వయస్సు రెండున్నరేళ్లు.. ఐక్యూ అదుర్స్‌ | Story On Talented Kid Sai Satya Surya | Sakshi
Sakshi News home page

చిన్నారి ఐక్యూ అదుర్స్‌

Published Thu, Aug 27 2020 9:29 AM | Last Updated on Thu, Aug 27 2020 9:29 AM

Story On Talented Kid Sai Satya Surya - Sakshi

కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద జెండాలు చూసి చెబుతున్న హేమాన్స్‌

రామచంద్రపురం రూరల్‌: ఆ చిన్నారి వయస్సు రెండున్నరేళ్లు. పేరు కట్టా హేమాన్స్‌ సాయి సత్య సూర్య. రామచంద్రపురం మండ లం తాళ్లపొలానికి చెందిన గౌడ, శెట్టిబలిజ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కట్టా సూర్యనారాయణ మనవడు. రెండు న్నరేళ్ల వయస్సులోనే ప్రపంచ దేశాల జెండాలను గుర్తిస్తూ అవి ఏ దేశానికి చెందినవో చెబుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. అంతే కాదు అక్షరాలు, అంకెలు, ఇంగ్లిష్‌ నెలలు, తెలుగు నెలలు, తెలుగు నక్షత్రాలు, రాశులు, తిథులు, జాతీయ చిహ్నాలు, ఖండాలు, దేశంలోని రాష్ట్రాలు–వాటి రాజధానులు, 115 రకాల పరమాణు మూలకాలు, ప్రఖ్యాత వ్యక్తులు తదితర అంశాలను అలవోకగా చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. హేమాన్స్‌ తల్లిదండ్రులు నిరోష, శర్వాణి ఇద్దరూ విశాఖపట్నంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి నుంచి తాళ్లపొలంలోనే ఉంటున్నారు. చిన్నారి ప్రతిభకు పదును పెడుతున్న తల్లిదండ్రులను స్థానికులు అభినందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement