దశాబ్దం క్రితం దేశ ఎన్నికల్లో వినూత్న ప్రయోగానికి తెరలేచింది. పోటీలో ఉన్న అభ్యర్థులు, పార్టీల్లో ఎవరూ నచ్చకపోతే ఏం చేయాలనే ఓటర్ల సందిగ్దతకు తెరదించుతూ ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)లో ప్రత్యామ్నాయం లభించింది. అదే ‘నోటా’. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని చెప్పే బటన్. అయితే దీన్ని ఎంచుకుంటున్న ఓటర్ల సంఖ్య అంతంతే ఉంటోంది.
అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నా నోటాకు వేసే ఓట్లతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఇది కోరల్లేని పులిగా మారిందనేది విశ్లేషకుల వాదన. ఇండోర్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుని షాకివ్వడం, దాంతో నోటాకే ఓటేయాలని పార్టీ పిలుపునివ్వడం తెలిసిందే. దాంతో నోటా మరోసారి చర్చల్లోకి వచి్చంది...
ప్రయోజనం.. ప్చ్!
పారీ్టలు ఎన్నికల్లో నేరచరితులు, కళంకితులైన అభ్యర్థులను నిలబెట్టకుండా చూడటమే లక్ష్యంగా పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబరీ్టస్ (పీయూసీఎల్) అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. పోటీలో ఉన్నవారెవరూ ఓటర్లకు నచ్చని పక్షంలో తాము ఎవరికీ ఓటువేయాలనుకోవడం లేదని చెప్పేందుకు బ్యాలెట్ పేపర్లు/ఈవీఎంలలో తగిన ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ 2013 సెపె్టంబర్‌లో కోర్టు తీర్పు వెలువరించింది. అలా ఈవీఎంలలోకి నోటా బటన్ వచ్చి చేరింది. ఈవీఎం బ్యాలెట్ యూనిట్‌లోని 16 బటన్లలో చివరి ఆప్షన్‌గా నోటా ఉంటుంది.
దీనికి కూడా ప్రత్యేకంగా ఇంటూ (గీ) మార్కు కూడా కేటాయించారు. 2013లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నోటా గుర్తును తొలిసారి ప్రవేశపెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దీనికి మరింత ప్రాచుర్యం లభించింది. గత ఐదేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో కలిపి నోటాకు 1.29 కోట్ల ఓట్లొచ్చాయి. అయినా కళంకితులకు టికెట్లిచ్చే విషయంలో పారీ్టల తీరులో మార్పేమీ రాలేదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేరచరితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం నోటాకు ఎక్కువ ఓట్లు పడుతుండటం విశేషం!
ఆ పవర్ ఇస్తేనే...
ప్రస్తుత నిబంధనల ప్రకారం నోటాకు అభ్యర్థులందరి కంటే ఎక్కువ ఓట్లొచి్చనా ఎన్నికపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. ఆ ఓట్లన్నింటినీ పక్కనపెట్టి అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు వచి్చన వారే విజేత అవుతారు. అలా నోటా కేవలం అభ్యర్థులపై ఓటర్లు అసమ్మతిని వ్యక్తం చేసే ఆప్షన్‌గా మిగిలిపోతోంది. అలాగాక నోటాకే ఎక్కువ ఓట్లు పోౖలైతే తిరస్కరణకు గురైన అభ్యర్థులు మళ్లీ పోటీ చేయకుండా నిషేధించాలి. అప్పుడే పారీ్టలు నేరచరితులను పక్కన పెడతాయి’’ అని యాక్సిస్ ఇండియా చైర్మన్ ప్రదీప్ గుప్తా అభిప్రాయపడ్డారు. నోటాకు నిర్దిష్ట శాతానికి మించి ఓట్లు పోలైతే అభ్యర్థులను మార్చడం, మళ్లీ ఎన్నిక నిర్వహించడం వంటి మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు.
👉 ఏడీఆర్ డేటా ప్రకారం ఎన్నికల్లో నోటాకు 0.5 శాతం నుంచి 1.5 శాతం మేర ఓట్లు పోలయ్యాయి.
👉 2019 లోక్‌సభ ఎన్నికల్లో నోటాకు ఏకంగా 1.06 శాతం ఓట్లు రావడం విశేషం!
👉 లోక్‌సభ ఎన్నికల చరిత్రలో నోటాకు లక్షద్వీప్‌లో అతి తక్కువగా 100 ఓట్లే పడ్డాయి.
👉 బిహార్‌లోని గోపాల్‌గంజ్ ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో నోటాకు అత్యధికంగా 51,660 ఓట్లు వచ్చాయి.
👉 2018 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా నోటాకు 1.98 శాతం ఓట్లు దక్కాయి.
👉 మహారాష్ట్రలోని లాతూర్ రూరల్ అసెంబ్లీ స్థానంలో నోటాకు అత్యధికంగా 27,500 ఓట్లు పడ్డాయి. మొత్తం ఓట్లలో ఇవి ఏకంగా 13 తం! అక్కడ 67 శాతం ఓట్లతో గెలిచిన ధీరజ్ దేశ్‌ముఖ్ తర్వాత నోటాకే రెండో స్థానం దక్కడం విశేషం.
👉 ఇటీవలి ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాల్లో నోటా మూడో స్థానంలో నిలిచింది!
👉 మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాల్లో గెలిచిన అభ్యర్థి సాధించిన మెజారిటీ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి!
👉 క్రిమినల్ కేసులున్న ముగ్గురికి మించి అభ్యర్థులు పోటీ చేసే రెడ్ అలర్ట్ నియోజకవర్గాల్లో 2018 నుంచి నోటాకు 27.77 లక్షల ఓట్లు పోలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment