నన్నయ సెట్ ఫలితాల విడుదల
నన్నయ సెట్ ఫలితాల విడుదల
Published Sat, May 6 2017 11:34 PM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM
- 48 గంటలలోపే ఫలితాలు వెల్లడి
- విద్యార్థినుల హవా
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశానికి ఆదికవి నన్నయ యూనివర్సిటీ నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (నన్నయ సెట్) 2017 ఫలితాలను శనివారం విడుదల చేశారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను కేవలం 48 గంటలలోపే విడుదల చేశామని ఉప కులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు చెప్పారు. ఇది సమష్టి కృషి ఫలితమని పేర్కొంటూ, అందుకు కారకులైన ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఈ పరీక్షలకు విశాఖపట్నంతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసుకున్న 5606 మందిలో 5051 మంది నన్నయ సెట్‌కు హాజరు కాగా వారిలో ఎక్కువమంది విద్యార్థినులే కావడం విశేషమని వీసీ అన్నారు. ఫలితాల్లో కూడా వారి హవా కొనసాగిందన్నారు. ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించిన ర్యాంకులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని, వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ నెల 16 నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లోని ఆదిత్య కళాశాలలు, ఏలూరులోని సెయింట్ థెరీస్సా కళాశాల, భీమవరంలోని సీఎస్‌ఎస్ కళాశాల, అమలాపురం ఎస్‌కేబీఆర్ కళాశాలల్లో సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్ జరుగుతాయన్నారు. ఎప్పటికప్పుడు యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి వివరాలు తెలుసుకోవచ్చని వీసీ చెప్పారు.
నన్నయ సెట్‌లో సబ్జెక్టుల వారీగా మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలు వరుసగా..
లైఫ్ సైన్స్ : గొల్లపల్లి విజయదుర్గ (వాకతిప్ప) 65 మార్కులు, కాదులూరి పూర్ణశ్రీప్రజ్ఞ్ఞ (ఇసుకపల్లి) 64 మార్కులు, కుసుమ హేమశ్రీ (ముక్కామల) 63 మార్కులు.
ఫిజికల్ సైన్స్ : కూచుభొట్ల మహతి (జగ్గయ్యపేట) 74 మార్కులు, నిడదవోలు వెంకట ఆనంద్ (మండపేట) 73 మార్కులు, వంగపండు అనూష (విశాఖపట్నం) 65 మార్కులు.
మేథమెటికల్ సైన్స్ : కీర్తి కనకకృష్ణ (తుని) 90 మార్కులు, నందికొట్ల వీరకనకదుర్గ (అంబాజీపేట) 90 మార్కులు, చింతలపూడి హేమ (బిక్కవోలు) 86 మార్కులు.
కెమికల్ సైన్స్ : సబ్బారపు రమ్య (రాజమహేంద్రవరం) 88 మార్కులు, మహాదశ లక్ష్మీమేఘన (పాలకొల్లు) 84 మార్కులు, గుండుగొల్లు మోహన వెంకట ఏఆర్‌సీహెచ్ (రాజమహేంద్రవరం) 80 మార్కులు.
జియాలజీ : బొర్రా నరేష్ (రాజమహేంద్రవరం) 54 మార్కులు, తాడికొండ సాయి ఉమామహేశ్వరరావు (తాడేపల్లిగూడెం) 54 మార్కులు, జుట్రు హెప్సీ (జువ్వలపాలెం) 48 మార్కులు.
హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ : మేడపోతుల తమ్మన (జగ్గంపేట) 75 మార్కులు, కొల్లి శ్రీనివాసమహాదేవ (రాజమహేంద్రవరం) 75 మార్కులు, బొరుసు సాల్మన్‌బాబు (కాకినాడ) 72 మార్కులు.
ఇంగ్లిష్ : మేడవరపు సీతారామ కనక సుబ్రహ్మణ్యం (మండపేట) 88 మార్కులు, నందేటి అజయ్‌ఘోష్ (నూజివీడు) 85 మార్కులు, దేవరపల్లి నీహారిక (టి.నర్సాపురం) 85 మార్కులు.
తెలుగు : దేవరకొండ ప్రవీణ్‌కుమార్ (విశాఖపట్నం) 67 మార్కులు, ఉపాధ్యాయుల ఎన్.శాస్త్రి (విజయనగరం) 66 మార్కులు, చాపల వెంకట్రాజు (కొవ్వూరు) 61 మార్కులు.
Advertisement