
లోక్‌సభ సీట్లలో భారీగా ఓట్లు
సాక్షి బెంగళూరు: ఉప ఎన్నికల ఫలితాల్లో ‘నోటా’ సత్తా చాటింది. పై అభ్యర్థుల్లో ఎవరికీ కాదు.. అనే ఆప్షన్‌కు ఓటర్లు పెద్దసంఖ్యలో మద్దతు పలికారు. దీనికి పలు కారణాలు ప్రచారంలో ఉన్నాయి. మరో ఆరు నెలల్లో లోక్‌సభకు ఎన్నికలు ఉండగా మళ్లీ ఉప ఎన్నికలు ఎందుకని చాలామంది తమ నోటా ద్వారా ప్రశ్నించారు. మండ్య పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా 15,480 ఓట్లు నోటాకు పడటం విశేషం. కాగా జమఖండి అసెంబ్లీ నియోజకవర్గంలో తక్కువగా 724 ఓట్లు పడ్డాయి. ఇంకా నాలుగేళ్లకు పైగా పదవీకాలం ఉండటంతో రెండు విధానసభ ఉ ప ఎన్నికలోనూ నోటాకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. తమకు అభ్యర్థులు నచ్చకపోయినా నోటాకు ఓటు వేసి ఉంటారని ప్రచారం సాగుతోంది.
ఏ నియోజకవర్గంలో ఎన్ని నోటా ఓట్లు
♦ మండ్య – 15,480 ♦ శివమొగ్గ – 10,687
♦ బళ్లారి – 12,413 ♦ రామనగర – 2,909
♦ జమఖండి – 724.