
కోరుట్ల/మెట్‌పల్లి: ‘తెలంగాణలో రజాకార్ల అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచిన నిజాం గొప్ప రాజట.. సీఎం కేసీఆర్ పొగడ్తలు విడ్డూ రంగా ఉన్నాయి.. తెలంగాణ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారు.. ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెబుతారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. మజ్లిస్ మద్దతు కోసం కేసీఆర్ నిజాంను పొగుడుతున్నారన్నారు. టీఆర్‌ఎస్ కుటుంబ పాలన అవినీతితో నిండి పోయిందన్న విషయాన్ని ప్రజలు గమ నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ దేశంలో అవసాన దశలో ఉందన్నారు. రైతులు మద్దతు ధర అడిగినందుకు వారికి బేడీలు వేసిన ఘనత దేశంలో ఒక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని లక్ష్మణ్ అన్నారు. మెట్‌పల్లిలో చెరకు రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment