sports mens
-
తుపాకీ వీరుడితో ‘డిస్కస్ త్రో’ రాణి ఢీ
రాజస్తాన్‌లోని జైపూర్ రూరల్ లోక్‌సభ స్థానంలో ఇద్దరు అంతర్జాతీయ క్రీడాకారులు రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఎన్నికల మైదానంలోకి దిగుతుండడంతో ‘పోల్ గేమ్’ రసకందాయంలో పడింది. మాజీ ఒలింపిక్ క్రీడాకారుడూ, కేంద్ర క్రీడా మంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ 49 ఏళ్ల రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌ని జైపూర్ రూరల్ లోక్‌సభ స్థానానికి పోటీ చేయించాలని బీజేపీ ఎప్పుడో నిర్ణయించేసింది. అయితే ఈ స్థానంలో రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్‌తో తలపడేందుకు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, డిస్కస్ త్రో క్రీడాకారిణి కృష్ణా పూనియా పేరుని తెరపైకి తెచ్చింది. 2004 ఒలంపిక్స్‌లో రాథోడ్ డబుల్ ట్రాప్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. 2012లో లండన్ గేమ్స్‌లో పూనియా డిస్కస్ త్రోలో ఆరవ స్థానాన్ని పొందారు. బీజేపీ నుంచి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ పేరు ముందే ఖరారైనా, కాంగ్రెస్ మాత్రం పూనియా పేరుని ఈ స్థానానికి ఆలస్యంగా నిర్ధారించింది. 41 ఏళ్ల పూనియా బరిలోకి దిగడంతోనే తొలిపంచ్ రాథోడ్‌పై పడింది. ‘నేను రైతు బిడ్డని. గ్రామీణ ప్రజల సమస్యలను అర్థం చేసుకోగలను’ అనీ, ‘నేను ఏసీ గదుల్లో నా ఆటను ఆడి మెడల్స్ సంపాదించుకోలేదు. గ్రామీణ యువకులు ఆడే ఆటనే నేను ఎంపిక చేసుకున్నాను’ అని పంచ్ డైలాగ్‌తో ప్రచారాన్ని ప్రారంభించారు పూనియా. ఈ ఇరువురికీ చాలా సారూప్యత ఉంది. ఇద్దరూ క్రీడాకారులే, ఇరువురూ రాజకీయ అరంగేట్రం చేసింది 2013లోనే. నరేంద్రమోదీ ప్రభంజనం సందర్భంగా 2014లో రాథోడ్ ఈ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకున్నారు. అయితే పూనియా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అయితే ఐదేళ్ల తరువాత గేమ్ మారింది. బీఎస్పీ ఎమ్మెల్యే మనోజ్ న్యాంగ్లీ, బీజేపీ సీనియర్ నాయకుడు రామ్ సింఘ్ కాశ్వాన్నీ 2018లో ఓడించి సాదులాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పూనియా గెలుపు కైవసం చేసుకున్నారు. మూడుసార్లు ఒలంపిక్ క్రీడల్లో పాల్గొన్న అనుభవం పూనియా సొంతమైతే, కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు గోల్డ్‌మెడల్స్ సొంతం చేసుకున్న చరిత్ర రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌ది. పూనియా సామాజిక వర్గం జాట్ కాగా, రాథోడ్ రాజ్‌పుత్ర. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో జాట్లు 23 శాతం ఉంటే, రాజ్‌పుత్రుల జనాభా 10 శాతంగా ఉంది. -
క్రీడాకారులకు అందని ఆర్థిక భరోసా..!
విజయనగరం మున్సిపాలిటీ: మట్టిలో మాణిక్యాలకు ఆర్థిక భరోసా కరువవుతోంది. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీనికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో రాణించేవారి పౌష్టికాహారం కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) డే బోర్డర్స్ పథకం పేరిట ప్రతి నెలా అందించే ఆర్థిక సాయం అందకపోవడమే నిదర్శనం. 13 క్రీడాంశాల్లో రాణిస్తున్న పేద క్రీడాకారులను గుర్తించి డే బోర్డర్ పథకం అమలు చేయాలని గతేడాది మార్గదర్శకాలు జారీ చేయగా... క్రీడాకారులను గుర్తించి, వారిని ఎంపిక చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు క్రీడాంశాల్లో మాత్రమే క్రీడాకారులను ఎంపిక చేశారు. ప్రోత్సాహం లేకుంటే ఎలా..? క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలంటే వారికి నచ్చిన ఆటలో ఆసక్తి, అంకితభావం, తపన ఎంత అవసరమో శిక్షణ కూడా అంతే ముఖ్యం. శిక్షణ అందుకోవాలంటే అందుకు తగ్గట్టు శరీరసష్టవం అవసరం. కబడ్డీ, హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ వంటి క్రీడల్లో పేదింటి పిల్లలు రాణిస్తున్నారు. వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా క్రీడల్లో కఠోర సాధన చేస్తుంటారు. ఇటువంటి వారికి పౌష్టికాహారం నిమిత్తం ప్రతీనెలా కొంత నగదు బ్యాంకు ఖాతాల్లో వేసి, వారిని ప్రోత్సహించి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డే బోర్డర్స్ పేరుతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించినా అక్కరకు రావడంలేదు. ఇదీ పరిస్థితి... డే బోర్డర్స్ పథకంలో 13 క్రీడాంశాలుంటాయి. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కబడ్డీ, రైఫిల్ షూటింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, యోగా అంశాల్లో క్రీడాకారులను ఎంపిక చేయాలి. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాటరీ, మోటార్ ఎబిలిటీ, ప్రతిభ పరీక్షల ఆధారంగా క్రీడాకారులను ఎంపిక చేస్తారు. శాప్ నుంచి అయిదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ఎంపికలు నిర్వహిస్తారు. విద్యలకు నిలయమైన విజయనగరం జిల్లాలో ప్రస్తుతానికి స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్‌లో మాత్రమే ఎంపికలు పూర్తి చేశారు. డే బోర్డర్స్ పథకం వర్తింప చేయకపోవడంపై వివిధ క్రీడల్లో ప్రతిభ చాటుతున్న అర్హులైన క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌష్టికాహారంతో పాటు వీరికి అవసరమైన స్పోర్ట్స్ కిట్‌ను అందించి, బీమా అమలు చేయాలి. ఈ పథకంలో ఎంపికైన క్రీడాకారులకు శాప్ డీఎస్ఏ కోచ్‌లు, క్రీడా సంఘాలకు కోచ్‌లు, వ్యాయామ అధ్యాపకులు, ఫిజికల్ లిట్రసీ ఉపాధ్యాయులు శిక్షణ అందిస్తారు. శిక్షణ సజావుగా అందిస్తున్నా అర్హులైన నిరుపేద క్రీడాకారులకు ఆర్థిక సాయం అందడం లేదు. ఎంపిక ఇలా.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సబ్ జూనియర్ విభాగంలో 12 నుంచి 15 ఏళ్లు, జూనియర్ విభాగంలో 16 నుంచి 19 ఏళ్లు, సీనియర్స్ విభాగంలో 19 ఏళ్లు దాటిన పురుషులు, మహిళలు ఈ పథకానికి అర్హులు. క్రీడాకారులు పాఠశాల క్రీడా సమాఖ్య పోటీల్లో జాతీయస్థాయిలో చూపిన ప్రతిభ, యూనివర్సిటీ, ఇంటర్ వర్సిటీ స్థాయిలో ప్రతిభ కొలమానంగా తీసుకుంటారు. ఎంపికైన క్రీడాకారుల్లో సబ్ జూనియర్స్‌కు రూ.1,500, జూనియర్స్‌కు రూ.2,500, సీనియర్స్‌కు రూ.4,000 వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రతినెలా జమచేయాలి. కానీ అతి తక్కువ మందిని మాత్రమే ఎంపిక చేయడంతో మిగిలినవారు నిరాదరణకు గురవుతున్నారు. త్వరలో ఎంపికలు డే బోర్డర్ స్కీంలో మొత్తం 13 క్రీడాంశాల్లో రాణిస్తున్న క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహం అందించాలి. ప్రస్తుతం అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశాల్లో సుమారు 50 మందికి ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తున్నాయి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెగ్యులర్ కోచ్‌లు ఉన్న క్రీడాంశాలకే ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఇటీవల కాలంలో శాప్ ఆధ్వర్యంలో ఔట్ సోర్సింగ్ కోచ్‌లను నియమించారు. దీంతో త్వరలో ఎంపికలు నిర్వహించి మిగిలిన క్రీడాంశాల్లోని క్రీడాకారులకు ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటాం.– అప్పలనాయుడు, డీఎస్ఏ చీఫ్ కోచ్ -
వీడు ఆరడుగుల బుల్లెట్
నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (అమెరికా) కోచ్ జాజ్ రిచర్డ్స్ సోమవారం విజయవాడలోని ఆం«ధ్ర లయోల కళాశాలలో సందడి చేశారు. బాస్కెట్‌బాల్ టెక్నికల్ క్యాంపు కింద లయోల కళాశాల క్రీడాకారులకు బాస్కెట్‌బాల్‌లో మెలకువల నేర్పించారు. బాస్కెట్‌బాల్ పోస్టును ఇట్టే అందుకుంటున్న ఆరు అడుగుల ఏడు అంగుళాలు ఉన్న జాజ్ రిచర్డ్స్ వయస్సు 34. ప్రకాశం జిల్లా కొమరినేనివారిపాలేనికి చెందిన ఎన్.యర్ర సూర్యనారాయణ, వెంకాయమ్మ మనుమరాలైన హషీకి భర్త. వీరితో పాటు హషీ తల్లి సుబ్బాయమ్మ కూడా లయోల కళాశాలకు విచ్చేశారు. 30 దేశాల తరఫున ఆడిన బాస్కెట్‌బాల్ ఆటగాడిగా, ఇండిపెండెంట్ బాస్కెట్‌బాల్ కోచ్‌గా, 10 దేశాలకు కోచ్‌గా జాజ్ రిచర్డ్స్ వ్యవహరించారు. జాజ్ రిచర్డ్స్, హషీకి కుమారుడు జూనియర్ జాజ్ రిచర్డ్స్ (4) ఉన్నాడు. జూనియర్ జాజ్ రిచర్డ్స్ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా నాలుగేళ్లకే బంతిని బాస్కెట్లోకి వేయడం విశేషం. లైఫ్‌స్టైల్ మీడియా, హషీ తమ్ముడు దివంగత వినోద్ నాగుబడి పేరుతో ఉన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో బాస్కెట్‌బాల్ టెక్నికల్ క్యాంపు నిర్వహించేందుకు జాజ్ రిచర్డ్స్‌ను ఆహ్వానించారు. చికాగోలోని లయోల కళాశాలలో చదివిన జాజ్ రిచర్డ్స్ ఆంధ్ర లయోల కళాశాల పేరు విని ఇక్కడకు విచ్చేసినట్లు కళాశాల పీడీ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. కళాశాల పిన్సిపాల్ ఫాదర్ జీఏపీ కిషోర్, వైస్ ఫాదర్ మాలిక్యూర్ పాల్గొన్నారు. - విజయవాడ స్పోర్ట్స్ -
నిష్పక్షపాతంగా క్రీడాకారులను ఎంపిక చేయాలి
అకాడమీలు అందుబాటులో ఉండాలి రాష్ట్రస్పోర్ట్సు అథారిటీ చైర్మన్ మోహన్ సామర్లకోట : క్రీడాకారులకు అకాడమీలు అందుబాటులో ఉన్నప్పుడే ఉత్తమంగా తయారవుతారని రాష్ట్ర స్పోర్ట్సు అథారిటీ చైర్మన్ పీఆర్ మోహన్ పేర్కొన్నారు. సామర్లకోటలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల సందర్భంగా శనివారం కబడ్డీ కోర్టులను ఆయన పరిశీలించారు. కోర్టు ఆవరణలో ఆయన మాట్లాడుతూ పల్లం బీడు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉందని చెప్పారు. ఆ స్థలం కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి స్టేడియం నిర్మాణం చేసుకోవడానికి స్థలం ఇస్తే దాత ఫొటోతో స్టేడియం పేరు ఏర్పాటు చేస్తామని చెప్పారు. క్రీడాకారుల ఎంపిక అవినీతి, పక్షపాతం, సిఫారసులు లేకుండా జరిగితే నిజమైన క్రీడాకారులకు అవకాశం ఉంటుందని చెప్పారు. జాతీయ స్థాయిలో గోల్డు మెడల్ సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ. ఏడు లక్షలు నగదు బహుమతి ఇవ్వడానికి నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్రం విడిపోవడంతో స్టేడియాలు లేని పరిస్థితి ఏర్పడిందని, దాంతో రూ. 70 కోట్లతో స్టేడియం నిర్మించాలని నిర్ణయించిన్నట్లు చెప్పారు. పదేళ్లక్రితం టోర్నమెంట్‌కు నిధులిచ్చేవారు రాష్ట్రంలో ఎక్కడ టోర్నమెంట్ జరిగినా పదేళ్ల క్రితం ప్రతి క్రీడాకారుడికి రూ.50 వంతున నిధులు కేటాయించేవారని ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వి.వీరలంకయ్య అన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రం నుంచి ఐదుగురు కబడ్డీ క్రీడాకారులు వియత్నాంలో జరిగిన పోటీల్లో బంగారు, వెండి పతకాలను సాధించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సొంత ఖర్చులు, దాత సహకారంతోనే టోర్నమెంటులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సమావేశంలో జాతీయ కబడ్డీ కోచ్ పోతుల సాయి, రాష్ట్ర కోశాధికారి ఎం.రంగారావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, పోటీల నిర్వాహక కార్యదర్శి బోగిళ్ల మురళీ కుమార్, కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభను ప్రదర్శించేందుకే టోర్నమెంట్లు
హన్మకొండ చౌరస్తా : క్రీడాకారుల ప్రతి భను ప్రదర్శించేం దుకు టోర్నమెంట్ లు ఉపయోగపడతాయని వీటిని సద్వినియోగం చేసుకుని జాతీయ స్థాయికి ఎదగాలని జూడో అసోసియేష¯ŒS రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ సూ చించారు. హన్మకొండ హంటర్‌రోడ్‌లోని సిటీజ¯ŒSక్లబ్లో శనివారం సాయంత్రం రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్స్ బాలబాలికల జూడో పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 3 వరకు జరగనున్న పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా క్రీడాకారులనుద్దేశించి రాష్ట్రంలో జూడో అభివృద్ధికి తన వం తుగా కృషి చేస్తానన్నారు. అసోసియేష¯ŒS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాస్‌యాదవ్ మాట్లాడుతు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో జూడో అసోసియేష¯ŒS రాష్ట్ర ఉపాధ్యక్షులు జనార్ద¯ŒSరెడ్డి, ఎంఏ అజీజ్, కోశాధికారి బాలరాజు, కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ చక్రపాణి, నర్సంపేట మున్సిపల్ కమిషనర్మల్లికార్జునస్వామి, కార్పొరేటర్ సోబియా సబహత్, నవనీతరావు, సాంబారి సమ్మారావు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాకారులను తయారు చేయాలి
రామచంద్రపురం: ప్రతీ పాఠశాలలో క్రీడాకారులను తయారు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్. నరసింహారావు అన్నారు. స్థానిక అరిగెల కాపు కల్యాణ మండపంలో గురువారం అమలాపురం, రామచంద్రపురం విద్యా డివిజన్ల పరిధిలోగల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారుల సమావేశం డీవైఈఓ ఆర్ఎస్ గంగాభవాని అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ గ్రిగ్, పైకా పోటీల వంటివాటిలో తప్పనిసరిగా ప్రతీ పాఠశాల ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నారు. వివి«ద అంశాలపై ఆయన హెచ్ఎంలకు, ఎంఈఓలకు దిశానిర్దేశం చేశారు. ఆర్‌ఎంఎస్‌ఏ నిధులను వినియోగించుకుని వెంటనే నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లను వినియోగిస్తు ఎప్పటికప్పడు సమాచారాన్ని అందించాలన్నారు. పాఠశాలల్లో యూనిఫాం, తాగునీరు, బయోఫెన్సింగ్, స్వచ్ఛ సంకల్పం, పదవతరగతి యాక్షన్ ప్లాన్, వెబ్సైట్లో ఫార్మటివ్ 1 మార్కుల నమోదు, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాల తొలగింపు తదితర అంశాలపై చర్చించారు. ఆర్‌ఎంఎస్‌ఏ డీవైఈఓ వరదాచార్యులు 9, 10 తరగతుల సీడబ్లు్య.ఎస్.ఎన్ విద్యార్దులకు స్కాలర్షిప్ ఏవిధంగా ఆన్లైన్లో రిజిస్టరు చేయాలో అవగాహన గావించారు. దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రతలపై విద్యార్థులు, గ్రామస్తులను ఏవి«దంగా చైతన్య పరచాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విశదీకరించారు. దోమల నివారణ, వాటి వలన సంక్రమించే వ్యాధులపై ఈనెల 24న విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించాలని డీఈఓ ఆదేశించారు.