ప్రతిభను ప్రదర్శించేందుకే టోర్నమెంట్లు
Published Sun, Oct 2 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
హన్మకొండ చౌరస్తా : క్రీడాకారుల ప్రతి భను ప్రదర్శించేం దుకు టోర్నమెంట్ లు ఉపయోగపడతాయని వీటిని సద్వినియోగం చేసుకుని జాతీయ స్థాయికి ఎదగాలని జూడో అసోసియేష¯ŒS రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ సూ చించారు. హన్మకొండ హంటర్‌రోడ్‌లోని సిటీజ¯ŒSక్లబ్‌లో శనివారం సాయంత్రం రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్స్ బాలబాలికల జూడో పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 3 వరకు జరగనున్న పోటీలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా క్రీడాకారులనుద్దేశించి రాష్ట్రంలో జూడో అభివృద్ధికి తన వం తుగా కృషి చేస్తానన్నారు. అసోసియేష¯ŒS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాస్‌యాదవ్ మాట్లాడుతు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో జూడో అసోసియేష¯ŒS రాష్ట్ర ఉపాధ్యక్షులు జనార్ద¯ŒSరెడ్డి, ఎంఏ అజీజ్, కోశాధికారి బాలరాజు, కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ చక్రపాణి, నర్సంపేట మున్సిపల్ కమిషనర్‌మల్లికార్జునస్వామి, కార్పొరేటర్ సోబియా సబహత్, నవనీతరావు, సాంబారి సమ్మారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement