
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రులు తెలంగాణ ప్రభుత్వ పనితీరును పొగుడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని బీజేపీ తేల్చి చెప్పింది. వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగిడినట్టు టీఆర్‌ఎస్ పార్టీనే తప్పుడు ప్రచారం చేస్తూ మీడియాకు సమాచారం ఇస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధులు ప్రకాశ్‌రెడ్డి, సుభాష్, నరేశ్ పేర్కొన్నారు.
తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా తెలంగాణ ప్రభు త్వ పనితీరును పొగిడినట్టు తప్పుడు ప్రచా రం జరుగుతోందని, కేసీఆర్, జైట్లీల ఆంతరంగిక చర్చలపై జైట్లీ బయట మాట్లాడలేదని, అలాంటప్పుడు ఆయన పొగిడినట్టుగా ప్రచా రం జరగటం దురదృష్టకరమన్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని చూసి కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ప్రధాని మోదీపై విమర్శలు చేయటం ఆయన చవకబారుతనానికి నిదర్శనమని విమర్శించారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పోటీ చేయకుండా టీఆర్‌ఎస్‌కు లోపాయికారిగా మద్దతు ఇచ్చిన విష యం వాస్తవం కాదా అని వారు ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment