- ఇంటర్మీడియట్‌లో 8వ స్థానం
- వివిధ ‘సెట్ల’లో ‘తూర్పు’ మెరుపులు ∙
- ఎట్టకేలకు డీఎస్సీ–2014 నియామకాలు
‘పది’లో తృతీయం
Published Fri, Dec 30 2016 10:09 PM | Last Updated on Thu, Jul 11 2019 5:07 PM
రాయవరం :
జిల్లా విద్యార్థులు 2016లో ఉత్తమ ఫలితాలు సాధించారు. పదో తరగతి పరీక్షల్లో జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. ఎంసెట్‌తో పాటు వివిధ సెట్లలోనూ జిల్లా విద్యార్థులు విజయఢంకా మోగించారు. సర్కారు బడుల్లోని విద్యార్థులు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించి కార్పొరేట్ బడులకు తీసిపోమని చాటారు. ఈ ఏడాది పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నా..ఉపాధ్యాయులు సీపీఎస్ విధానం రద్దు చేయాలంటూ ఆందోళన బాట పట్టారు.
‘పది’లో ప్రైవేటుకు దీటుగా..
పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా రాణించారు. రాష్ట్రంలో జిల్లా తృతీయస్థానంలో నిలిచింది. 2015–16 విద్యా సంవత్సరంలో 67,493 మంది పరీక్షలకు హాజరు కాగా 65,850 మంది పాస్ కాగా 97.57 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 33,438 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 32,637 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల విభాగంలో 34,055 మంది హాజరు కాగా 33,123 మంది ఉతీర్ణత సాధించారు.
ఎంసెట్‌లో రెండో ర్యాంకు
ఈ ఏడాది మే 10న విడుదలైన ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాల్లో జిల్లా విద్యార్థి రాష్ట్రంలో రెండవ స్థానం పొందాడు. రావులపాలెంకు చెందిన చప్పిడి లక్షీ్మనారాయణ 157 మార్కులు సాధించి రాష్ట్రంలో 2వ ర్యాంకు పొందాడు. కాకినాడకు చెందిన బొద్దిరెడ్డి సూర్యగోపాల్ 152 మార్కులతో 20వ ర్యాంకు సాధించగా, కాకినాడకు చెందిన పి.వి.సత్యశ్రావ్య 147 మార్కులతో 47వ ర్యాంకు సాధించారు. అలాగే పదుల సంఖ్యలో విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో మెరిశారు. ఇంజనీరింగ్ విభాగంలో 16,535 మంది పరీక్షకు హాజరు కాగా 11,067 మంది ఉత్తీర్ణులయ్యారు. మెడిసి¯ŒSలో బాలికల విభాగంలో 3,741 మంది పరీక్ష రాయగా 3,076 మంది, బాలుర విభాగంలో 1,507 మంది పరీక్ష రాయగా, 1,146 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాకు చెందిన బండి సుబ్రహ్మణ్య సుధీర్ 148 మార్కులతో 19వ ర్యాంకు, కె.ప్రత్యూష 23వ ర్యాంకు సాధించగా పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు పొందారు.
ఐసెట్‌లోనూ..
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ కామ¯ŒS ఎంట్ర¯Œ్స టెస్ట్(ఐసెట్–2016)లోనూ జిల్లా విద్యార్థులు మెరిశారు. రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు జిల్లా సొంతమైంది. మొదటి ఐదు ర్యాంకర్లలో ముగ్గురు జిల్లాకు చెందిన వారు ఉండడం విశేషం. ధవళేశ్వరానికి చెందిన శీని జ్ఞానరామ్‌ప్రసాద్ 1వ ర్యాంకు సాధించగా, చందుపల్లి సుదీప్ 4వ ర్యాంకు, గంధం భార్గవి 5వ ర్యాంకు కైవసం చేసుకున్నారు.
సివిల్స్‌లోనూ మెరిసిన జిల్లా వాసులు..
సివిల్స్‌లోనూ జిల్లా వాసులు మెరిశారు. మలికిపురం మండలం గూడవల్లికి చెందిన కట్టా సింహాచలం పట్టుదల ముందు పుట్టు అంధత్వం తలవంచింది. సింహాచలం సివిల్స్ పరీక్షలో 538వ ర్యాంకు సాధించాడు. అలాగే ధవళేశ్వరానికి చెందిన బండారు బాలుమహేంద్ర సివిల్స్ పరీక్షల్లో 730వ ర్యాంకు సాధించాడు.
ఆసెట్‌లోను..
ఆంధ్రా విశ్వవిద్యాలయం పీజీలో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షలో జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. రాయవరం మండలం పసలపూడికి చెందిన తాడి సుస్మిత రసాయనశాస్త్రంలో యూనివర్సిటీ పరిధిలో మూడవ ర్యాంకు సాధించింది. అలాగే పలువురు విద్యార్థులు ఆసెట్‌లో వివిధ విభాగాల్లో ఉత్తమ ర్యాంకులు పొందారు.
ఉపాధ్యాయుల ఉద్యమబాట..
ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల సాధనకు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టారు. రోజురోజుకూ విద్యారంగంలో కొత్త పథకాలు, కార్యక్రమాల పేరుతో ఉపాధ్యాయులను మానసికంగా వేధింపులకు గురిచేసేలా ఉంటున్న చర్యలను వ్యతిరేకించారు. ముఖ్యంగా ఈ ఏడాది కంట్రిబ్యూటరీ పెన్ష¯ŒS స్కీమ్(సీపీఎస్)కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. కొత్తగా సీపీఎస్ జిల్లా, రాష్ట్ర కమిటీలు ఏర్పడ్డాయి.
డీఎస్సీ–2014 నియామకాలను ఎట్టకేలకు జూ¯ŒS నెలలో చేపట్టారు. తీవ్ర జాప్యం అనంతరం ఈ నియామకం ఉపాధ్యాయ అభ్యర్థులకు ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. ఎస్‌జీటీలో 952 మంది ఎంపికయ్యారు.
ఇంటర్‌లో 8వ స్థానం
ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేరోజు ప్రకటించారు. జిల్లాలో 37,525 మంది సీనియర్ ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయగా 25,653 మంది ఉత్తీర్ణులయ్యారు. 68 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 8వ స్థానంతో సరిపెట్టుకుంది. ఫస్టియర్ పరీక్షలు 42,435 మంది రాయగా, 27,186 మంది ఉత్తీర్ణులయ్యారు. 64శాతం ఉత్తీర్ణతతో ఫస్టియర్ ఫలితాల్లో రాష్ట్రంలో ఐదవ స్థానంలో నిలిచింది. ఇంటర్ వృత్తివిద్య(ఒకేషనల్) కోర్సుల ఫలితాలు మాత్రం తీవ్ర నిరాశపర్చాయి.
Advertisement