
హైదరాబాద్: తెలంగాణలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ఫలితాలు విడుదలయ్యాయి. 587 పోస్టులకు 434 పురుష అభ్యర్థులు, 153 మంది మహిళ అభ్యర్థులను టీఎస్‌ఎల్‌పీఆర్బీ ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు, కట్ ఆఫ్ మార్కులు రేపు ఉదయం సంబంధిత వెబ్‌సైట్‌లో ఉంచుతామని బోర్టు తెలిపింది.
ఎంపికైన అభ్యర్థులు అటెస్టేషన్ ఫార్మ్, ఇతర ధృవీకరణ పత్రాలను వెబ్‌సైట్‌లో పూర్తించాల్సి ఉంటుంది. ఇందుకు ఆగష్టు 9 నుంచి ఆగష్టు 11 వరకు గడువును ఇచ్చారు. 2022 ఏడాది విడుదల చేసిన 587 ఎస్‌ఐ పోస్టుల రిక్రూట్‌మెంట్‌లో భాగంగా అభ్యర్థులకు ప్రిలిమినరీ, మెయిన్స్, దేహదారుఢ్య పరీక్షలన్నింటినీ బోర్డు విజయవంతంగా పూర్తి చేసింది.
వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇదీ చదవండి: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగింపు..