సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతిపక్షాలు ఇచ్చింది ఛార్జ్‌షీట్ కాదు రిప్రజెంటేషన్ అని చెప్పుకొచ్చారు.
మంత్రి పొన్నం ప్రభాకర్.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్‌షీట్‌లకు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు ఇచ్చింది ఛార్జ్‌షీట్ కాదు రిప్రజెంటేషన్. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు. వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ ఛార్జ్‌షీట్.. మాకు ఇచ్చిన రిప్రజెంటేషన్‌గా భావించి వాటిని కూడా పరిశీలిస్తాం. కానీ, దురదృష్టకరం ఎంటంటే సంవత్సర కాలం పరిపాలన తరువాత ఇప్పుడు ఛార్జ్‌షీట్ ఇచ్చి మమ్మల్ని విమర్శిస్తే బాగుండేది.
అంతేకానీ, ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుండే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్ళీ సంవత్సరం కాగానే ఛార్జ్‌షీట్ ఇవ్వడం భావ్యం కాదు. ప్రభుత్వం ఏర్పడిన నెలకు ప్రభుత్వం ఎలా నడుస్తుంది అన్నారు.. పిల్లి శాపనార్థాలు పెట్టారు. ప్రభుత్వాన్ని కూల గొడతామన్నారు. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారు. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనించాలి. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment