నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రాక
Published Wed, Aug 31 2016 12:15 AM | Last Updated on Mon, May 28 2018 3:58 PM
హన్మకొండ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేడు(బుధవారం) జిల్లాకు రానున్నారు. సెప్టెం బర్ 17న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటన ఏర్పాట్లపై జిల్లా నాయకులతో లక్ష్మణ్ చర్చించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా, నగర కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్ తెలిపారు. హసన్‌పర్తి కిట్స్ కళాశాల సమీపంలోని బాలాజీ గార్డెన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరుగుతుందన్నారు.
Advertisement
Advertisement