Introduction
-
వైఎస్సార్సీపీలో ఫుల్ జోష్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికార వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లాలో ఫుల్‌జోష్‌తో కనిపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా స్థానిక పరిస్థితులు, సమీకరణలకు అనుగుణంగా జిల్లాలో అభ్యర్థుల మార్పులు, చేర్పుల ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన పార్టీ ఏలూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశం, నూతన అభ్యర్థుల పరిచయ సభ గ్రాండ్ సక్సెస్ కావడం పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపింది. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్‌యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు, పోలవరం అసెంబ్లీ అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మిలను జిల్లా నాయకులు కార్యకర్తలకు పరిచయం చేశారు. ఎన్నికల శంఖారావం పూరించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో నవోత్సాహం కదంతొక్కుతోంది. ఇప్పటికే ప్రజల్లోకి.. ఏలూరు పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానంలో వైఎస్సార్సీపీ ఇన్చార్జులను మార్చింది. మిగిలిన చోట్ల ఇప్పటికే ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తున్నారు. పాదయాత్రలు చేస్తూ.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఐదేళ్లలో తాము చేసిన పనులను వివరిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా గడపగడపకూ చేకూరిన లబ్ధిని చెబుతున్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఈనెల 30వ తేదీకల్లా నియోజకవర్గ స్థాయి సమావేశాలు ముగిసేలా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న చింతలపూడి ఇన్చార్జి కంభం విజయరాజు, పోలవరం ఇన్చార్జి తెల్లం రాజ్యలక్ష్మి ఇప్పటికే వారం రోజులుగా నియోజకవర్గంలో విస్తతంగా పర్యటిస్తున్నారు. ఇక ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ఆదివారం నుంచి పార్లమెంట్ పరిధిలో పర్యటనకు శ్రీకారం చుట్టారు. టీడీపీలో అనిశ్చితి ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో రాజకీయ అనిశ్చితి తారాస్థాయికి చేరింది. పొత్తుల గందరగోళం ఒక వైపు, టీడీపీ, జనసేన నేతల మధ్య సమన్వయ లోపం మరోవైపు ఆ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏలూరు ఎంపీ టికెట్‌ను ముగ్గురు, నలుగురు అభ్యర్థులు ఆశిస్తున్నా స్పష్టత లేకపోవడం పొత్తుల్లో జనసేనకు ఇచ్చే స్థానాలు తేల్చకపోవడంతో రెండు పార్టీల నేతల్లో రాజకీయ నైరాశ్యం నెలకొంది. ఇక దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ సమన్వయకర్త చింతమనేని ప్రభాకర్ యథావిధిగా హల్చల్ చేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలు చింతమనేని వద్దు–ఎవరైనా ముద్దు అనే పేరుతో నిరసన సమావేశం నిర్వహించినప్పటి నుంచి ఆయన తీవ్ర ఆందోళనకు గురై టికెట్ ఆశిస్తున్న ఇతర నేతలపై నోరుపారేసుకుంటున్నట్లు సమాచారం. కైకలూరు, నూజివీడు, పోలవరంలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్లమెంట్ స్థానానికో సభ నిర్వహిస్తున్నా అభ్యర్థిత్వాలపై స్పష్టత ఇవ్వడం లేదు. ఫలితంగా ముఖ్యనేతలు ఖర్చుకు ముందుకురాని పరిస్థితి. అయితే జనసేన, టీడీపీ శ్రేణులు మాత్రం సోషల్ మీడియా వార్ కొనసాగిస్తున్నాయి. ఏ పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేస్తాయో పోస్టులు షేర్ చేస్తూ గందరగోళాన్ని మరింత పెంచుతున్నాయి. -
డైరెక్టర్‌గా హీరో విజయ్ తనయుడు
తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ విజయ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సుభాస్కరన్ మాట్లాడుతూ– ‘‘కొత్త ఆలోచనలతో ఉండే యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ ఎప్పుడూ గేమ్ చేంజర్స్ అవుతారని మా నమ్మకం. జాసన్ సంజయ్ విజయ్ చెప్పిన యూనిట్ పాయింట్ మాకు నచ్చింది. సంజయ్ లండన్‌లో స్క్రీన్ రైటింగ్‌లో బీఏ (హానర్స్), టొరంటో ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ప్రోడక్షన్ డిప్లామా పూర్తి చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, సాంతికేతిక నిపుణులు పని చేయబోతున్నారు’’ అన్నారు. ‘‘లైకాప్రోడక్షన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో నా ఫస్ట్ మూవీ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ సంస్థకు నా స్క్రిప్ట్ నచ్చటం నాకు హ్యాపీగా ఉంది’’ అన్నారు జాసన్ సంజయ్ విజయ్ -
చిత్తూరు కుర్రాడితో శ్రీలంక యువతి ఫేస్బుక్ ప్రేమ.. విమానమెక్కి..!
వి.కోట(చిత్తూరు జిల్లా): ఫేస్బుక్లో పరిచయమైన శ్రీలంకకు చెందిన ఓ యువతిని చిత్తూరు జిల్లా యువకుడు ప్రేమ వివాహం చేసుకున్న ఘటన శనివారం వెలుగులోకి వచి్చంది. వివరాల్లోకి వెళితే... వి.కోట మండలంలోని ఆరిమాకులపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు ఆరేళ్ల కిందట ఫేస్బుక్లో శ్రీలంక దేశం కొలంబోలోని బొలగుండుకు చెందిన విఘ్నేశ్వరితో పరిచయమైంది. వీరి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ నేపథ్యంలో విఘ్నేశ్వరి ఈ నెల 8వ తేదీ టూరిస్ట్ వీసా తీసుకుని ఇండియా వచ్చింది. ఈ నెల 20వ తేదీ లక్ష్మణ్, విఘ్నేశ్వరి వి.కోటలోని సాయిబాబా మందిరంలో వివాహం చేసుకున్నారు. ఆరిమాకులపల్లి గ్రామంలోని లక్ష్మణ్ ఇంట్లో ఉంటున్నారు. విఘ్నేశ్వరి టూరిస్ట్ వీసా గడువు ఆగస్టు 6వ తేదీతో ముగియనుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న వి.కోట పోలీసులు లక్ష్మణ్, విఘ్వేశ్వరిలను చిత్తూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించినట్లు తెలిసింది. -
యుద్ధ చరిత్రల్లో స్త్రీ
రెండవ ఇటాలో–ఇథియోపియన్ యుద్ధంలో (1935–1941) ఇటలీ మీద ఇథియోపియా సాధించిన విజయం ప్రతిష్టాత్మకమైనది. మొదటిసారి పరాజయం పాలైన ఇటలీ, నలభై ఏళ్ల తరవాత ముస్సోలినీ కాలంలో మరోసారి దురాక్రమణకి ప్రయత్నించి పరాజయాన్ని చవిచూసింది. సుశిక్షిత సైన్యం, ఆధునిక యుద్ధపరికరాలూ, రేడియోలతోబాటు ఇథియోపియన్ ప్రాంతపు నైసర్గిక స్వరూపం తెలిసిన శత్రురాజుల సహకారం ఇటలీ బలాలైతే, అప్పటికప్పుడు హడావుడిగా సమీకరించుకున్న సైన్య సమూహాలూ, సాంప్రదాయ యుద్ధపరికరాలూ, సమాచార లోపాలూ ఇథియోపియా బలహీనతలు. ఓటమి అనివార్యం అనుకున్న తరుణంలో ఇటలీని నిలువరించి విజయాన్ని సాధించడం ఇథియోపియా చరిత్రలో ఘనమైన అధ్యాయం. ఇథియో–అమెరికన్ రచయిత్రి మాజా మెంగిస్టె రాసిన చారిత్రక నవల ‘ద షాడో కింగ్’ ఈ యుద్ధం గురించి చెబుతుంది. పురుష సైనికాధికారులని మాత్రమే ప్రస్తావించే చరిత్రలోనూ వివక్ష ఉందన్నది రచయిత్రి వాదన. పదేళ్లపాటు ఈ యుద్ధం మీద చేసిన పరిశోధనలో స్త్రీల ప్రస్తా వన ఎక్కడా కనిపించని రచయిత్రికి, తమ వంశంలోని స్త్రీలు ఇందులో పాల్గొన్నారని తల్లి ద్వారా తెలియటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇథియోపియన్ స్త్రీలు తెరవెనుక పాత్రలకే పరిమితమై పోకుండా ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొన్నారన్న నిజాన్ని చరిత్రకారులు గుర్తించకపోవటం శోచనీయమనీ, వారి సాహస గాథలు వంటింటి కథలుగా మిగిలిపోతున్నాయన్న రచయిత్రి ఆవేదననే నవలకి ప్రేరణ. ఇటలీ యుద్ధం ప్రకటించాక పరాజయ, ప్రాణభయాలతో ఇథియోపియా రాజు హైలా సెలాసే ఇంగ్లండ్ పారిపోతాడు. రాజే పారిపోయాడని తెలిస్తే ప్రజలు నిర్వీర్యులవుతారనుకున్న సైన్యాధికారి కిడానె, రాజు రూపురేఖలతో ఉన్న దళసభ్యుడు మినిమ్ అనే వ్యక్తిని ప్రజలను ఉత్తేజపరిచేందుకు షాడో కింగ్‌గా ప్రజల ముందుకు తెస్తాడు. గెరిల్లా పద్ధతిలో ప్రాణాలకు తెగించి పోరాడిన కిడానె, హీరూట్, ఆస్తర్, ఇతర పౌరులూ వెన్నెముకై నిలిచి గెలిచిన యుద్ధమే కథాంశం; యుద్ధభూమే కథావరణం. కొడుకు మరణం, భర్త నిర్లక్ష్యం, సేవకురాలు హీరూట్ పట్ల భర్త కిడానెకి ఉన్న ఆకర్షణ లాంటి సమస్యలున్నప్పటికీ, స్త్రీలను సంఘటిత పరుస్తూ సైనికులుగా తయారుచేసి ఇటాలియన్ సైన్యాధికారి ఫ్యుసెల్లి మీదకు ప్రత్యక్షదాడి చేసిన ఆస్తర్; ‘కొంతమంది వస్తువులను సొంతం చేసుకోటానికి పుడితే మరికొందరు వాటిని శుభ్రం చేసి నిర్దేశిత ప్రాంతాల్లో పెట్టడానికే పుడతారు,’ అనుకునే స్థితినుంచి యుద్ధఖైదీగా మారినపుడు గుండెనిబ్బరంతో ప్రయాణం సాగించే సేవకురాలు హీరూట్; వేశ్యగా పరిచయమై, ఇటాలియన్ సైన్యాధికారులకు సేవలందిస్తూ, మరోపక్క ఇథియోపియన్లకు గూఢచారిణిగా వ్యవహరిస్తూ స్వతంత్రాపేక్ష కోల్పోని ఫిఫి – వీళ్లంతా వివిధ ఔన్నత్యాలతో ప్రకాశించే స్త్రీ పాత్రలు. దాడులు కొనసాగించమని లండన్ నుంచి రాజు ఉత్తర్వులు పంపినప్పుడు– కొడుకుని రక్షించుకుంటున్న రాజు, కొడుకుని కోల్పోయిన తనని ప్రాణత్యాగం వైపుకి నడిపించటంలోని స్వార్థచింతన అర్థమవుతుంది సైన్యాధికారి కిడానేకి. ఇటాలియన్ సైన్యంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ ఇటాలియన్స్ దాష్టీకాలను అరాచకాలను సమర్థించలేని, యూదుడయిన కారణంగా వారిలో కలిసిపోలేని ఎత్తోరేది మౌనవేదన. ఇటలీ సైన్యాధికారి ఫ్యుసెల్లి సైనికరూపం వెనక ఉన్నభయాలూ, న్యూనతలూ మనిషి మౌలిక రూపాన్ని చూపిస్తాయి. యుద్ధానంతరం రాజ్యాధికారం తిరిగి చేపట్టగలిగిన హైలా సెలాసే, సివిల్ వార్ అనంతరం రైతుగా మారడం కొసమెరుపు. రాజై ఉండి అపరాధపు నీలినీడల్లో కుమిలిన హైలా సెలాసే షాడో కింగా? రైతే రాజుగా మారి ప్రజలను ఉత్తేజపరిచిన మినిమ్ షాడో కింగా అన్నది శీర్షికలోని ప్రహేళిక. బహుళ కథకులు, బలమైన పాత్రలు, కొత్తఒరవడిని గుర్తుచేసే కథాకథనం, యుద్ధవాతావరణ చిత్రీకరణలోని గ్రీక్ ట్రాజెడీ ఛాయలు, కథనంలో ఇమిడిపోయిన సూక్ష్మమైన వర్ణనలు, మనస్తత్వ విశ్లేషణలు, చర్చింపబడిన వివక్షలు నవల బలాలు. నవలలోని కథనం ‘ఫొటో’, ‘కోరస్’, ‘ఇంటర్లూ్యడ్స్’ అనే అధ్యాయాలుగా ఇటాలియన్ అరాచకాలనీ, జరుగుతున్న కథనీ, రాజు అంతరంగాన్నీ చిత్రిస్తూంటాయి. అక్కడక్కడా కనిపించే అమ్హారిక్, ఇటాలియన్ భాషాప్రయోగాలు ప్రాంతీయతకి దోహదం చేస్తాయే తప్ప, చదవడానికి ఆటంకాలు కావు. చరిత్ర చెప్పే వాస్తవాల అడుగున మరుగునపడ్డ ఉద్వేగాలు అనేకం ఉంటాయి. యుద్ధపరిణామాలకి సమాంతరంగా మానవజీవితంలో స్థితమై ఉండే జ్ఞాపకాల, గుండెచప్పుళ్ల నిరంతరతను ప్రదర్శించిన రచయిత్రి ప్రతిభా పాటవాలు– శ్రీపాద భాషలో – ఆమె వేత్తృతకి నికషాలు. - పద్మప్రియ -
సెన్సార్ చేతి రాత
చేతిరాతను చూసి తలరాతను నిర్ణయిస్తారు చాలామంది... ప్రస్తుతం చేతిరాతను చాలామంది మర్చిపోయారు. వరంగల్‌కి చెందిన సతీశ్ మాత్రం వందల కొద్దీ పేజీలు చేతితోనే రాస్తున్నారు. అది కూడా అచ్చంగా ప్రింట్లో అక్షరాల్లాగ. డిగ్రీ చదువుతుండగానే చలనచిత్రరంగంలోకి ప్రవేశించారు సతీశ్. ‘‘నా అక్షరాలు బాగున్నాయని ప్రశంసించిన చిత్రదర్శకుడు ఆదినారాయణరావు, చిత్ర పరిశ్రమలో దర్శకత్వ శాఖలో అడుగుపెట్టడానికి అవకాశం కల్పించారు. చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేస్తూ, నా చేతిరాతకు పనికి వచ్చే పని చేయడానికి ప్రయత్నించాను. సినిమా సెన్సార్‌కి స్క్రిప్ట్ రైటర్లు చాలా తక్కువమంది ఉంటారు. నాకు చిత్ర పరిశ్రమలో అంతగా అవకాశాలు కలిసిరాని సమయంలో, అల్లాణి శ్రీధర్ గారి ఫిల్మీ మీడియా సంస్థలో సెన్సార్ స్క్రిప్ట్ వర్క్ పని అప్పచెప్పారు. నేను ఆ వర్క్ అంతా చేతితో రాసి ఇచ్చాను. ఆది చూసి ఆయన నన్నెంతగానో ప్రోత్సహించారు’’ అని తన సినీరంగ ప్రవేశం గురించి తెలిపారు సతీశ్. దర్శకత్వశాఖలో అవకాశాలు లభించక, ఆర్థికం ఇబ్బందుల నుంచి బయటపడటానికి సతీశ్ ఎంచుకున్న మార్గం సెన్సార్ స్క్రిప్ట్‌ను స్వయంగా చేతితో రాయడం. సతీశ్చేతిరాత చూసిన ‘7్టజి సెన్స్’ చిత్ర దర్శకుడు పెద్ది కె. ఈశ్వర్ ఆ సినిమాకి సెన్సార్ స్క్రిప్ట్ రాయమని కోరటంతో సతీశ్ మొట్టమొదటిసారి సెన్సార్ స్క్రిప్ట్ రాశారు. ఒక సినిమాకి సుమారు 100 - 150 పేజీల వరకు స్క్రిప్ట్ ఉంటుంది. సతీశ్ అదంతా చేతితో రాశారు. ‘‘సతీశ్ చేతి రాత చూసిన తర్వాత ఎన్నో పెద్దపెద్ద సినిమా స్క్రిప్ట్స్ అతనితోనే రాయించాను. అతని చేతి రాత అచ్చు డిటిపి చేసినట్టుగా ఉంటుంది’’ అని ప్రశంసించారు ఎఫ్‌డిసిలో పని చేస్తున్న అనంత్. ‘‘నా చేతిరాత చూసిన దర్శకుడు చంద్రసిద్ధార్థ ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా సెన్సార్ స్క్రిప్ట్ పని నాకు అప్పగించారు. సాహసం, అత్తారింటికి దారేది, డికెబోస్, ప్రతినిధి, జెండాపై కపిరాజు, వెల్కమ్ ఒబామా, వీడికి దూకుడెక్కువ... ఇలా అనేక చలనచిత్రాలకు సెన్సార్ స్క్రిప్ట్ రాశాను’’ అంటున్నారు సతీశ్. సతీశ్ చేతిరాత కంప్యూటర్ అక్షరాలు అందంగా ఉండడం వల్ల రెండేళ్లలోనే వందకు పైగా సినిమాలకు సెన్సార్ స్క్రిప్ట్ రాశారు. ఒకవైపు దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే మరో వైపు సెన్సార్ స్క్రిప్ట్ రైటింగ్‌లో బిజీగా ఉంటున్నారు సతీశ్. ‘‘దర్శకత్వ శాఖలో అవకాశాలు లభించక చాలామంది ఖాళీగా ఉంటున్నారు. అటువంటి వారికి డిటిపి వర్క్ అప్పచెబుతున్నాను. ఒకవేళ నా జీవితంలో నేను సెన్సార్ స్క్రిప్ట్ రాయకుండా ఉండి ఉంటే పరిశ్రమ నుండి తప్పుకునేవాడినేమో!’’ అని చెబుతున్న సతీశ్లోని ఆశావాదాన్ని అందరూ అనుసరిస్తే, ఎప్పటికైనా ఉన్నతస్థాయికి ఎదుగుతారనడంలో సందేహం లేదు. - డా.వైజయంతి