ఢిల్లీ: ఎన్నికల్లో కొంతమంది పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు కాకుండా.. నోటా గుర్తుకు ఓటు వేస్తుంటారు. ఇటీవల ఇండోర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థి లేకుండా పోయారు.
ఇండోర్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి లేకపోవడంతో బీజేపీకి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. దీంతో ఈ రోజు (సోమవారం) జరుగుతున్న నాలుగో దశ ఎన్నికల్లో కార్యకర్తలు, ప్రజలు నోటా గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నోటాకు ఓటు వేసి బీజేపీకి గుణపాఠం చెప్పాలని అన్నారు.
నిజానికి నోటా గుర్తుకు 99 శాతం మంది ఓటు వేసి, ఒక్కరు అక్కని పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటు వేసినా.. ఆ అభ్యర్థే విజేతగా నిలుస్తారని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ పేర్కొన్నారు. అయితే ఒక నియోజక వర్గంలో నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు.. అక్కడి అభ్యర్థిని అక్కడి ప్రజలు ఎన్నుకోవడానికి సుముఖత చూపడం లేదని దానిపైన ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని అన్నారు. దీనివల్ల పార్లమెంటు, ఎన్నికల కమిషన్‌లపై ఒత్తిడి పెరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment