
డాక్టర్ లక్ష్మణ్
తెలంగాణ విమోచన దినోత్సవంపై ప్రభుత్వం రేపటిలోగా ఒక ప్రకటన చేయాలని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవంపై ప్రభుత్వం రేపటిలోగా ఒక ప్రకటన చేయాలని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. లేదంటే సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో తాము వాడవాడలా జాతీయ పతాకాన్ని ఎగురవేస్తామని చెప్పారు.
గోల్కొండ కోట మీదే తెలంగాణ విమోచన వేడుకలు జరపాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల అజెండాను కాకుండా మజ్లీస్ అజెండాను అమలు చేస్తుందని లక్ష్మణ్ విమర్శించారు.
**