ముంబై: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో దెబ్బ పడింది కాంగ్రెస్‌కే. హర్యానా, తెలంగాణల్లో రెండు స్థానాలను పొగొట్టుకుంది. అందులో ఒకటి బీజేపీ, మరొకటి టీఆర్‌ఎస్(బీఆర్‌ఎస్) వశం అయ్యాయి. ఇక మహారాష్ట్ర అంధేరీ(తూర్పు) నియోజకవర్గం నుంచి శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం నుంచి రుతుజా రమేష్ లాట్కే.. 66వేల ఓట్ల మార్జిన్‌తో ఘన విజయం సాధించారు.
శివసేన ఎమ్మెల్యే రమేష్ లాట్కే ఈ మే నెలలో మరణించారు. దీంతో అంధేరీ(తూర్పు) స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతు మాత్రమే కాదు.. బీజేపీ సైతం ఇక్కడ తమ అభ్యర్థిని దింపకపోవడంతో.. రుతుజాకి బాగా కలిసొచ్చింది. ఈ క్రమంలో..ఈ ఉప ఎన్నికలో అంధేరీ ఓటర్లు భలే సర్‌ప్రైజ్ ఇచ్చారు.
రుతుజాతో పాటు ఈ ఉప ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు. ఆ ఆరుగురు అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఇప్పటివరకు దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇలా.. అభ్యర్థుల(ప్రధాన పార్టీ అభ్యర్థులు కాదు) కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోల్ కావడం గమనార్హం. అంటే రుతుజా తర్వాత నోటా ఓట్లే రెండు స్థానంలో నిలిచాయన్నమాట.
రుతుజా లాట్కే.. గతంలో బృహణ్‌ముంబై మున్సిపల కార్పొరేషన్‌లో క్లర్క్‌గా పని చేశారు. రాజీనామా అనంతరం ఆమె ఉప ఎన్నికల బరిలో దిగారు. త్వరలో ముంబై స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండడంతో.. థాక్రే వర్గంలో ఈ విజయం జోష్‌ను నింపింది. మరోవైపు ప్రజలు తమవైపే ఉన్నారనడానికి ఈ ఫలితమే నిదర్శనమని మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించుకున్నారు.
ఇదీ చదవండి: ప్చ్.. కారు హవాను తక్కువగా అంచనా వేశాం!
Comments
Please login to add a commentAdd a comment