క్రీడాకారులను తయారు చేయాలి
Published Thu, Sep 22 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
రామచంద్రపురం:
ప్రతీ పాఠశాలలో క్రీడాకారులను తయారు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్. నరసింహారావు అన్నారు. స్థానిక అరిగెల కాపు కల్యాణ మండపంలో గురువారం అమలాపురం, రామచంద్రపురం విద్యా డివిజన్ల పరిధిలోగల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారుల సమావేశం డీవైఈఓ ఆర్‌ఎస్ గంగాభవాని అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ గ్రిగ్, పైకా పోటీల వంటివాటిలో తప్పనిసరిగా ప్రతీ పాఠశాల ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నారు. వివి«ద అంశాలపై ఆయన హెచ్‌ఎంలకు, ఎంఈఓలకు దిశానిర్దేశం చేశారు. ఆర్‌ఎంఎస్‌ఏ నిధులను వినియోగించుకుని వెంటనే నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లను వినియోగిస్తు ఎప్పటికప్పడు సమాచారాన్ని అందించాలన్నారు. పాఠశాలల్లో యూనిఫాం, తాగునీరు, బయోఫెన్సింగ్, స్వచ్ఛ సంకల్పం, పదవతరగతి యాక్షన్ ప్లాన్, వెబ్‌సైట్‌లో ఫార్మటివ్ 1 మార్కుల నమోదు, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాల తొలగింపు తదితర అంశాలపై చర్చించారు. ఆర్‌ఎంఎస్‌ఏ డీవైఈఓ వరదాచార్యులు 9, 10 తరగతుల సీడబ్లు్య.ఎస్.ఎన్ విద్యార్దులకు స్కాలర్‌షిప్ ఏవిధంగా ఆన్‌లైన్‌లో రిజిస్టరు చేయాలో అవగాహన గావించారు. దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రతలపై విద్యార్థులు, గ్రామస్తులను ఏవి«దంగా చైతన్య పరచాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విశదీకరించారు. దోమల నివారణ, వాటి వలన సంక్రమించే వ్యాధులపై ఈనెల 24న విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించాలని డీఈఓ ఆదేశించారు.
Advertisement