డైరెక్టర్‌గా హీరో విజయ్‌ తనయుడు    | Vijay's Son, Jason Sanjay, Set to Make Directorial Debut - Sakshi

డైరెక్టర్‌గా హీరో విజయ్‌ తనయుడు   

Aug 29 2023 12:56 AM | Updated on Aug 29 2023 9:35 AM

Vijay son Jason Sanjay to make directorial debut - Sakshi

∙సుభాస్కరన్,   జాసన్‌ సంజయ్‌ 

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ తనయుడు జాసన్‌ సంజయ్‌ విజయ్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్‌పై సుభాస్కరన్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సుభాస్కరన్‌ మాట్లాడుతూ– ‘‘కొత్త ఆలోచనలతో ఉండే యంగ్‌ టాలెంటెడ్‌ పర్సన్స్‌ ఎప్పుడూ గేమ్‌ చేంజర్స్‌ అవుతారని మా నమ్మకం.

జాసన్‌ సంజయ్‌ విజయ్‌ చెప్పిన యూనిట్‌ పాయింట్‌ మాకు నచ్చింది. సంజయ్‌ లండన్‌లో స్క్రీన్‌ రైటింగ్‌లో బీఏ (హానర్స్‌), టొరంటో ఫిల్మ్‌ స్కూల్‌లో ఫిల్మ్‌ప్రోడక్షన్‌ డిప్లామా పూర్తి చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, సాంతికేతిక నిపుణులు పని చేయబోతున్నారు’’ అన్నారు. ‘‘లైకాప్రోడక్షన్స్‌ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో నా ఫస్ట్‌ మూవీ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ సంస్థకు నా స్క్రిప్ట్‌ నచ్చటం నాకు హ్యాపీగా ఉంది’’ అన్నారు జాసన్‌ సంజయ్‌ విజయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement