రైల్వేకోడూరు: ఎర్రచందనం అక్రమ రవాణా కేసుకు సంబంధించి తుపాకుల సిద్దయ్య అనే వ్యక్తికి ఏడాది జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధించినట్లు సబ్ డీఎఫ్‌ఓ వెంకటేష్, కోడూరు ఎఫ్‌ఆర్‌ఓ నయీం అలీ తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ 2012 సంవత్సరంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన మండలంలోని కన్నెగుంట ఎస్టీ కాలనీకి చెందిన సిద్దయ్యకు ఈమేరకు శిక్ష విధించారన్నారు.