
వచ్చే తెలుగు సంవత్సరం పండుగలివే
మార్చి 18న ఉగాది.. అక్టోబర్ 18న విజయదశమి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సిద్ధాంతులు, జ్యోతిష్యులు, పంచాగకర్తలు వచ్చే తెలుగు ఏడాది (విళంబినామ సంవత్సరం) పండు గలపై స్పష్టతనిచ్చారు. చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు వచ్చే పండుగల వివరాలను వెల్లడించారు. పండుగల నిర్వహణ తేదీలపై ఏటా తలెత్తుతున్న వివాదాలను పరిష్కరించేందుకుగాను ఈ ప్రయత్నం చేశారు. రెండ్రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన విద్వత్ సభ నిర్ణయా లను సభ నిర్వాహకులు ఎం.వెంకటరమణ శర్మ, దివ్యజ్ఞాన సిద్ధాంతి, గాయత్రి తత్వా నంద రుషి, యాయవరం చంద్రశేఖర శర్మ తదితరులు సోమవారం సీఎం కేసీఆర్‌ను కలసి తెలిపారు. పండుగల తేదీలకు సంబంధించిన వివరాలు అందించారు.
విళంబినామ సంవత్సరంలో ముఖ్య పండుగలు
2018 మార్చి 18: ఉగాది; మార్చి 25: స్మార్తానాం శ్రీరామనవమి; మార్చి 26: వైష్ణవానాం శ్రీరామనవమి; ఏప్రిల్ 14: మాస శివరాత్రి; ఏప్రిల్ 18: అక్షయ తృతీయ; మే 10: శ్రీ హనుమాన్ జయంతి; జులై 27, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ; జులై 29: సికింద్రాబాద్ మహంకాళి జాతర ఆగస్టు 24: వరలక్ష్మీ వ్రతం; ఆగస్టు 26: రాఖీ పూర్ణిమ; సెప్టెంబర్ 2: స్మార్తానాం శ్రీ కృష్ణాష్టమి; సెప్టెంబర్ 3: శ్రీ వైష్ణవానాం శ్రీ కృష్ణాష్టమి ; సెప్టెంబర్ 13: వినాయక చవితి; అక్టోబర్ 17: దుర్గాష్టమి; అక్టోబర్ 18: విజయదశమి; నవంబర్ 6: దీపావళి; నవంబర్ 23: కార్తీక పూర్ణమి; 2019 జనవరి 14: భోగి; జనవరి 15: సంక్రాంతి; జనవరి 16: కనుమ; ఫిబ్రవరి 12: రథ సప్తమి; మార్చి 4: మహా శివరాత్రి; మార్చి 19: కామదహనం (దక్షిణాది వారికి); మార్చి 20: కామదహనం (ఉత్తరాది వారికి); మార్చి 21: హోళి.