‘నన్నయ’ డిగ్రీ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల | nannaya final year degree results released | Sakshi
Sakshi News home page

‘నన్నయ’ డిగ్రీ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల

Published Thu, May 11 2017 12:13 AM | Last Updated on Thu, Dec 27 2018 4:17 PM

‘నన్నయ’ డిగ్రీ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల - Sakshi

‘నన్నయ’ డిగ్రీ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల

-53.59 శాతం ఉత్తీర్ణత 
రాజానగరం : ఆదికవి నన్నయ యూనివర్సిటీ డిగ్రీ ఫైనలియర్‌ ఫలితాలను ఉపకులపతి ఆచార్య ఎం. \ముత్యాలునాయుడు బుధవారం విడుదల చేశారు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని కళాశాలల నుంచి 20,397 మంది విద్యార్థులు పరీక్షలకు హజరుకాగా, వారిలో 10,930 మంది ఉత్తీర్ణులయ్యారు. 53.59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది సాధించిన 48.64 శాతం ఉత్తీర్ణత కంటే అధికంగా ఫలితాలను సాధించడానికి కారకులైన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని వీసీ అభినందించారు. సమాజానికి ఉత్తమ విద్యార్థులను అందించడమే లక్ష్యంగా తమ యూనివర్సిటీ ముందంజ వేస్తుందన్నారు. 
మొదటి మూడు స్థానాలు పొందిన విద్యార్థులు :
సబ్జెక్టుల వారీగా మొదటి మూడు స్థానాలను అందుకున్న విద్యార్థుల వివరాలను కూడా వీసీ ప్రకటించారు. 
బీఏ : నీలపు లీలాభవాని, బొచ్చ జానకి, యర్రా మంజుల. బీ ఏ (ఫిలాసఫీ) : పొలిశెట్టి బాలసంతోషి, మద్దాల రవి, సి.పౌలు, బీఎస్సీ : నంబూరి సాయినాగలక్ష్మిప్రసన్న, సూతపల్లి సాయిసుధ, ముత్యాల జయశ్రీ, బీఎస్సీ (హోమ్‌ సైన్స్‌) : చల్లా దుర్గాభవాని, అంకంరెడ్డి చంద్రిక, ఉండ్రాజవరపు ప్రియాంక. బీఎస్సీ (ఫుడ్‌టెక్నాలజీ): యు.పావని, కేఎస్‌ఎస్‌ హారిక, పరమట దుర్గాతేజస్వి బీకాం : నున్నా రత్నం శిరీషా, రాయి వాసవి, బలభద్రుని ప్రత్యూష. బీకాం (ఒకేషనల్‌) : సోమిశెట్టి నిఖిల, తణుకు కల్యాణì పద్మనాగరాణి, విద్యాల కృష్ణకుమారి. బీఏఏ : అడుసుమిల్లి మహేశ్వరి, ఏలిశెట్టి అఖిల, తమ్మన అజయ్‌కుమార్. బీవీఎం : మేడపాటి మౌనిక, రుషాలి జైన్, పుల్లేపు సౌజన్యకుమారి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement