
సాక్షి, హైదరాబాద్: చాలా కాలం నుంచి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూసిన నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. అలాగే భారీ సంఖ్యలో కొలువుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. త్వరలోనే టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూప్-1, 2, 3, 4 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. గ్రూప్-1లో 503 ఉద్యోగాలను, గ్రూప్-2లో 582 పోస్టులను, అలాగే గ్రూప్-3లో 1373 పోస్టులు, గ్రూప్-4లో 9,168 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
ఇలాంటి పోటీపరీక్షలకు గతంలో జరిగిన పరీక్షల ప్రీవియస్ పేపర్స్ చూస్తే.. అభ్యర్థికి ఏఏ సబ్జెక్ట్‌లలో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి అనే విషయంపై ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. గ్రూప్స్ పరీక్షలకు ప్రీపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం గత పరీక్షల పాత ప్రశ్నప్రత్రాలను (Previous Question Papers) www.sakshieducation.com అందిస్తోంది.
గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment