
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతల ఆత్మహత్యలే ఆ పార్టీ పతనానికి నాంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సిద్దిపేట, మేడ్చల్ జిల్లాలకు చెందిన పలువురు సర్పంచులు, టీఆర్‌ఎస్ నేతలు శుక్రవారం ఇక్కడ బీజేపీ లో చేరారు. లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ కార్యాలయానికి ‘టు లెట్’ బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి తొందర లోనే వస్తుందన్నారు. 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. అబద్ధాలు చెప్పడంలోనూ, ప్రజలను మోసగించడం లోనూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఒక్కటేనని అన్నారు. ఉద్యమకారులపై దాడులు చేసినవారు, అవినీతి చరిత్ర ఉన్నవారు టీఆర్‌ఎస్‌లో చేరగానే పవిత్రులైపోయారా అని ప్రశ్నించారు. సచివాలయానికి రాకుం డా రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కరేనన్నారు.
తెలంగాణ ద్రోహులకు, ఉద్య మకారులపై దాడులకు తెగబడినవారికే ఇప్పుడు పదవులు ఇవ్వడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం తో రగిలిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో కంటే టీఆర్‌ఎస్ పాలనలో ఎక్కువ అవినీతి జరుగుతున్నదని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కనీస పర్యవేక్షణ లేదని ఈ సందర్భంగా లక్ష్మణ్ ఆరోపించారు.