రూ.791 కోట్ల నిధులను దారి మళ్లించారు
భువనగిరి మహాధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్
సాక్షి, యాదాద్రి: కేంద్రం ఇచ్చిన రూ.791 కోట్ల కరువు నిధులు టీఆర్‌ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ విధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా యన్నారు.
రుణమాఫీ కింద రావల్సిన రూ.8 వేల కోట్ల బకారుులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రూ. 1.60 లక్షల సబ్సిడీతో కేంద్రం 91 వేల ఇళ్లను మంజూరు చేస్తే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వాటిని పేదలకు ఇవ్వలేదన్నారు.