అభ్యర్థి నచ్చకపోతే 'నోటా' నొక్కండి: హజారే | Use NOTA button if there is no right candidate: Anna Hazare | Sakshi

అభ్యర్థి నచ్చకపోతే 'నోటా' నొక్కండి: హజారే

Mar 18 2014 4:58 AM | Updated on Mar 9 2019 3:34 PM

అభ్యర్థి నచ్చకపోతే 'నోటా' నొక్కండి: హజారే - Sakshi

అభ్యర్థి నచ్చకపోతే 'నోటా' నొక్కండి: హజారే

లోకసభ ఎన్నికల్లో అభ్యర్థులు నచ్చకపోతే 'నోటా' బటన్ నొక్కి నిరసన వ్యక్తం చేయాలని ఓటర్లకు అవినీతిపై పోరాటం చేస్తున్న అన్నా హజారే పిలుపునిచ్చారు.

లోకసభ ఎన్నికల్లో అభ్యర్థులు నచ్చకపోతే 'నోటా' బటన్ నొక్కి నిరసన వ్యక్తం చేయాలని ఓటర్లకు అవినీతిపై పోరాటం చేస్తున్న అన్నా హజారే పిలుపునిచ్చారు. పార్టీలను మార్చితే దేశంలో మార్పు సంభవించదు అని హజారే అన్నారు. అధికార పార్టిని మార్చితే ఎలాంటి మార్పు ఉండదు అని ఆయన అభిప్రాయపడ్డారు.
 
దేశంలో గణనీయమైన మార్పులు సాధించాలంటే అసెంబ్లీ, లోకసభలకు మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని హజారే పిలుపునిచ్చారు. ఏ పార్టీయైనా అవినీతిపరుడు, గుండాలను, దోపిడిదారులను నిలబెడితే.. ఓటర్లు తగిన బుద్ది చెప్పాలని ఆయన కోరారు.
 
500 రూపాయలకు తన హక్కులను అమ్ముకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. సొంత గ్రామం రాలేగావ్ సిద్దిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement