గురయ్యారు. అందుకే యూజర్లకు క్షమాపణలు చెబుతున్నామని ఫేస్‌బుక్ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement