భారత్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రధాని మోదీనే.. అంబానీ ప్రశంసలు | PM Modi Most Successful Indian Prime Minister, Says Mukesh Ambani | Sakshi
Sakshi News home page

‘భారత్‌ అభివృద్ధిని ఏ శక్తి అడ్డుకోలేదు’, మోదీ దేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రధాని.. అంబానీ ప్రశంసలు

Published Wed, Jan 10 2024 8:14 PM | Last Updated on Wed, Jan 10 2024 8:26 PM

Pm Modi Most Successful Indian Prime Minister Says Mukesh Ambani - Sakshi

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశసంల వర్షం కురిపించారు. భారత చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రధాని మోదీనే అని కొనియాడారు. గాంధీనగర్‌లో జరుగుతున్న ‘వైబ్రంట్ గుజరాత్‌ సమ్మిట్‌’ లో ప్రధాని సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ముఖేష్‌ అంబానీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు. వాటిల్లో 

♦ రిలయన్స్ ఎప్పుడూ గుజరాతీ కంపెనీగానే ఉంటుంది 

♦ నేను గుజరాతీగా గర్వపడుతున్నాను  

♦ విదేశీయులు నూతన ఇండియా అంటేనే నూతన గుజరాత్‌నే ఊహించుకుంటున్నారు. 

♦ ఇందంతా కేవలం ఒక్క మోదీ వల్లే సాధ్యమైంది. భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రధానమంత్రి ప్రధాని మోదీనే 

♦ రిలయన్స్ ఎప్పటికీ గుజరాతీ కంపెనీగానే కొనసాగుతుంది. రిలయన్స్ గత 10 సంవత్సరాలలో భారతదేశం అంతటా 12 లక్షల కోట్లు పెట్టుబడు పెట్టింది. అందులో 1/ 3వ వంతు ఒక్క గుజరాత్‌లోనే పెట్టుబడి పెట్టబడింది 

♦ వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌ను ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పెట్టుబడిదారుల సదస్సు  

♦ గుజరాత్‌కు స్వాగతం. 10వ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్. నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పెట్టుబడిదారుల సదస్సు. రెండు దశాబ్దాల క్రితం మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ‘ఇన్వెస్టర్‌ సమ్మిట్‌’గా గుర్తింపు పొందింది. ఇది ప్రధాని దార్శనికతకు నిదర్శనం 

♦ 2047 నాటికి భారతదేశం 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. దీన్ని ఏ శక్తీ అడ్డుకోలేదు. గుజరాత్ 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుంది’అని అంబానీ అన్నారు. అనంతరం రిలయన్స్‌ ఇండస్ట్రీ దేశంలో పెట్టుబడులపై ప్రస్తావించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement