
వి.కోట(చిత్తూరు జిల్లా): ఫేస్‌బుక్‌లో పరిచయమైన శ్రీలంకకు చెందిన ఓ యువతిని చిత్తూరు జిల్లా యువకుడు ప్రేమ వివాహం చేసుకున్న ఘటన శనివారం వెలుగులోకి వచి్చంది. వివరాల్లోకి వెళితే... వి.కోట మండలంలోని ఆరిమాకులపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు ఆరేళ్ల కిందట ఫేస్‌బుక్‌లో శ్రీలంక దేశం కొలంబోలోని బొలగుండుకు చెందిన విఘ్నేశ్వరితో పరిచయమైంది.
వీరి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ నేపథ్యంలో విఘ్నేశ్వరి ఈ నెల 8వ తేదీ టూరిస్ట్ వీసా తీసుకుని ఇండియా వచ్చింది. ఈ నెల 20వ తేదీ లక్ష్మణ్, విఘ్నేశ్వరి వి.కోటలోని సాయిబాబా మందిరంలో వివాహం చేసుకున్నారు. ఆరిమాకులపల్లి గ్రామంలోని లక్ష్మణ్ ఇంట్లో ఉంటున్నారు. విఘ్నేశ్వరి టూరిస్ట్ వీసా గడువు ఆగస్టు 6వ తేదీతో ముగియనుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న వి.కోట పోలీసులు లక్ష్మణ్, విఘ్వేశ్వరిలను చిత్తూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment