నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విజయ్ దేవరకొండ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని ఇచ్చాడు. తన ఫ్యాన్స్‌ను రౌడీస్ అంటూ పిలుచుకునే ఈ యంగ్ హీరో సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌పై స్పందించాడు. ఈ మేరకు అభిమానులకు ఓ లేఖ రాశాడు. ‘ప్రియమైన రౌడీస్ సినిమా, జీవితం, రౌడీ కల్చర్, యాటిట్యూడ్‌లతో మనం మనలా ఉండేందుకు మనం ఓ మార్పు తీసుకువస్తున్నాం. అదే సమయంలో మనం సోషల్ మీడియా పరంగా కూడా కొత్త ట్రెండ్ తీసుకురావాలి.
మీలో చాలా మంది ప్రేమతో నా ఫొటోను డీపీగా పెట్టుకుంటున్నారు. అయితే దీని కారణంగా మీ కొంత మందిలో వాదనలకు దిగుతున్నారు. నేను అలాంటివి చేయను అందుకే మీరు కూడా చేయోద్దు. నేను సాధించిన విజయాలు నా స్వశక్తి తోనే సాధించా.. అందుకే ఇతర గురించి నేను పట్టించుకోను. అందుకే మిమ్మల్ని ద్వేశించే వారు కూడా ఆనందంగా ఉండాలని కోరుకోండి. నేను మీకు ఎప్పటికీ మంచి సినిమాలు, మంచి దుస్తులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఆన్‌లైన్ వివాదాలు చూడటం నాకు ఇష్టంలేదు’ అంటూ ఓ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ.
As we grow in numbers, it's time we set our own rules. We are young and can make this change - You and Me. pic.twitter.com/vxlOEaoS4l
— Vijay Deverakonda (@TheDeverakonda) 3 October 2018
Comments
Please login to add a commentAdd a comment