‘గ్రేటర్‌’ తీర్పు: కారుకు బ్రేక్‌.. కమలానికి షాక్‌  | GHMC Elections: TRS And BJP Reviewing Defeat In Election | Sakshi
Sakshi News home page

ఓటమిపై సమీక్షించుకుంటున్న పార్టీలు

Published Mon, Dec 7 2020 8:09 AM | Last Updated on Mon, Dec 7 2020 10:28 AM

GHMC Elections: TRS And BJP Reviewing Defeat In Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ఆయా పార్టీల ఆధిక్యతలపై స్పష్టమైన ప్రభావం చూపింది. ఎక్కువ స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్‌ఎస్‌ దాదాపు 17 చోట్ల స్వల్ప తేడాలతో విజయానికి దూరమైంది. బీజేపీ స్వల్ప తేడాతో ఓడిన స్థానాల్లోనూ నోటాకు ఎక్కువ ఓట్లు పడడం ఆ పార్టీ అభ్యర్థుల భవితవ్యాన్ని తలకిందులు చేసింది. ఇలా స్వల్ప తేడాతో ఓడిన స్థానాల్లో పరాజయానికి కారణాలపై ఆయా పార్టీలు విశ్లేషించుకునే పనిలో పడ్డాయి. అయితే.. బీఎన్‌రెడ్డి నగర్‌లో 32 ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్‌          

 బంజారాహిల్స్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌కు 10,227, బీజేపీకి 9,446 ఓట్లు వచ్చాయి. నోటాకు 805 ఓట్లు వచ్చాయి. 126 చెల్లని ఓట్లు ఉన్నాయి. బీజేపీ 781 ఓట్లతో తేడాతో ఓడిపోయింది. ఇక్కడా నోటాకు 805 ఓట్లు రావడం బీజేపీ ఓటమిపై ప్రభావాన్ని చూపింది.  

 మచ్చబొల్లారం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌కు 12,089, బీజేపీకి 12,055 ఓట్లు వచ్చాయి. కేవలం 34 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. ఇక్కడా నోటాకు 302 ఓట్లు పడడం కూడా టీఆర్‌ఎస్‌కు కలిసివచ్చింది. బీజేపీ ఓటమి పాలైంది. అభ్యర్థి పరాజయం పొందగా.. అది కూడా డమ్మీ అభ్యర్థిగా నిలిచిన ఆమె కుమారుడికి 39 ఓట్లు పడడంతో ఆమె విజయం తారుమారైంది. ఈ విధంగానే చాలాచోట్ల నోటా, చెల్లనిఓట్లు  అభ్యర్థులు పరాజయం పొందిన ఓట్లకు ఎక్కువగా, సమంగా ఉండడం కూడా ఆయా పార్టీ నేతలను మథనపడేలా చేశాయి. బీఎన్‌రెడ్డి నగర్,  మల్కాజిగిరి, అడిక్‌మెట్, హస్తినాపురం, వినాయక్‌నగర్, రాంగోపాల్‌పేట, రాంనగర్, మూసాపేట, రామంతాపూర్, వనస్థలిపురం, జూబ్లీహిల్స్, మంగళ్‌హాట్, సైదాబాద్, గచ్చిబౌలి, అమీర్‌పేట, హబ్సిగూడ, కవాడిగూడలలో స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్‌ పరాజయం పాలైంది. 
 
కొన్ని డివిజన్లలో ఇలా.. 
 మల్కాజిగిరి డివిజన్‌లో గెలిచిన బీజేపీ అభ్యర్థికి 8,361 ఓట్లు పోల్‌ కగా.. కేవలం 172 ఓట్ల తేడాతో ఓడిపోయిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 8,188 ఓట్లు పోలయ్యాయి. విచిత్రమేమిటంటే మెజారిటీ 172 ఓట్లను మించి ఇక్కడా నోటాకు 245 ఓట్లు పడడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి భంగపాటుగా మారింది.

 వినాయక్‌నగర్‌ డివిజన్‌లో బీజేపీకి 9,972 ఓట్లు, టీఆర్‌ఎస్‌కు 9,685 ఓట్లు పోలయ్యాయి. 287 ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓడిపోగా ఆ అంకెకు సమానంగా అంటే 287 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఇలా నోటా ఓట్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  

 వనస్థలిపురం డివిజన్‌లో బీజేపీ అభ్యర్థికి 9,214 ఓట్లు, టీఆర్‌ఎస్‌కు 8,513 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌కు 1374, టీడీపీకి 772, ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు 119 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 259 ఓట్లు పడగా, చెల్లని ఓట్లు 269 ఉన్నాయి. ఇక్కడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 702 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 

 హస్తినాపురం డివిజన్‌లో బీజేపీకి 8036, టీఆర్‌ఎస్‌కు 7,757 ఓట్లు వచ్చాయి. కేవలం 279 ఓట్లతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓడిపోయారు. నోటాకు 247 ఓట్లు పడగా, 458 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఇటు నోటాకు ఓట్లు వేయకపోయినా, అటు చెల్లని ఓట్లు లేకుండా పరిగణనలోకి వచ్చి ఉంటే 279 ఓట్లు ఈజీగా తమ అభ్యర్థి ఖాతాలో చేరిపోయి ఉండేవని టీఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నాయి.   

 అడిక్‌మెట్‌ డివిజన్‌లో బీజేపీకి 7,830, టీఆర్‌ఎస్‌కు 7600 ఓట్లు వచ్చాయి. కేవలం 239 ఓట్లతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పరాభవం పొందారు. గెలుపును ప్రభావితం చేసిన 239 ఓట్ల కన్నా ఎక్కువగా నోటాకు 265 ఓట్లు పోలవడంతో ఓడిన పార్టీ అభ్యర్థులు నైరాశ్యంలో మునిగిపోయారు. 

⇔ రాంనగర్‌ డివిజన్‌లో బీజేపీకి 9,819, టీఆర్‌ఎస్‌కు 9291 ఓట్లు పోలయ్యాయి. 528 ఓట్లతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓడిపోయారు. ఇక్కడా నోటాకు 215, చెల్లని ఓట్లు 307 వరకు అంటే మొత్తం 522 ఓట్లు అభ్యర్థులకు పనికిరాకుండా పోయాయి.  

⇔ సైదాబాద్‌ డివిజన్‌లో బీజేపీకి 10,621, టీఆర్‌ఎస్‌కి 9,710 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 188, చెల్లని ఓట్లు 370 ఉన్నాయి. ఇక్కడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 911 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడా స్థానిక సమస్యల బాగా ప్రభావితం చేశాయి 

⇔ గచ్చిబౌలి డివిజన్‌లో బీజేపీకి 10,602, టీఆర్‌ఎస్‌కు 9,467 ఓట్లు వచ్చాయి. నోటాకు 207 ఓట్లు పడ్డాయి. 562 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఇక్కడ సైతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 1,135 ఓట్ల తేడాతో ఓడిపోయారు.  

⇔ రామంతాపూర్‌ డివిజన్‌లో బీజేపీకి 10,033, టీఆర్‌ఎస్‌కు 9,378 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 225 ఓట్లు వచ్చాయి, 310 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఇక్కడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 705 ఓట్లతో పరాజయం పొందారు. 

 హబ్సిగూడ డివిజన్‌లో బీజేపీకి 10,803, టీఆర్‌ఎస్‌కు 9,4356 ఓట్లు వచ్చాయి. నోటాకు 218 ఓట్లు వచ్చాయి. 426 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 1147 ఓట్లతో ఓడిపోయారు.

 ఇక ఎంఐఎం విషయానికొస్తే అత్యల్ప మెజారిటీ (1583 ఓట్లు) గెలిచింది జంగమ్మేట్‌లోనే. ఇక్కడా ఎంఐఎంకు 10,629 ఓట్లు, బీజేపీకి 9046 ఓట్లు పడ్డాయి. మెజారిటీ 1583ఓట్లు ఎంఐఎంకు వచ్చాయి. నోటాకు 66, చెల్లని ఓట్లు 756 వచ్చాయి. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్నా బీజేపీ అభ్యర్థి రాణించడంతో మెజారిటీ తగ్గిందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంది.  

కారును ముంచిన వరద ప్రాంతాలివే..  
నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రేటర్‌తో పాటు శివారులోని చాలా ప్రాంతాలు జలమయ్యాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అధికార పార్టీ నేతలు సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో చైతన్యపురి, హబ్సిగూడ, రామంతాపూర్, చంపాపేట, నాగోలు, సరూర్‌నగర్, గడ్డి అన్నారం, హయత్‌నగర్, వనస్థలిపురం, లింగోజీగూడ, హస్తినాపురం, మన్సూరాబాద్, మైలార్‌దేవ్‌పల్లి, జీడిమెట్లలో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement