సాక్షి, మంచిర్యాల డెస్క్: తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నోటాకు 1,04,244 ఓట్లు పోల్ అయ్యాయి. వీటిలో 1,583 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సరైనవారు లేరని ఓటర్లు భావించిస్తే.. నోటాకు ఓటువేసే అవకాశం ఎన్నికల సంఘం 2013 నుంచి కల్పించింది. ఈవీఎంలో అభ్యర్థుల గుర్తుల తర్వాత చివరిగా నోటా గుర్తు ఉంటుంది.
చాలాచోట్ల రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కూడా ఓట్లు సాధించడంలో నోటా కంటే వెనుకబడ్డారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల తర్వాత నోటాకు ఓట్లు పడగా నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. మల్కాజిగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 13,206 ఓట్లు నోటాకు పడగా, అత్యల్పంగా జహీరాబాద్ నియోజకవర్గంలో 2,933 ఓట్లు పడ్డాయి. పోస్టల్ ఓట్లలో కూడా మల్కాజిగిరిలో అత్యధికంగా 160 ఓట్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment