వర్షాధార భూములు 30,300 ఎకరాలే
3.05లక్షల ఎకరాలకు వివిధ రకాల సాగునీరు
గణనీయంగా పెరిగిన వరిసాగు
‘సాక్షి’తో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్
కరీంనగర్ అర్బన్: ఒకప్పుడు నీళ్లు దొరకని దుస్థితి నుంచి సాగుకు సమృద్ధిగా నీరుదొరికే పరిస్థితికి జిల్లా చేరింది. దశాబ్దకాలంలో సాగురంగంలో అనే క మార్పులు చోటుచేసుకోగా సేద్యం కొత్త పుంతలు తొక్కుతోంది. వర్షాధార పంటలకే పరిమితమైన జిల్లా నేడు వర్షాలు లేకున్నా పంటలు సాగు చేసేలా నీటి వనరులు పెరిగాయి. జిల్లాలో 3.36లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా 3,05,775 ఎకరాలు వివిధ రకాల నీటి వనరులను కలిగి ఉండటం శుభ పరిణామం.
కేవలం 30,300ల ఎకరాలు మాత్రమే వర్షాధార భూములు ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి బత్తిని శ్రీనివాస్ వెల్లడించారు. ఒకప్పుడు 50వేల ఎకరాల వరకు బీడు భూములుండగా సాగులోకి వచ్చాయి. దశాబ్దకాలంలో సాగురంగంలో వచ్చిన మార్పులు, ఏ ఏ పంటలు పండిస్తున్నా రు. సమగ్ర వివరాలు.. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ..
మిషన్ కాకతీయతో పెరుగుదల
చెరువుల కింద అంతంత మాత్రమే సాగవుతు ఉండగా మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల్లో పూడిక తీత, ఇతర మరమ్మతులు చేపట్టడంతో సాగుపెరిగింది. ప్రస్తు తం జిల్లావ్యాప్తంగా ఆ యా చెరువుల కింద 18,888ఎకరాల ఆయక ట్టు ఉంది. కరీంనగర్ రూరల్ మండలంలో అత్యధికంగా చెరువుల కింద 4వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. చిన్నచిన్న కుంటల చెరువుల ద్వారా 14,715 ఎకరాల సాగుభూమికి నీరందుతోంది. మానకొండూరు, శంకరపట్నం, చిగురుమామిడి, సైదాపూర్, గంగాధరలో చెరువులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా చెరువులు, కుంటల ద్వారా 33,603 ఎకరాల్లో సాగునీరు అందుతోంది.
బోర్‌వెల్స్, బావులతో 1,55,888 ఎకరాలు
జిల్లాలో మెట్ట ప్రాంతాలైనా గంగాధర, రామడుగు, చొప్పదండి, గన్నేరువరం, ఇల్లందకుంట వంటి మండలాల్లో బోర్‌వెల్స్, బావులు ఎక్కువ. బోర్‌వె ల్స్ ద్వారా సాగునీరు లభిస్తుండగా 13,888 ఎకరా లను సాగు చేస్తున్నారు. ఇక బావుల ద్వారా 1,42, 000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. జిల్లాలో అత్యధిక సాగు బావుల ద్వారానే సాగవుతోందని గణాంకాలు చాటుతున్నాయి. గతంలో వర్షాలు సమృద్ధిగా కురియడంతో భూగర్భజలాలు ౖపైపెకి చేరడంతో నీటికి ఢోకా లేదు. ఈ సారీ వర్షాలు సమృద్ధిగా ఉంటాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
ప్రాజెక్టులతో 1.16లక్షల ఎకరాలు
జిల్లాలో బావుల తరువాత అత్యధిక సాగువిస్తీర్ణం ప్రాజెక్టుల కిందే సాగవుతోంది. జిల్లాకు ఆయువుపట్టుగా ఎల్‌ఎండీ జలాశయం ఉండగా మిడ్‌మానేరు ద్వారా నీరందుతోంది. శ్రీరాంసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టుల తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోని రైతులకు సాగునీరందుతోంది. గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లోని పలు గ్రామాలకు వరద కాలువ ద్వారా సాగునీరు అందుతోంది. 1,16,280 ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు లభిస్తోందని సర్వేలో తేలింది.
అపరాలు, కూరగాయల సాగు పెంపుకు కృషి
జిల్లాలో పప్పుల సాగు, కూరగాయల సాగు తగ్గింది. ఇతర జిల్లాలపై ఆధారపడాల్సి వస్తోంది. రైతులు వాణిజ్య పంటలకే మొగ్గు చూపుతున్నారు. కందులు, పెసలు, మినుములు, రాగులు, సజ్జలు, జొన్నలు వంటి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలో 2వేల ఎకరాల్లో కూరగాయలు సాగవుతున్నాయి. ప్రజల అవసరాల దృష్ట్యా కూరగాయల సాగు విస్తీర్ణం రెట్టింపు చేసేలా ప్రయత్నిస్తున్నాం.
– బత్తిని శ్రీనివాస్, డీఏవో, కరంనగర్
Comments
Please login to add a commentAdd a comment