యాహూ సెర్చ్‌లో ప్రధాని మోదీ టాప్ | Modi, Mukesh Ambani and Sunny top Yahoo India 2014 search list | Sakshi
Sakshi News home page

యాహూ సెర్చ్‌లో ప్రధాని మోదీ టాప్

Published Tue, Dec 9 2014 12:39 AM | Last Updated on Thu, Dec 27 2018 4:17 PM

యాహూ సెర్చ్‌లో ప్రధాని మోదీ టాప్ - Sakshi

యాహూ సెర్చ్‌లో ప్రధాని మోదీ టాప్

బెంగళూరు: నెటిజన్‌లు ఈ ఏడాది ఇంటర్నెట్‌లో  ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీల పేర్లను ఎక్కువగా సెర్చ్ చేశారని యాహూ పేర్కొంది. యాహూ ఇండియా సంస్థ ఇయర్ ఇన్ రివ్యూ పేరుతో ఏడవ వార్షిక నివేదికను విడుదల చేసింది.

ఈ ఇయర్ ఇన్ రివ్యూ ప్రకారం..., అత్యంత శక్తివంతమైన అగ్రశ్రేణి పది రాజకీయ నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు.  ఈ దేశపు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు.  ఇక సెలిబ్రిటీల విషయానికొస్తే, సన్నీ లియోన్ వరుసగా మూడో ఏడాది మొదటి స్థానంలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement