మిజోరంలోని గూర్ఖా జాతీయులకు తమ దీర్ఘకాల డిమాండ్ సాధనకు కొత్త ఆయుధం దొరికింది.
ఐజ్వాల్: మిజోరంలోని గూర్ఖా జాతీయులకు తమ దీర్ఘకాల డిమాండ్ సాధనకు కొత్త ఆయుధం దొరికింది. తమను ఓబీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌పై గత ప్రభుత్వాలు అనుసరించిన ప్రతికూల వైఖరికి వ్యతిరేకంగా నవంబర్ 25న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ‘నోటా’(ఈవీఎంలోని పైన ఎవరికీ కాదు అనే ఆప్షన్)’ను వారు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. అస్సాంలో భాగంగా ఉన్నప్పుడు తమకు ఓబీసీలుగా గుర్తించారని, మిజోరాం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తరువాత జనరల్ కేటగిరీలో చేర్చారని మిజోరాం గూర్ఖా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ హెచ్‌బీ థాపా వివరించారు. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ఉపయోగించుకోలేకపోతున్నామన్నారు. మిజోరం రాజకీయాల్లో ఆ సంఘం ప్రభావం ఎక్కువ. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లోని 23 నియోజకవర్గాల్లో గూర్ఖా జాతీయులు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం గూర్ఖా ఓటర్ల సంఖ్య 9771.