talented
-
మనీ పవిత్ర
‘కెరీర్లో ఎంత ఉన్నతంగా ఎదిగినా, ఎంత సంపాదించినా, ఎంతటి ధనవంతులైనా డబ్బును సరైన విధంగా నిర్వహించకపోతే వారికి ఇబ్బందులు తప్పవు’ అంటున్నారు డాక్టర్ మణి పవిత్ర.హైదరాబాద్ మాదాపూర్‌లో ఉంటున్న మణి పవిత్ర ఆర్థోడాంటిస్ట్. ఆర్థిక నిపుణురాలు, ఫార్చ్యూన్ అకాడమీ సహ వ్యవస్థాపకురాలు, వ్యాపారవేత్త, యోగా కోచ్, సామాజిక కార్యకర్త, రచయిత్రిగా మల్టీటాలెంటెడ్ ఉమన్‌గా గుర్తింపు పొందారు. మహిళలు ఆరోగ్యంగా, ఫిట్‌గా, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు అవగాహన కల్పిస్తున్న ఈ డాక్టర్‌ను ‘మనీ పవిత్ర’ అని కూడా పిలుస్తుంటారు. ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించడానికి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్న సందర్భంగా ఎన్నో విషయాలను ఇలా మన ముందుంచారు. ఆర్థికంగా విజయవంతమైన వ్యక్తుల సైన్యాన్ని సృష్టించడమే మా లక్ష్యం. ఆర్థిక అక్షరాస్యతప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు, ఫార్చ్యూన్ అకాడమీ ద్వారా ఆర్థిక అక్షరాస్యతపై షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నాం. దీనిలో.. డబ్బు ప్రాముఖ్యత, ఏం కొనగలం, దేనిని కొనలేం, పెట్టుబడి, గుణించడం, పొదుపు సంస్కృతి, మధ్యతరగతి డబ్బు సమస్యలు, డబ్బు, ఎమోషనల్ కనెక్షన్, ర్యాగ్స్ టు రిచ్, పిగ్గీ బ్యాంక్ప్రాముఖ్యత, ప్లాస్టిక్ డబ్బు, డిజిటల్ లావాదేవీలు, డబ్బు గురించి ఎక్కువ శ్రద్ధ వహించే ఇతర విషయాలపై రెండు నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించాల్సి ఉంటుంది. ఎంట్రీలను జూలై 31, 2024లోగా fortuneacademyhub@gmail.com కు పంపవచ్చు. ‘‘ఆర్థిక అక్షరాస్యత అనేది వ్యక్తిగత డబ్బు నిర్వహణ. ఎవరికి వారు తమదైన అవగాహనతో సంపాదించడం, పొదుపు, పెట్టుబడులు చేయడం చూస్తుంటాం. వారు తీసుకున్న ప్రణాళికల కారణంగా కొందరు తక్కువ సంపాదించినా ధనవంతులు అవుతుంటారు. ఎక్కువ సంపాదన ఉన్నప్పటికీ ఎప్పుడూ డబ్బు సమస్యలతో ఇబ్బందులు పడేవారూ ఉంటారు. అందుకే, ఆర్థిక నైపుణ్యాలను అర్థం చేసుకోవడం, సమర్థవంతంగా నిర్వహించడంలో అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం. చాలా వెనకబడి ఉన్నాం.. మన జనాభాలో 77 శాతం అక్షరాస్యులు ఉన్నప్పటికీ, 24 శాతం కంటే తక్కువ మంది ఆర్థిక అక్షరాస్యులు ఉన్నారు. వారిలో 17 శాతం మంది యుక్తవయస్కులు మాత్రమే ఆర్థికంగా అక్షరాస్యులు. ప్రపంచంలో చూస్తే భారతదేశం ఆర్థిక అక్షరాస్యత రేటుతో 144 దేశాలలో 73వ స్థానంలో ఉంది. ఆర్థిక పరిజ్ఞానం, అవగాహన లేకపోవడం వల్ల మెజారిటీ భారతీయులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇది గమనించి ప్రజలకు డబ్బుతో ఉండే రిలేషన్ గురించి దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో క్యాంపెయిన్ చేశాం. ఆ క్యాంపెయిన్‌లో మూడు–నాలుగు వందల మంది పాల్గొనేవారు. అనుకున్న ఫలితం రాలేదనిపించి, ఇప్పుడు సోషల్‌మీడియా ద్వారా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. ్రపోత్సాహకరమైన కథనాలుధనవంతులు, ప్రముఖుల జీవితాలు మనకు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ పెద్దపెద్ద సెలబ్రిటీలకు కూడా డబ్బు సమస్యలు ఉంటాయి. ఇప్పటికీ బడ్జెట్‌తో జీవించే ధనవంతులు, ప్రముఖులు ఉన్నారు. వారి నియమబద్ధమైన జీవనాన్ని మనం అలవరచుకోవాలి. మా అకాడమీ ద్వారా వారి కథనాలను చెబుతూ అవసరమైన వారికి అవగాహన కల్పిస్తుంటాం. కరోనా సమయంలో ఏర్పాటు చేసిన ఈ ఆన్లైన్ క్లాస్‌లు నెలలో 21 రోజుల పాటు ఉదయం 6 నుంచి 6.30 వరకు ఓ అరగంటపాటు నిర్వహిస్తుంటాను. షార్ట్ ఫిల్మ్ ఆలోచనఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై బాగా ఉంది. ఏ సమస్య తలెత్తినా సోషల్‌మీడియా వైపుగా వెళుతున్నారు. కొంతమంది ధనవంతులను చూసి తాము కూడా కలల జీవనాన్ని ఊహించుకుంటున్నారు. దానిని సాధించలేక త్వరగా నిరాశకు, డిప్రెషన్‌కు లోనవుతున్నారు. అనవసర బేషజాలకు పోయి అధికంగా డబ్బును ఖర్చుపెట్టుకుని భవిష్యత్తును భారంగా మార్చుకుంటున్నారు. అందుకే, ఆర్థిక అక్షరాస్యత పట్ల అవగాహనకు సోషల్‌మీడియాను ఎంచుకున్నాను. మధ్య, దిగువ మధ్య తరగతి వాళ్లలో పెరుగుతున్న ఆర్థిక సమస్యలను నివారించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. తల్లుల సంపాదనకు బ్రేక్ఏడేళ్ల క్రితం తెలంగాణ జిల్లాల్లో మహిళలు గర్భం దాల్చడానికి ముందు, గర్భం దాల్చాక, ప్రసవం తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపైన ‘మిలియన్ మామ్స్’ క్యాంపెయిన్ చేశాం. ఆ సమయంలో తల్లులైన మహిళల సంపాదన పూర్తిగా తగ్గిపోవడం గమనించాం. ప్రసవం తర్వాత చదువుకున్నవారు, చదువు లేనివారు అనే తేడా ఏమీ లేకుండా చాలామంది ఒక బ్రేక్ తీసుకోవడం చూశాం. అక్కడి పరిస్థితులు చూశాక ఆర్థిక అవసరాలు ఎంత ముఖ్యమో, డబ్బుకోసం వారు పడే పాట్లు కనిపించాయి. ప్రసవం తర్వాత పూర్తి సంపాదనకు దూరం అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డబ్బు సంపాదనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మా నానమ్మల రోజుల్లో ఇంటి నిర్వహణ మహిళల చేతుల్లో ఉండేది. ఈ తరంలో ఆ నిర్వహణ కనిపించలేదు. ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ, ఏ రోజుకు ఆ రోజే అన్నట్టుగా ఉంటోంది. సంపాదించడంలోనూ, పొదుపు చేయడంలోనూ అవగాహన లేదు. దీంతో కుటుంబం మొత్తం ఇబ్బందులు పాలవుతుంది. పిల్లలకోసం టైమ్మా అమ్మానాన్నలు బిజీ డాక్టర్లు అవడంతో నా చిన్నతనంలో వారిని బాగా మిస్ అయ్యేదాన్ని. దీంతో నా పిల్లలకు అలాంటి సమస్య రాకూడదనుకున్నాను. నాకు అనుకూలమైన ఆర్థోడాంటిస్ట్ కోర్సు తీసుకున్నాను. నాకంటూ ఒక టైమ్ ఉండాలి, కెరియర్‌తో పాటు కుటుంబాన్నీ బాగా చూసుకోవాలి అనే ఆలోచనతో 15 ఏళ్లుగా ప్లాన్ చేసుకుంటూ వెళుతున్నాను. దీంతో ఇప్పుడు నా ఇద్దరు పిల్లలను, ఇంటిని, నా పనులను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి మహిళా ఆర్థికవేత్తలు అయిన కిమ్ కియోసాకి, మేరీ బఫెట్‌తో కలిసి చర్చాకార్యమ్రాల్లో పాల్గొన్నాను. ఉమెన్ ఇన్స్పైరర్గా లయన్ సెంటెనియల్ అవార్డ్, 2020 యూత్ ఐకాన్ అవార్డ్, 2021లో విశిష్ట ఆర్థోడాంటిస్ట్ అవార్డులు పొందాను. తెలుగు రాష్ట్రాల్లో క్యాంపెయిన్సమాజంలో ఆర్థిక అక్షరాస్యత పట్ల అవగాహన కల్పించి ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎనిమిది ప్రధానప్రాంతాలను ఎంపిక చేసుకొని, కార్యక్రమాలను చేపట్టనున్నాం. ఆర్థిక అక్షరాస్యత మెరుగైన ఆర్థిక శ్రేయస్సుకు, స్థిరత్వానికి దోహదం చేస్తుంది’’ అంటూ వివరించారు ఈ మనీ పవిత్ర. – నిర్మలారెడ్డి -
డైరెక్టర్‌గా హీరో విజయ్ తనయుడు
తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ విజయ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సుభాస్కరన్ మాట్లాడుతూ– ‘‘కొత్త ఆలోచనలతో ఉండే యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ ఎప్పుడూ గేమ్ చేంజర్స్ అవుతారని మా నమ్మకం. జాసన్ సంజయ్ విజయ్ చెప్పిన యూనిట్ పాయింట్ మాకు నచ్చింది. సంజయ్ లండన్‌లో స్క్రీన్ రైటింగ్‌లో బీఏ (హానర్స్), టొరంటో ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ప్రోడక్షన్ డిప్లామా పూర్తి చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, సాంతికేతిక నిపుణులు పని చేయబోతున్నారు’’ అన్నారు. ‘‘లైకాప్రోడక్షన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో నా ఫస్ట్ మూవీ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ సంస్థకు నా స్క్రిప్ట్ నచ్చటం నాకు హ్యాపీగా ఉంది’’ అన్నారు జాసన్ సంజయ్ విజయ్ -
చిన్నారి అసాధారణ ప్రతిభ.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే
పలమనేరు: పట్టుమని రెండున్నరేళ్లు కూడా లేని చిన్నారి అద్భుతమైన జ్ఞాపకశక్తితో వేలాది వస్తువుల పేర్లు, జంతువులు, మానవదేహంలోని భాగాలు.. ఇట్టే గుర్తించి వాటి పేర్లను టుక్కున చెబుతూ దేశంలోని ప్రధాన రికార్డుబుక్కుల్లో ఒకటైన ఓఎంజీ(ఓ మై గాడ్ బుక్ ఆఫ్ ఇండియా)లో ఇండియన్ యంగెస్ట్ టాలెంటెడ్ గర్ల్‌గా రికార్డు సృష్టించింది. పలమనేరులో నివాసం ఉండే అమరనాథ్, హిమబిందు కుమార్తె వేద ఇవాంజెల్ అసాధారణ ప్రతిభ చూసిన వారు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. చదవండి: ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా గుర్రంపైనే.. చిన్నారి ప్రతిభను చూసి.. 9 నెలల వయసు నుంచే చిన్నారి జ్ఞాపకశక్తిని గుర్తించిన తల్లి హిమబిందు తగు శిక్షణ ఇచ్చింది. గతనెల 13న చిన్నారి టాలెంట్‌కు సంబంధించిన వీడియోలతో ఓఎంజీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై వారు లైవ్‌లో పరీక్షించిన జడ్జిలు ఇటీవలే ఇండియన్ యంగెస్ట్ టాలెంటెడ్ గర్ల్‌గా రికార్డులోకి ఎక్కించి వారి అధికారిక వెబ్సైట్లో ఫలితాలను ప్రకటించారు. రెండ్రోజుల క్రితం ముంబై నుంచి వేద ఇవాంజెల్కు కొరియర్లో ఓఎంజీ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ కమ్ సీఈఓ డా.దినేష్ కే గుప్త నుంచి మెడల్, షీల్డ్ అందాయి. చదవండి: నాడు ఫిరంగులకు..నేడు పకోడీలకు ప్రసిద్ధి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లక్ష్యం.. తమ చిన్నారి టాలెంట్‌ను చూపి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం కోసం ప్రయత్నిస్తున్నట్లు తల్లిదండ్రులు అమరనాథ్, హిమబిందు తెలిపారు. అయితే గిన్నీస్‌బుక్‌లోకి ఎక్కాలంటే అంతకుముందు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ తదితరాల్లో రికార్డులలోకి ఎక్కాల్సి ఉంటుదన్నారు. వాటి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కాగా బాలిక తండ్రి బెంగళూరు సెయింట్‌జాన్స్ ఆస్పత్రి ప్రాజెక్టులో ఫీల్డ్ ఆఫీసర్‌గా, తల్లి గృహిణిగా ఉంటున్నారు. జాతీయస్థాయిలో పలమనేరుకు పేరు తెచ్చిపెట్టిన ఆ చిన్నారిని పట్టణవాసులు అభినందిస్తున్నారు. -
Sameeha Barwin: ఈ పెద్దలు ఎందుకు ‘వినరు?’
ప్రతిభ వినని పెద్దలుపోలాండ్లోని లుబ్లిన్‌లో ఆగస్టు 23 – 28 తేదీల మధ్య ప్రపంచ బధిర అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ జరగనున్నాయి. మన దేశం నుంచి ఐదు మంది ‘పురుష’ బధిర అథ్లెటిక్స్ వెళుతున్నారు. మన దేశం నుంచి ఒక ‘మహిళా’ బధిర అథ్లెట్‌ను డ్రాప్ చేశారు. ఎందుకంటే ‘నిధులు లేవట’. ఆమె స్త్రీ కనుక ఎస్కార్ట్ ఇవ్వలేరట. అలాగని ఒక్కదాన్నీ పంపలేరట. తమిళనాడుకు చెందిన సమీహా పర్వీన్ నిరాశలో కూరుకుపోయింది. ఒకవైపు ఒలింపిక్స్‌లో మహిళలు పతకాలు తెస్తే మరోవైపు ఈ ఉదంతం. సమీహా గత రికార్డులు ఈ పెద్దలు ఎందుకు ‘వినరు?’. కన్యాకుమారి నుంచి ఢిల్లీకి దాదాపు రెండున్నర రోజుల రైలు ప్రయాణం. సుమారు 3 వేల కిలోమీటర్ల దూరం. ఒక బధిర అథ్లెట్, 18 ఏళ్ల సమీహా ఒంటరిగా ప్రయాణించాలి. ఎందుకు? ఆగస్టు చివరి వారంలో పోలెండ్‌లో బధిర అథ్లెట్ల ప్రపంచ ఛాంపియన్ షిప్స్ జరుగుతున్నాయి. అందుకుగాను జూలై 22న జాతీయ సెలక్షన్‌కు ఢిల్లీకి హాజరు కమ్మని దేశ వ్యాప్తంగా ఉన్న 12 మంది బధిర అథ్లెట్లకు ఆహ్వానం అందింది. ఆహ్వానించింది ‘స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎస్.ఏ.ఐ) ఆధ్వర్యంలోని ‘ఆల్ ఇండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఫర్ ది డెఫ్’ (ఏ.ఐ.ఎస్.సి.డి). కాని ఇందుకు చేసిన ఏర్పాట్లు? ఒంటరి సమీహా కన్యాకుమారి జిల్లాలోని కడయాల్ టౌన్‌కు చెందిన సమీహా పర్వీన్ 90 శాతం బధిరురాలు. వాళ్ల నాన్న చిన్న టీ అంగడి నడుపుతాడక్కడ. ఐదేళ్ల వయసులో తీవ్రమైన జ్వరం రాగా అప్పటివరకూ ఆరోగ్యంగా ఉన్న సమీహా వినిడికి శక్తి కోల్పోయింది. అయినప్పటికీ ఆమెకు బాల్యం నుంచి ఆటలంటే ఇష్టం ఏర్పడింది. తల్లిదండ్రలు తమ స్తోమత చాలకపోయినా ప్రోత్సహించారు. సమీహా లాంగ్ జంప్‌లో, 100 మీటర్ల పరుగులో రాణించింది. మూడు జాతీయ బధిర అథ్లెటిక్స్ లో (2017– జార్ఖండ్, 2018–చెన్నై, 2019–కోల్కటా) గోల్డ్ మెడల్స్ సాధించింది. ఇంకా అనేక పోటీల్లో ఆమె సాధించిన మెడల్స్ అనేకం ఉన్నాయి. అందుకనే సెలక్షన్స్ కోసం ఆమెకు పిలుపు వచ్చింది. కాని తేదీ హటాత్తుగా చెప్పడం వల్ల, కోవిడ్ రీత్యా ఆమెతో పాటు వచ్చే తల్లి ఆమెతో రాలేకపోయింది. రాష్ట్ర క్రీడా శాఖకు ఎన్ని వినతులు చేసినా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నా ఎస్కార్ట్‌ను ఇవ్వలేదు. చివరకు సమీహా నలుగురు పురుష బధిర క్రీడాకారులతోనే ప్రయాణించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమెకు పోలాండ్‌లో జరిగే పోటీలలో పాల్గొనాలనే లక్ష్యం ఉంది. అందులో మెడల్ కొట్టగలననే విశ్వాసం ఉంది. కాని ఆమె ఒకటి తలిస్తే అధికారులు మరొకటి తలిచారు. క్వాలిఫై అయినా పోలాండ్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్‌కు సమీహా లాంగ్‌జంప్‌లో, పరుగులో పాల్గొనాలనుకుంది. లాంగ్ జంప్‌కు ప్రమాణం 5 మీటర్లుగా అధికారులు నిర్ధారిస్తే సమీహా 5 మీటర్లను దూకి క్వాలిఫై అయ్యింది. అయినప్పటికీ ఫైనల్ లిస్ట్‌లో 5 మంది బధిర పురుష అథ్లెట్లను ఎంపిక చేశారు. ప్రమాణాన్ని అందుకోలేకపోయిన మరో బధిర అథ్లెట్ వర్షా గులియా (ఢిల్లీ) ని నిరాకరించినా సమీహాను ఎందుకు సెలెక్ట్ చేయలేదో ఆమె కుటుంబానికి అర్థం కాలేదు. వివక్ష ఉంది ‘బధిర క్రీడాకారుల్లో స్త్రీల పట్ల వివక్ష ఉంది. గతంలో జార్ఖండ్‌లో జాతీయ ఛాంపియన్ షిప్ జరిగినప్పుడు మాకు ఉండే చోటు ఇవ్వలేదు. తినడానికి తిండి పెట్టలేదు’ అని సమీహా తల్లి సలామత్ అంది. కూతురికి ప్రతిభ ఉన్నా పోలాండ్‌కు సెలక్ట్ చేయకపోవడంతో ఆమె హతాశురాలైంది. ‘మాకు చెప్పిందేమిటంటే మీ అమ్మాయి ఒక్కదాన్నే పంపాలంటే ఇబ్బందులున్నాయి. ఎస్కార్ట్ ఇవ్వలేము. అలాగని ఒంటరిగా పంపలేము. అలాగే మా దగ్గర ఫండ్స్ తక్కువ ఉన్నాయి అని. దీనికి మించిన అన్యాయం లేదు’ అంది సలామత్. పోలాండ్‌కు వెళ్లే టీమ్ ఆగస్టు 14న దేశం నుంచి బయలుదేరుతోంది. కాని అందులో తాను లేకపోవడం సమీహాకు ఆవేదన కలిగిస్తోంది. కన్యాకుమారి ఎం.పి ఈ సంగతి తెలిసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు– ఆమె ఫండింగ్ మేము చూసుకుంటాం తీసుకెళ్లండి అని. దానికి కూడా సంబంధీకులు స్పందించలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళాతేజం అందరూ చూశారు. సమీహా వెళ్లి ఉంటే అక్కడా అలాంటి విజయమే వచ్చి ఉండేదేమో. ఆమె ఆటకూ, పతకానికి కూడా అధికారుల ‘వినికిడి లోపం’ అన్యాయం చేసిందని దేశంలో చాలామంది క్రీడా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. విమర్శిస్తున్నారు. సారీ సమీహా. ‘బధిర క్రీడాకారుల్లో స్త్రీల పట్ల వివక్ష ఉంది. గతంలో జార్ఖండ్‌లో జాతీయ ఛాంపియన్ షిప్ జరిగినప్పుడు మాకు ఉండే చోటు ఇవ్వలేదు. తినడానికి తిండి పెట్టలేదు’ ‘మాకు చెప్పిందేమిటంటే మీ అమ్మాయి ఒక్కదాన్నే పంపాలంటే ఇబ్బందులున్నాయి. ఎస్కార్ట్ ఇవ్వలేము. అలాగని ఒంటరిగా పంపలేము. అలాగే మా దగ్గర ఫండ్స్ తక్కువ ఉన్నాయి అని. దీనికి మించిన అన్యాయం లేదు’ -
వయస్సు రెండున్నరేళ్లు.. ఐక్యూ అదుర్స్
రామచంద్రపురం రూరల్: ఆ చిన్నారి వయస్సు రెండున్నరేళ్లు. పేరు కట్టా హేమాన్స్ సాయి సత్య సూర్య. రామచంద్రపురం మండ లం తాళ్లపొలానికి చెందిన గౌడ, శెట్టిబలిజ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కట్టా సూర్యనారాయణ మనవడు. రెండు న్నరేళ్ల వయస్సులోనే ప్రపంచ దేశాల జెండాలను గుర్తిస్తూ అవి ఏ దేశానికి చెందినవో చెబుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. అంతే కాదు అక్షరాలు, అంకెలు, ఇంగ్లిష్ నెలలు, తెలుగు నెలలు, తెలుగు నక్షత్రాలు, రాశులు, తిథులు, జాతీయ చిహ్నాలు, ఖండాలు, దేశంలోని రాష్ట్రాలు–వాటి రాజధానులు, 115 రకాల పరమాణు మూలకాలు, ప్రఖ్యాత వ్యక్తులు తదితర అంశాలను అలవోకగా చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. హేమాన్స్ తల్లిదండ్రులు నిరోష, శర్వాణి ఇద్దరూ విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా మార్చి నుంచి తాళ్లపొలంలోనే ఉంటున్నారు. చిన్నారి ప్రతిభకు పదును పెడుతున్న తల్లిదండ్రులను స్థానికులు అభినందిస్తున్నారు. -
ప్రతిభను ప్రదర్శించేందుకే టోర్నమెంట్లు
హన్మకొండ చౌరస్తా : క్రీడాకారుల ప్రతి భను ప్రదర్శించేం దుకు టోర్నమెంట్ లు ఉపయోగపడతాయని వీటిని సద్వినియోగం చేసుకుని జాతీయ స్థాయికి ఎదగాలని జూడో అసోసియేష¯ŒS రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ సూ చించారు. హన్మకొండ హంటర్‌రోడ్‌లోని సిటీజ¯ŒSక్లబ్లో శనివారం సాయంత్రం రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్స్ బాలబాలికల జూడో పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 3 వరకు జరగనున్న పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా క్రీడాకారులనుద్దేశించి రాష్ట్రంలో జూడో అభివృద్ధికి తన వం తుగా కృషి చేస్తానన్నారు. అసోసియేష¯ŒS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాస్‌యాదవ్ మాట్లాడుతు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో జూడో అసోసియేష¯ŒS రాష్ట్ర ఉపాధ్యక్షులు జనార్ద¯ŒSరెడ్డి, ఎంఏ అజీజ్, కోశాధికారి బాలరాజు, కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ చక్రపాణి, నర్సంపేట మున్సిపల్ కమిషనర్మల్లికార్జునస్వామి, కార్పొరేటర్ సోబియా సబహత్, నవనీతరావు, సాంబారి సమ్మారావు తదితరులు పాల్గొన్నారు.