
23 నుంచి అమిత్‌షా రాష్ట్ర పర్యటన
మూడు రోజులు టూర్: లక్ష్మణ్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఆయన ఈ నెల 23, 24, 25 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించ నున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలి పారు. సోమవారం ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాల యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీని సంస్థాగ తంగా బలోపేతం చేయడానికి అమిత్‌షా రాష్ట్రం లో పర్యటించనున్నట్లు చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తూ ప్రజావ్యతిరేక విధా నాలను అవలంబిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు.
ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ బలోపేతానికి అవకాశాలు ఉన్నాయని, ఈ విషయాలపై జాతీయ అధ్య క్షుడితో చర్చించామని, దాని కి అనుగుణంగా పార్టీ పటిష్ట తకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. అమితా షాతో సమావేశంలో హైకోర్టు విభజన అంశంపైనా చర్చించామన్నారు. అయితే ఈ విషయం సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని అమిత్‌షా చెప్పారన్నారు. సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొ న్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి అహ్లూవాలియాతో సమావేశమైన దత్తాత్రేయ, లక్ష్మణ్ తెలంగాణలో మిర్చి రైతులను ఆదుకో వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందిం చిన కేంద్ర మంత్రి... రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకుంటానని చెప్పారు.
బీజేపీలోకి కాంగ్రెస్ నేత నందీశ్వర్‌గౌడ్
కాంగ్రెస్ సీనియర్ నేత, పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ సోమవారం ఢిల్లీలో లక్ష్మణ్, అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. నోట్ల రద్దు, బీసీ కమిషన్‌కు రాజ్యంగబద్ధ హోదా కల్పించడం లాంటి నిర్ణయాలపట్ల ఆకర్షితుడినై తాను బీజేపీలో చేరినట్టు ఆయన తెలిపారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించే విష యంలో లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినా.. రాజ్యసభలో కాంగ్రెస్ వివిధ కారణాలు చూపుతూ అడ్డుకోవడం తనను బాధించిందన్నారు. దేశాభి వృద్ధి మోదీతోనే సాధ్యమవుతుందన్నారు.