విద్యార్థులకు ఆర్‌బీఐ క్విజ్ పోటీలు | RBI quiz competitions for students | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ఆర్‌బీఐ క్విజ్ పోటీలు

Published Wed, Aug 6 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

విద్యార్థులకు ఆర్‌బీఐ క్విజ్ పోటీలు

విద్యార్థులకు ఆర్‌బీఐ క్విజ్ పోటీలు

న్యూఢిల్లీ: సీనియర్ స్యూల్ విద్యార్థులకు ఆర్‌బీఐక్యూ 2014 పేరుతో క్విజ్ పోటీలను నిర్వహించనున్నట్లు ఇక్కడి రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం తెలిపింది. పోటీలను దేశవ్యాప్తంగా ఈ నెల 6,8, 27వ తేదీలలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 9-12 తరగతుల ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్ల విద్యార్థులు ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చునని పేర్కొంది.

 తొలి దశలో గెలుపొందిన టీమ్‌లను జోనల్ ఫైనల్స్‌కు, ఆపై నేషనల్ ఫైనల్స్‌కు ఎంపిక చేయనున్నట్లు వివరించింది. ఈ క్విజ్‌లో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలలో రిజర్వ్ బ్యాంక్ పాత్ర, చరిత్రలతోపాటు, ఆర్థిక విషయాలు, కరెంట్ అఫైర్స్, దేశ పురోభివృద్ధికి సహకరించిన వ్యక్తులు, సంఘటనలు వంటి అంశాలపై అవగాహన కల్పించనుంది. ఇతర వివరాలను www.rbi.org.in చూడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement