విద్యుత్‌ కొలువులు 1,201 | 1201 Jobs in Electricity department | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కొలువులు 1,201

May 16 2022 1:11 AM | Updated on May 16 2022 3:18 PM

1201 Jobs in Electricity department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)లో 1000 జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం), 201 సబ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రి కల్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. జిల్లా (విద్యుత్‌ సర్కిల్‌) పోస్టులుగా భర్తీ చేయనున్నారు. కొత్త జోనల్‌ విధానం ప్రకారం దక్షిణ తెలంగాణలోని 5 ఉమ్మడి జిల్లాల అభ్యర్థులకు 95% ఉద్యోగాలను రిజర్వ్‌ చేశారు. 

► జేఎల్‌ఎం అభ్యర్థుల వయోపరిమితి 2022, జనవరి 1 నాటికి 18–35 ఏళ్లు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు మరో ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తించనుంది. గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జేఎల్‌ఎం పోస్టులకు వర్తింపజేయలేదు. ట్రాన్స్‌కో/ టీఎస్‌ఎస్పీడీసీఎల్‌/ టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సంస్థల్లో ఆర్టిజన్లు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక వయోసడలింపు కల్పించారు. వారు ఆయా సంస్థల్లో చేరినప్పుడున్న వయసును పరిగణనలోకి తీసుకోనున్నారు. ఎలక్ట్రికల్‌/వైర్‌మెన్‌ ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌లో రెండేళ్ల ఇంటర్‌ వొకేషనల్‌ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు జేఎల్‌ఎం పోస్టులకు అర్హులు. అప్రెంటిస్‌ అవసరం లేదు.


► సబ్‌ ఇంజనీర్‌ అభ్యర్థులు 2022, జనవరి 1 నాటికి 18–44 ఏళ్లు వయోపరిమితి కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, శారీరక వికలాంగులకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు లభించనుంది. ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌లో డిప్లమో చేసిన వాళ్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిప్లమా తర్వాత ఇవే విభాగాల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీలు చేసిన వాళ్లు కూడా అర్హులే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement