
సాక్షి, హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)లో 3,010 పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన జారీ కానుంది. 2,440 జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం), 500 లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ), 70 జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (జేపీవో) పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసేందుకు సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి ట్రాన్స్‌కో జారీ చేసిన ప్రకటనలో 90 శాతం పోస్టులను లోకల్ కోటా అభ్యర్థులకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు హైకోరును ఆశ్రయించారు. ఈ కేసులో హైకోర్టు తీర్పు కోసం టీఎస్‌ఎస్పీడీసీఎల్ యాజమాన్యం ఎదురుచూస్తోంది. ఈ తీర్పుకు వచ్చిన తర్వాత 3,010 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేస్తామని సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. నెల రోజుల్లో తీర్పు రావచ్చని ఆశిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు 318 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 133 సబ్ ఇంజనీర్, 112 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, 19 అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment