సాక్షి,ఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తుపై వస్తున్న ఊహాగానాలకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెరదించారు. ఢిల్లీలో ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీకి ఎలాంటి పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ కాళ్ల బేరానికి వచ్చినా ఆ పార్టీతో పొత్తు ఉండదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను పార్లమెంటరీ బోర్డు సభ్యుని హోదాలో చెబుతున్నానన్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు.
బీఆర్‌ఎస్ మునిగిపోయే నావ అని, బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని లక్ష్మణ్ తెలిపారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రహస్య ఒప్పందం చేసుకున్నాయన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కవిత కేసులో విచారణ జరుగుతోందన్నారు. ఆంధ్రలో పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
17 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంది : కిషన్‌రెడ్డి
రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ విజయసంకల్ప యాత్రలు మంగళవారం నుంచి ప్రారంభమవనున్న సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. యాత్ర రథాలను స్వయంగా నడిపారు.
అనంతరం మాట్లాడుతూ ‘రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తాం. 20 నుంచి మార్చి 2 వరకు విజయ సంకల్ప యాత్రలు జరుగుతాయి. సమిష్టి నాయకత్వంలో, పార్టీ జెండా కింద యాత్రలు కొనసాగుతాయి. యాత్రల్లో భాగంగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు ఉంటాయి. అన్ని సామాజిక వర్గాలను కలుస్తాం. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో సైతం బీజేపీ గెలవడం ఖాయం’ అని చెప్పారు.
ఇదీ చదవండి.. ఆ ఎంపీ స్థానం నుంచే పోటీ.. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment