
50 మంది స్వతంత్రుల తరఫున ప్రచారం చేస్తా: అన్నా
జల్నా: త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నిక ల్లో పోటీకి నిలిచే 50 మంది స్వతంత్ర అభ్యర్థుల తరఫున తాను ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్టు అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే తెలిపారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన 17 అంశాలతో తాను రూపొందించిన అజెండాను ఈ 50 మంది అభ్యర్థుల్లో 12 మంది అంగీకరించారని, వీరంతా మహారాష్ట్రకు చెందిన వారేనని తెలిపారు.
ఇప్పటికే తన ఎజెండాలోని అంశాలను బెంగాల్ సీఎం మమతా కూడా అంగీకరించారని వెల్లడించారు. తన అజెండాను అంగీకరించని కేజ్రీవాల్‌కు తన మద్దతు ఉండబోదని నొక్కి చెప్పారు. కాగా, జల్నా స్థానం నుంచి బరిలోకి దిగాలని యోచిస్తున్న స్వతంత్ర అభ్యర్థి బాలాసాహెబ్ దరాడేకు ఓటు వేయాలని ఈ సందర్భంగా ప్రజలకు అన్నా విజ్ఞప్తి చేశారు.